డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచారు, కానీ నేను ఒప్పుకోను

ఫొటో సోర్స్, Reuters
ఒకపక్క డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్ గెలుపును ఒప్పుకునేది లేదని పునరుద్ఘాటిస్తూనే, ఆయన విజయం సాధించారని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంగీకరించారు.
“రిగ్గింగ్ చేయడం వల్లే బైడెన్ గెలిచారు’’ అని ట్విటర్‌లో ప్రకటించిన ట్రంప్, నవంబర్ 3నాటి ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇంతకు ముందులాగే ఎలాంటి ఆధారాలు చూపకుండా మరోసారి ఆరోపించారు ట్రంప్.
ఎన్నికల్లో అక్రమాలపై పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయన అనేక కేసులు వేశారు. కానీ వేటికీ ఆధారాలు చూపలేదు. పైగా అందులో వేటినీ కోర్టులు అంగీకరించ లేదు.
అమెరికా చరిత్రలోనే ఈసారి అత్యంత పకడ్బందీగా ఎలక్షన్స్ జరిగాయని, అక్రమాలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు అంతకు ముందే ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters
నర్మగర్భ వ్యాఖ్యలు
కానీ ట్రంప్ ఓటమిని ఇప్పట్లో అంగీకరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. “తాను రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతానని ట్రంప్ నమ్ముతున్నారు” అని వైట్‌హౌస్ ప్రతినిధి కెలియా మెకెనాని శుక్రవారం ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.
భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉంటారో ఎవరికి తెలుసు అని అదే రోజు వైట్‌హౌస్ మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే ఆదివారంనాడు.. బైడెన్ విజయం సాధించారంటూనే ఆ గెలుపు తాను అంగీకరించబోనని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తాజాగా ట్రంప్ చేసిన ఆరోపణలపై ట్విటర్ కూడా స్పదించింది. ‘ఈ ఆరోపణలు వివాదాస్పదం’ అంటూ ట్రంప్ ట్వీట్‌కు ఒక వార్నింగ్ నోట్‌ను జత చేసింది ట్విటర్.
మరోవైపు ట్రంప్ వాదనలకు మద్దతుగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శనివారంనాడు వాషింగ్టన్ డీసీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జెండాలు పట్టుకున్న వేలమంది అభిమానులు, రైట్‌వింగ్ కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వీరిలో కొందరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ధరించారు.
నిరసన ప్రదర్శనల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు 20మందిని అరెస్టు చేశారు. పలువురు పోలీసులు కూడా ఈ ఘర్షణల్లో గాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌పై పెరుగుతున్న ఒత్తిడి
ఇటు ఓటమిని అంగీకరించాలని, అధికార బదిలీకి సహకరించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
అధికార మార్పిడి వ్యవహారాన్ని చూడాల్సిన జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్‌ఏ) ఇంకా బైడెన్, కమలా హారిస్‌ల విజయాలను అధికారికంగా గుర్తించలేదు.
రక్షణ విభాగానికి సంబంధించిన అంశాలలో బ్రీఫింగ్ కోసం బైడెన్ వర్గానికి ఇంకా అనుమతులు రాలేదు. ఇలా యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని బైడెన్ ప్రతినిధి జెన్ సాకీ అన్నారు.
సంఖ్యాపరంగా తక్కువమందే అయినా, రిపబ్లికన్‌లలోని కొందరు కూడా అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించడం మంచిదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








