Climate Change: పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది

దిల్లీలోని చెట్లు

ఫొటో సోర్స్, Twitter/Hardeep Singh Puri

ఫొటో క్యాప్షన్, దిల్లీ

పర్యావరణ మార్పుల వల్ల నగరాల్లోని చెట్లకు ముప్పు ఉందని కొత్త పరిశోధన చెబుతోంది.

ఇప్పటికే సగం జాతుల చెట్లు వేడి ప్రభావాన్ని చవి చూస్తున్నాయని అది తెలిపింది.

భారత్‌లో దిల్లీలోని చెట్లకు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

ఓక్, మ్యాపిల్, పాప్లర్, పైన్స్ వంటి సుమారు 1,000 రకాల వృక్ష జాతులకు పర్యావరణ మార్పుల వల్ల ప్రమాదం పొంచి ఉంది.

ప్రస్తుతం ఉన్న వృక్ష జాతాలను రక్షించేలా మెరుగైన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. కరవును సమర్థవంతంగా ఎదుర్కోగల మొక్కలను నాటాలని చెబుతున్నారు.

పెద్దపెద్ద భవనాలు, ఆఫీసులు, రెసిడెన్సియల్ టవర్స్‌తో నిండి ఉండే నగరాలకు వేడి నుంచి ఎంతో కొంత ఉపశమనాన్ని చెట్లు కలిగిస్తాయి.

నగరాల్లోని చెట్లు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

పర్యావరణ మార్పుల వల్ల వాతావరణ పొడిగి మారితే ప్రమాదం ఎదుర్కొనే వృక్ష జాతుల సంఖ్య మరింత పెరుగుతుందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన మాన్యుయేల్ ఎస్పరాన్ అన్నారు.

'నగరాల్లో ఉండే చెట్ల వల్ల మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కలిగే చెడు ప్రభావాలను చెట్లు అడ్డుకుంటాయి' అని ఆయన చెప్పారు.

'పెద్దపెద్ద చెట్ల వల్లే ఇలాంటి మేలు జరుగుతోంది. ఈ ప్రయోజనాలను రేపటి తరాలకు అందించేలా మనం నేడు చర్యలు తీసుకోవాలి' అని మాన్యుయేల్ అన్నారు.

78 దేశాల్లోని 164 నగరాలకు చెందిన 4వేలకుపైగా చెట్లు, పొదలకు సంబంధించిన గ్లోబల్ అర్బన్ ట్రీ ఇన్వెంటరీ ఆధారంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. నగరాల్లోని వీధుల్లో, పార్కుల్లో ఉన్న చెట్ల మీద గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏమిటో తెలుసుకునేందుకు వారు ప్రయత్నించారు.

మొత్తం 164 నగరాల్లో సగానికిపైగా వృక్ష జాతులు పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే ప్రమాదంలో పడినట్లుగా వారు గుర్తించారు. వర్షపాతంలో వచ్చిన మార్పులు కూడా ఇందుకు కారణమే. 2050 నాటికి ఇది మూడింట రెండొంతులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

లండన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్

భారత్, నైజీరియా, టోగో వంటి ట్రాపికల్ దేశాల్లోని నగరాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.

బ్రిటన్‌లోనూ యార్క్, లండన్, బర్మింగ్‌హాం నగరాల్లోని చెట్ల మీద పర్యావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా పడనుంది.

నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు పబ్లిష్ అయ్యాయి.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ : ఈ యువకుడు వాతావరణ సమాచారాన్ని ఎలా ఇస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)