మియన్మార్: ఏరోబిక్స్ టీచర్ ఎక్సర్‌సైజ్ వీడియోలో రికార్డైన సైనిక కుట్ర

KHING HNIN WAI

ఫొటో సోర్స్, KHING HNIN WAI ON FACEBOOK

ఖింగ్ నిన్ వాయ్ కెమెరా ముందు డాన్స్ చేస్తూ తన విద్యార్థులకు వ్యాయామ శిక్షణ ఇస్తుంటారు.

ఎప్పటిలాగానే ఆ రోజు కూడా మియన్మార్‌ రాజధాని నేపీటాలో కెమెరా ముందు వ్యాయామ సూచనలు చేస్తున్నారు. కానీ ఆమెకు తెలియకుండా ఆమె వెనుక జరిగిన ఒక అసాధారణ పరిణామం ఆమో వ్యాయామంతో పాటు వీడియోలో రికార్డయింది.

మొదట చూసినపుడు ఆ వీడియో మామూలు వ్యాయామ సూచనల వీడియో లాగానే కనిపిస్తుంది. ఆ వీడియోను మియన్మార్ పార్లమెంటుకు దారితీసే ప్రధాన రహదారి మీద ఒక కూడలి నేపథ్యంగా ఆమె చిత్రీకరించారు.

అయితే వ్యాయామం చేస్తున్న ఆమె వెనుకపక్క సాయుధ సైనిక వాహనాలు వరుసగా వెళుతుండటం కూడా కనిపిస్తుంది. అది చూస్తే ఏదో భారీ సంఘటన జరుగుతోందని అనిపించక మానదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఏరోబిక్స్ టీచర్ అయిన ఖింగ్ తన ఈ వీడియోను సోమవారం ఉదయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఆ సమయంలో మియన్మార్ సైన్యం సైనిక కుట్రను అమలు చేస్తూ ఉంది. ఆంగ్ సాన్ సూచీతో పాటు ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆమె పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తోంది.

KHING HNIN WAI

ఫొటో సోర్స్, KHING HNIN WAI ON FACEBOOK

సైన్యం ఆ తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకుని దేశంలో ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సూచీ పార్టీ ఇటీవలి ఎన్నికల గెలుపులో అక్రమాలకు పాల్పడిందని సైన్యం ఆరోపించింది.

రోబిక్స్ టీచర్ ఖింగ్ పోస్ట్ చేసిన వీడియోలో.. తన వెనుక వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తూ వ్యాయామం చేస్తున్నారు.

తన చుట్టూ జరుగుతున్న తీవ్ర పరిణామాలను ఆమె గుర్తించలేదు.

ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో వేలాది మంది వీక్షించారు.

షేర్ చేశారు. తన వెనుక సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రక్రియకు, ఖింగ్ వ్యాయామం చేస్తున్న సంగీతానికి మధ్య అధివాస్తవిక వైరుధ్యం గురించి చాలా మంది కామెంట్లు చేశారు.

‘‘నేపథ్య దృశ్యం, సంగీతం ఒక రకంగా మ్యాచ్ అవుతున్నాయి’’ అని ఆమె తన పోస్టులో రాశారు. ‘‘ఈ రోజు ఉదయం వార్త బయటకు రావటానికి ముందు నేను ఒక కాంపిటిషన్ కోసం ఏరోబిక్స్ వీడియో చేస్తున్నాను. ఇది ఎలాంటి జ్ఞాపకమో’’ అని కూడా వ్యాఖ్యానించారు.

మియన్మార్ సైనిక కుట్ర

ఫొటో సోర్స్, Reuters

ఈ వీడియో నిజమైనదేనా?

ఈ వీడియో నిజంగా చిత్రీకరించినదేనని పలువురు నిపుణులు నిర్ధారించారు. ఏరోబిక్స్ టీచర్ ఖింగ్‌ను బీబీసీ సంప్రదించింది. ఆమె తన వీడియో నిజమైనదేనని ధ్రువీకరించారు.

ఆ రోడ్డు కూడలి సమీపంలో తాను గత 11 నెలలుగా వ్యాయామం చేస్తున్నట్లు ఆమె మరో ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు.

దానిని నిరూపించటానికి తాను గతంలో అక్కడే ఇటువంటి వ్యాయామం చేస్తూ చిత్రీకరించిన ఇతర వీడియోలను కూడా పోస్ట్ చేశారు.

మియన్మార్ సైన్యం మద్దతుదారుల విమర్శలపై.. తనను తాను సమర్థించుకుంటూ ఆమె ఫేస్‌బుక్‌లో స్పందించారు.

‘‘ఏదో సంస్థను వెక్కిరించటానికో, హేళన చేయటానికో నేను డాన్స్ చేయలేదు. నేను ఒక ఫిట్‌నెస్ డాన్స్ కాంపిటిషన్ కోసం డాన్స్ చేశాను.

నేపీటాలో సైనిక వాహనాల కాన్వాయ్ కనిపించటం అసాధారణమేమీ కాదు. అందువల్ల ఆ రోజు కూడా మామూలేనని భావించాను.

నా మామూలు ఏరోబిక్స్ వ్యాయామాన్ని కొనసాగించాను’’ అని బదులిచ్చారు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను విస్తృతంగా వీక్షించారు. ట్విటర్‌లో ఒక భారత జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 1.65 లక్షల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)