కరోనావైరస్: చైనాలో ఆరు నెలల తర్వాత మళ్లీ తెరుచుకుంటున్న సినిమా హాళ్లు.. పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవీ..

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో కరోనావైరస్ మహహ్మారిని నియంత్రించటం కోసం ఆరు నెలలుగా మూసివేసిన సినిమా హాళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి.
తక్కువ ముప్పు ఉన్న ప్రాంతంలోని సినిమా థియేటర్లను సోమవారం నుంచి పునఃప్రారంభించవచ్చునని చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది.
దేశంలోని చాలా భాగం ఇప్పుడు తక్కువ ముప్పు ఉన్న ప్రాంతంగా వర్గీకరించిన నేపథ్యంలో.. దాదాపు దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటాయి.
చైనా సినిమా హాళ్లు లాక్‌డౌన్ కారణంగా జనవరి నుంచి మూతబడటంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా థియేటర్లు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది.
పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవీ..
అయితే.. ఇప్పుడు మళ్లీ తెరుస్తున్న సినిమా థియేటర్లలో కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
- థియేటర్లలో ప్రేక్షకుల సామర్థ్యాన్ని 30 శాతానికి పరిమితం చేశారు.
- ప్రదర్శించే సినిమా షోల సంఖ్యను కూడా సగానికి తగ్గించారు.
- థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు జ్వరం ఉందేమో తనిఖీ చేస్తారు.
- ప్రేక్షకులతో పాటు, థియేటర్లలోని సిబ్బంది సైతం ఎల్లప్పుడూ మాస్కులు ధరించి ఉండటం తప్పనిసరి.
- టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలి.
- ప్రేక్షకులు ఒకరికొకరు కనీసం ఒక మీటరు దూరంలో మాత్రమే కూర్చోవాలి.
- థియేటర్లలోకి ఎటువంటి తినుబండారాలు, పానీయాలు అనుమతించరు.
థియేటర్ల ఆదాయంలో ఇవి గణనీయమైన భాగంగా ఉండేవి. ఇప్పుడు వీటికి అనుమతించకపోవటం థియేటర్లకు మరో పెద్ద దెబ్బ.
కోవిడ్ ప్రబలిన తొలి దేశమైన చైనా.. సినిమాలకు ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్. 2019లో దేశంలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు 920 కోట్ల డాలర్లుగా ఉంది.
కానీ థియేటర్ల మూసివేతతో పాటు దేశీయ, హాలీవుడ్ సినిమాల విడుదల నిలిచిపోవటమో, ఆన్‌లైన్‌లోకి మారటమో జరగటంతో ఈ వసూళ్లు దారుణంగా పడిపోనున్నాయి.
చైనాలో అతి పెద్ద సినిమా థియేటర్ల యజమాని వాండా ఫిల్మ్ సంస్థకు దేశవ్యాప్తంగా 600కు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 160 కోట్ల యువాన్ల భారీ నష్టం చవిచూస్తామని ఈ నెల ఆరంభంలో ప్రకటించింది. ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలానికి 52.4 కోట్ల ఆదాయం ఆర్జించింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- టిండర్, డంబుల్ వంటి డేటింగ్ యాప్‌లు పాతపడిపోయాయా?
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- బిట్‌కాయిన్ స్కామ్: ఒబామా, ఎలాన్ మస్క్ వంటి అమెరికా ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు హ్యాక్
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








