బిట్‌కాయిన్‌ స్కామ్‌: ఒబామా, ఎలాన్ మస్క్ వంటి అమెరికా ప్రముఖుల ట్విటర్‌ అకౌంట్లు హ్యాక్‌

కాన్యే వెస్ట్, ఎలాన్ మస్క్, బరాక్ ఒబామా, బిల్ గేట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాన్యే వెస్ట్, ఎలాన్ మస్క్, బరాక్ ఒబామా, బిల్ గేట్స్

బిట్‌కాయిన్‌ స్కామ్‌లో భాగంగా ప్రపంచ బిలియనీర్లు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌ ట్విటర్‌ అకౌంట్లను హ్యాకర్లు టార్గెట్‌ చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జోబిడెన్‌తోపాటు కాన్యే వెస్ట్‌ ట్విటర్‌ అకౌంట్‌ నుంచి కూడా క్రిప్టోకరెన్సీ రూపంలో డోనేషన్లు కావాలంటూ రిక్వెస్టులు వచ్చాయి.

"అందరూ నన్ను దానం చేయమని అడుగుతున్నారు. దానికి ఇదే మంచి తరుణం'' అని బిల్‌గేట్స్‌ ట్విటర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. "నాకు 1,000 డాలర్లు పంపండి, నేను 2,000 డాలర్లు పంపుతాను'' అని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే ట్వీట్లు పోస్టు అయిన కొన్ని నిమిషాలకే డిలీట్‌ అయ్యాయి.

ఇది జరిగిన వెంటనే ట్విటర్‌ భద్రతా చర్యలు చేపట్టింది. బ్లూటిక్‌ ఉన్న వెరిఫైడ్‌ ఎకౌంట్‌ల నుంచి వస్తున్న అనేక ట్వీట్‌లను నిలిపివేసింది. పాస్‌వర్డ్ రీసెట్ రిక్వెస్ట్‌లను ట్విటర్‌ నిలిపివేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఎకౌంట్‌లన్నీ యథావిధిగా పని చేస్తున్నాయని, సమస్యను గుర్తించి సరి చేసే పనిలో ఉన్నామని ట్విటర్‌ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటి వరకు నమోదైన అతి పెద్ద హ్యాకింగ్‌ ఇది'' అని క్రౌడ్‌స్ట్రైక్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వ్యవస్థాపకులు దిమిత్రి అల్పెరోవిచ్‌ రాయిటర్స్‌ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.

"రాబోయే 30నిమిషాలలో మీరు నా డిజిటల్‌ వాలెట్‌కు పంపే బిట్‌కాయిన్‌ పేమెంట్‌కు రెట్టింపు మొత్తం ఇస్తాను'' అని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది." కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా నేను కొంత మొత్తాన్ని దానం చేయాలనుకుంటున్నాను'' అని బిట్‌కాయిన్‌ లింక్‌ అడ్రెస్‌తో వచ్చిన మెసేజ్‌లో రాసి ఉంది.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ అకౌంట్ నుంచి హ్యాక్ చేసి నఒక ట్వీట్
Presentational white space

మొత్తం మూడు మెసేజ్‌లలో మొదటిది డిలీట్‌కాగా, మిగతా రెండు అలాగే ఉన్నాయి.

ప్రముఖ ర్యాపర్‌ కాన్యేవెస్ట్‌, ఆయన భార్య, రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దర్షియాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, అధ్యక్షబరిలో ఉన్న జో బిడెన్‌, మీడియా అధిపతి మైక్‌ బ్లూమ్‌బెర్గ్‌లతోపాటు ఉబెర్‌, ఆపిల్‌ కంపెనీల ట్విటర్‌ ఎకౌంట్లు కూడా హ్యాక్‌ అయ్యాయి.

"హ్యాక్‌కు గురైన విషయం తెలిసిన కొద్ది నిమిషాలలోనే మా ఖాతాను ట్విటర్‌ లాక్‌ చేసింది'' అని జోబిడెన్‌ ప్రచార విభాగం వెల్లడించింది.

"ట్విటర్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇది ఒకటి '' అని బిల్‌గేట్స్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బోజోస్

ఫొటో సోర్స్, AFP

ఇదో అనూహ్యమైన దోపిడీ

జో టైడీ, సైబర్‌ సెక్యూరిటీ రిపోర్టర్‌

మీ బిట్‌కాయిన్‌ అమౌంట్‌ను రెట్టింపు చేసుకోండి అంటూ ట్విటర్‌లో ఇలాంటి స్కామ్‌లు జరగడం కొత్త కాకపోయినా, ప్రముఖుల అకౌంట్లను ఉపయోగించి భారీ కుంభకోణానికి దిగడం మాత్రం అనూహ్యమైనదే.

ఒకే సమయంలో వివిధ వ్యక్తుల ట్విటర్‌ అకౌంట్లు హ్యాక్‌ కావడం ఆ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏదో లోపముందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

ప్రాథమికంగా ఇక్కడ ఏం కనిపిస్తుందటే కొందరు ట్విటర్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రివేలేజ్‌లను సాధించి, వాటి ద్వారా తమకు కావాల్సిన వ్యక్తుల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను పొందగలిగారు.

తమ చేతికి చిక్కిన పవర్స్‌ను వాడుకుని హ్యాకర్లు ఎలాంటి వ్యక్తి అకౌంట్‌నైనా హ్యాక్‌ చేసి ఇష్టమొచ్చిన ట్వీట్లు చేయగలరు. ఏ కంపెనీ పేరునైనా చెడగొట్టగలరు.

వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. వీలయినంత తొందరగా డబ్బు సంపాదించడం. ఈ ట్వీట్లు ఎక్కువసేపు ఉండవన్న విషయం హ్యాకర్లకు తెలుసు. అందుకే వీలయినంత ద్వారా దోచేద్దామన్నది వారి ఆపరేషన్‌ లక్ష్యం.

ఇంత సొమ్ము దోపిడి గురైందని తేల్చినా, అసలు నిజంగా ఎంత మొత్తం పోయిందన్నది చెప్పడం కష్టం. సైబర్‌ నేరగాళ్లు తాము చేస్తున్నది నిజమేనని, న్యాయబద్ధమైనదని నమ్మించేందుకు వారి బిట్‌కాయిన్‌ అకౌంట్లలో కొంత సొమ్మును చూపిస్తారు.

ఈ హ్యాకర్లను గుర్తించడం, వారి నుంచి డబ్బు తిరిగి రాబట్టడం చాలా కష్టమైన పని. అందుకే ఇదంతా ఎందుకు జరుగుతోందని విచారణ అధికారులు,ఆగ్రహంతో ఉన్న యూజర్లు ట్విటర్‌ను నిలదీసే అవకాశం ఉంది.

"ప్రజలు ఇలాంటి కుంభకోణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి'' అని 2017లో తొలి బిట్‌కాయిన్‌ బిలియనీర్లుగా రికార్డులకెక్కిన కవలలు కామెరాన్‌ వింకిల్‌వాస్‌, టైలర్లు ట్వీట్‌లో హెచ్చరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌ లింక్‌ కనిపించిన కొద్ది సమయంలోనే 1 లక్ష డాలర్లు (80వేల యూరోలు) డొనేషన్ల రూపంలో స్కామ్‌ సృష్టికర్తల అకౌంట్లలోకి చేరినట్లు బ్లాక్‌చైన్‌ రికార్డులు చెబుతున్నాయి.

హ్యాకర్లు టార్గెట్‌ చేసుకున్న ట్విటర్‌ అకౌంట్లకు మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. గత ఏడాది ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ జాక్‌ డార్సీ అకౌంట్‌నే దుండగులు హ్యాక్‌ చేశారు. అయితే దీనికి కారణమైన సమస్యను పరిష్కరించామని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ స్కామ్‌ గురించి ఎఫ్‌బిఐ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. "క్రిప్టో కరెన్సీ మోసాలకు ఈ అకౌంట్లను వాడుకున్నారు'' అని ఎఫ్‌బిఐ తన ప్రకటనలో పేర్కొంది.

"ఇలాంటి ప్రకటనలను నమ్మి ప్రజలు తమ డబ్బును, క్రిప్టోకరెన్సీని ఇతరులకు పంపవద్దు'' అని ఆ సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)