#AsiaCup2022Final: మహిళల ఆసియా కప్‌ను 7వ సారి గెలిచిన టీమ్ ఇండియా... ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images
భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 ఆసియా కప్-2022 గెలిచింది. రికార్డు స్థాయిలో 7వ సారి కప్పును కైవసం చేసుకుంది.
ఇప్పటి వరకు 8 సార్లు ఈ టోర్నమెంట్ జరగ్గా అందులో 7సార్లు టీం ఇండియా విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌లో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంకను ఓడించింది భారత్.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్, 8.3 ఓవర్లకే టార్గెట్‌ను పూర్తి చేసింది. 25 బంతుల్లో 51 పరుగులు చేసిన స్మృతి మంధన, విజయంలో కీలక పాత్ర పోషించింది.
భారత్ బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా చేసింది. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రేణుక సింగ్ మూడు ఓవర్లకు 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఇందులో ఒకటి మెయిడిన్ ఓవర్ కావడం విశేషం.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని నరేంద్ర మోదీ, విరాట్ కోహ్లీ, హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ వంటి వారు మహిళా జట్టు మీద ప్రశంసలు కురిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2004లో తొలిసారి మహిళల ఆసియా కప్‌ను ప్రారంభించారు. అప్పుడు అది వన్డే ఫార్మెట్‌లో ఉండేది. అంటే 50 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేవారు. ఆ తరువాత దాన్ని 20 ఓవర్లకు అంటే టీ20 ఫార్మెట్‌లోకి మార్చారు.
ఈ ఏడాది జరిగిన టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ ఎనిమిదవది. 2018లో జరిగిన ఆసియా కప్ తప్ప మిగతా టోర్నీలన్నీ భారత్ గెలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
స్మృతి మంధన కీలక ఇన్నింగ్స్
ఫైనల్లో శ్రీలంకను ఓడించి కప్ గెలవడంలో స్మృతి మంధన ఆడిన ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఆసియాకప్‌లో థాయిలాండ్ మీద తన 100వ టీ20 మ్యాచ్‌ను ఆమె ఆడింది.
ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన భారతీయ మహిళా క్రికెటర్లు ఇద్దరు మాత్రమే. ఒకరు స్మృతి మంధన కాగా మరొకరు 135 మ్యాచులు ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్.
గత రెండేళ్లుగా మంధన టీం ఇండియాలో కీలక ప్లేయర్‌గా ఉంటూ వస్తోంది. టీ20ల్లో ఆమెకు మంచి రికార్డు ఉంది. 100 టీ20 మ్యాచుల్లో 122 స్ట్రైక్ రేటుతో 2,373 పరుగులు చేసింది. 77 వన్డేలలో 3,037 పరుగులు తీసింది.

ఫొటో సోర్స్, Reuters
2017లో సత్తా చూపిన మంధన
ఇంగ్లండ గడ్డ మీద మహిళా జట్టు 8 ఏళ్ల తరువాత తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచులో స్మృతి అర్థ సెంచరీ చేసింది. ఆ తరువాత రెండేళ్లకు ఆస్ట్రేలియా టూరులో సెంచరీ కొట్టింది.
2017 వరల్డ్ కప్‌కు ముందు మోకాలి గాయంతో కొన్నాళ్లు ఆటకు దూరమైంది. దాంతో ఆమె ఫిట్‌నెస్ మీద సందేహం మొదలైంది. కానీ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచులోనే ఇంగ్లండ్ మీద 90 పరుగులు కొట్టింది. ఆ తరువాత అయిదు రోజులకు వెస్టిండీస్ మీద 106 పరుగులు చేసింది.
వరల్డ్ కప్-2017లో టీం ఇండియా ఫైనల్‌కు వెళ్లినా కప్ గెలవలేక పోయింది. నాడు మహిళా జట్టుకు అనేక వర్గాల నుంచి అభినందనలు వచ్చాయి. మీడియాలోనూ కవరేజీ బాగా వచ్చింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













