మ్యాక్స్‌వెల్ రన్ అవుట్: స్టంప్స్ మీద ఒక బెయిల్ ఉన్నా ఔటేనా? ఐసీసీ క్రికెట్ నిబంధన ఏంటి?

ఫొటో సోర్స్, PANKAJ NANGIA
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ రన్ అవుట్ వివాదాస్పదంగా మారింది.
టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఎనిమిదో ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన స్లో డెలివరీని మ్యాక్స్‌వెల్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు కొట్టాడు.
ఆ తరువాత సింగిల్ పూర్తి చేసుకుని మ్యాక్స్‌వెల్ రెండో రన్ కోసం వస్తున్నప్పుడు ఫీల్డింగ్‌లో ఉన్న అక్షర్ పటేల్ బాల్‌ను పట్టుకొని వికెట్ల వైపు విసిరాడు. బాల్ స్టంప్స్‌ను తగిలి బెయిల్స్‌ను పడేయడంతో భారత్ అవుట్‌కు అప్పీల్ చేసింది.
థర్డ్ అంపైర్ రీప్లే చూడగా... సరైన సమయంలో మ్యాక్స్‌వెల్ క్రీజులోకి రాలేదనే విషయం స్పష్టమైంది. కానీ బాల్ వచ్చి వికెట్లను తగలడానికి ముందే కీపర్ దినేశ్ కార్తీక్ గ్లవ్స్ తగిలి స్టంప్స్ మీద బెయిల్ ఒకటి పైకి లేచిందనే విషయం కూడా తెలిసింది. బాల్ తగిలే సమయానికి ఒక్క బెయిల్ మాత్రమే స్టంప్స్ మీద ఉంది. దాంతో మ్యాక్స్‌వెల్ అవుట్ అయినట్లు థర్డ్ అంపైర్ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అప్పటి వరకు తాను అవుట్ కాను అనే ధీమాతో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన మ్యాక్స్‌వెల్ అంపైర్ నిర్ణయంతో చాలా నిరాశ చెందాడు.
అయితే మ్యాక్స్‌వెల్ అవుట్ అయిన విధానం మీద సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
కొందరు అవుట్ ఇవ్వడాన్ని సమర్థించగా మరికొందరు తప్పు పడుతున్నారు.
క్రికెట్ నిబంధనల్లో 29.1 రూల్ ప్రకారం... స్టంప్స్ మీద నుంచి ఒక బెయిల్ కానీ గాల్లోకి లేస్తే బ్యాటర్ అవుట్ చేయడానికి రెండో బెయిల్‌ను బాల్ పడేయాల్సి ఉంటుంది. లేదా మూడు స్టంప్స్‌లో ఏదో ఒక దాన్ని పడగొట్టాల్సి ఉంటుంది.
రీప్లేలో తాను ఏం చేశాడో చూశాక దినేశ్ కార్తీక్ చాలా ఒత్తిడికి గురయ్యాడు. చాలా టెన్షన్‌గా తప్పు చేసిన వాడిగా కనిపించాడు. కానీ తుది నిర్ణయం అవుట్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ నిబంధన ప్రకారం చూస్తే మ్యాక్స్‌వెల్ అవుట్ సరైనదేనని కొందరు అభిమానులు చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కానీ ఇలా చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
క్రికెట్‌లోని మన్కడింగ్ మీద కూడా ఇలాంటి వివాదమే ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మహిళా క్రికెట్ మ్యాచ్‌లో ఇండియన్ క్రికెటర్ దీప్తీ శర్మ మన్కడింగ్ చేయడం పెద్ద చర్చకు తెర తీసింది.
బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోని బ్యాటర్ క్రీజులో లేకపోతే వికెట్లను పడేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఇలా అవుట్ చేయడాన్ని క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా ఇంత కాలం చూస్తూ వచ్చారు.
అయితే ఇటీవల మన్కడింగ్‌ను న్యాయబద్ధమైన ఆటగానే చూస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇవి అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.
మన్కడింగ్‌ను 'ఫెయిర్ ప్లే'గా గుర్తించాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వారిలో ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకడు.
క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధనల ప్రకారం, బౌలర్ డెలివరీ పూర్తి చేసే వరకు నాన్ స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్ క్రీజులోనే ఉండాలి.

ఫొటో సోర్స్, FIONA GOODALL-ICC
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో క్రీజు దాటిన చార్లీ డీన్‌ను బౌలింగ్ చేస్తున్న దీప్తీ శర్మ అవుట్ చేసింది. అప్పుడు తొమ్మిది వికెట్లు పడిపోయినప్పటికీ ఇంగ్లండ్ విజయానికి చాలా దగ్గరగా ఉంది.
మన్కడింగ్ ద్వారా అవుట్ కావడంతో చార్లీ డీన్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇలా అవుట్ చేయడాన్ని విమర్శించాడు. బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా చార్లీని అవుట్ చేయాలనే ఉద్దేశంతోనే దీప్తీ శర్మ ఆడినట్లు ఆరోపించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇలా అవుట్ చేసినందుకు భారత టీం మొత్తం సిగ్గుపడాలని ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ అన్నారు.
మన్కడింగ్ చేసి గెలవడం తనకు ఇష్టముండదని, అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ట్వీట్ చేశాడు.
ఇలా దీప్తీ శర్మ, దినేశ్ కార్తీక్ రూపంలో ఇటీవల క్రీడా స్ఫూర్తి మీద చర్చ బాగా జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- క్యారెట్ రుచికి నవ్వి, క్యాబేజీ రుచికి ముఖం చిట్లించిన గర్భస్థ శిశువులు...ఈ ప్రయోగంలో ఏం తేలిందంటే..
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- ఇళ్లు ఇలా కట్టుకుంటే ఏసీల అవసరం తగ్గి, కరెంట్ బిల్ మిగులుతుంది. మరి కట్టడానికి ఇబ్బందులేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)