జపాన్: ఇల్లు ఖాళీ చేయిస్తారనే భయంతో తల్లి మృతదేహాన్ని 10 ఏళ్లుగా ఫ్రిజ్‌లో దాచిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని తన ఇంట్లోనే ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
జపాన్‌లోని టోక్యోలో నివసిస్తున్న 48 ఏళ్ల యుమి యోషినో తల్లి పదేళ్ల కిందట చనిపోయారు. ఆమె చనిపోయారని తెలిస్తే తనను ఆ ఇల్లు ఖాళీ చేయమంటారనే భయంతో తల్లి మృతదేహాన్ని ఇన్నాళ్లుగా ఫ్రీజర్‌లో దాచిపెట్టారని స్థానిక మీడియా తెలిపింది.
గడ్డ కట్టుకుపోయిన యుమి తల్లి శరీరంపై బయటకి కనిపించే గాయాలేవీ లేవని పోలీసులు తెలిపారు.
ఆమె చనిపోయిన సమయం, కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గత కొన్ని నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇటీవలే యుమి చేత ఆ ఇల్లు ఖాళీ చేయించారు.
తరువాత ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లినవారు ఫ్రీజర్‌లో ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు.
ఫ్రీజర్‌లో పట్టేందుకు వీలుగా శరీరాన్ని వంచి, లోపల కుక్కి పెట్టారని పోలీసులు తెలిపారు.
శుక్రవారం టోక్యోకు దగ్గర్లో ఉన్న చీబా నగరంలోని ఒక హోటెల్లో యోషినోను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా: సరస్సులో ఈదుతుంటే మొసలి పట్టుకుంది.. చివరకు దాని దవడలు చీల్చి బయటపడ్డాడు
- హైదరాబాద్: ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’.. ఒంటరి మహిళలే టార్గెట్... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- తెలంగాణ: ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








