యుక్రెయిన్‌లో తెలంగాణ విద్యార్థి: ‘‘భయంగా ఉంది. ఒంటరిగా బయటకు వెళ్లే ధైర్యం చాలట్లేదు. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా’’

ప్రసాద్ నాంపల్లి
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌లో కొన్ని వేల మంది భారతీయులు, విద్యార్థులు చిక్కుకున్నారు. చాలా మంది హాస్టళ్లలో, బంకర్లలో తలదాచుకున్నారు. కొంత మంది సరిహద్దుల దగ్గర వేచి చూస్తున్నారు.

తెలంగాణలోని గజ్వేల్‌కు చెందిన నాంపల్లి ప్రసాద్ యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌లో మెడికల్ కోర్స్ చదువుతున్నారు. ఫిబ్రవరి 28న భారతదేశానికి రావాలని ప్రయత్నించి బట్టలు సర్దుకున్నారు. లగేజీ అంతా ప్యాక్ చేసుకున్నారు. తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆయనకు రైలు ఎక్కి లియెవ్ చేరే మార్గం కనిపించలేదని బీబీసీకి చెప్పారు.

లీయెవ్ నుంచి హంగరీ సరిహద్దుల దగ్గరకు వెళ్లి, అక్కడ నుంచి ఫ్లైట్‌లో భారత్ రావాలని అనుకున్నారు. కానీ, వారికి రైల్వే స్టేషన్‌కు వచ్చేందుకు ట్యాక్సీలు దొరకలేదని చెప్పారు.

దొరికిన ట్యాక్సీ రూ.15,000 అడిగారని చెప్పారు. ఆయనతో పాటు మరో 50-60 మంది విద్యార్థులు అక్కడే ఉన్నారని చెప్పారు.

"భయంగానే ఉంది. కానీ, ఒంటరిగా బయటకు వెళ్లే ధైర్యం రావడం లేదు. ఇక ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటున్నాను" అని అన్నారు.

"వాట్సాప్‌లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ గడుపుతున్నాను. ఏ క్షణానికి ఎలా ఉంటుందోనని భయంగానే ఉంది. ధైర్యం తెచుకుంటున్నాను" అని చెప్పారు.

ఖార్కియెవ్‌లో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప తన జూనియర్ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

ఇలా చిక్కుకున్న వారి కోసం భారత ప్రభుత్వంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా కంట్రోల్ రూమ్ లను, టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి వారిని వెనక్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను స్వదేశానికి తిరిగి తీసుకుని వచ్చేందుకు సహాయం చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 617 మంది విద్యార్థుల వివరాలు ప్రభుత్వ ఆర్‌టిజిఎస్ ప్లాట్ఫార్మ్ పై నమోదయ్యాయి.

యుక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను అందచేసేందుకు 24/7 కంట్రోల్ రూమ్‌తో పాటు 1902 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు

ఫొటో సోర్స్, Rajat Johal

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు

కన్సల్టెన్సీల ద్వారా యుక్రెయిన్ పంపిన విద్యార్థుల వివరాలను కూడా సేకరించి, యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలతో మాస్టర్ డేటాను తయారు చేస్తున్నారు.

ఇప్పటి వరకు 537 మంది విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లితండ్రులను సంప్రదించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణ బాబు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఫిబ్రవరి 28 నాటికి 32 మంది ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నట్లు తెలిపారు. వీరి కోసం దిల్లీలోని ఏపీ భవన్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబయి చేరిన విద్యార్థులను తిరిగి వారి సొంత జిల్లాలకు పంపే ఏర్పాట్లను ఐఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్స్ ఐజి, రామకృష్ణ చేస్తున్నారు.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను దిల్లీకి తీసుకొస్తున్న విమానం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను దిల్లీకి తీసుకొస్తున్న విమానం

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు మొత్తం 14 యూనివర్సిటీలలో చేరినట్లు తెలిసింది.

అందులో ఎక్కువ మంది జాఫోరిజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కీయెవ్ మెడికల్ యూనివర్సిటీ, ఒడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, వినిత్స్య మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు.

పోలండ్, మోల్డోవా, రొమేనియా, హంగరీ, స్లొవేకియా దేశాల్లో ఉన్న తెలుగు సంఘాలను కూడా సంప్రదిస్తున్నారు. పోలండ్ చేరిన కొంత మంది విద్యార్థుల వసతి, ఆహార ఏర్పాట్లను పోలండ్‌లో ఉన్న తెలుగు వారు చూస్తున్నారు.

భారతదేశం తిరిగి తీసుకుని వచ్చే వరకు బార్డర్ చెక్ పోస్టుల దగ్గర చిక్కిన విద్యార్థులకు రవాణా, వసతి, ఆహార ఏర్పాట్లు చూసేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారితో సంప్రదింపులు జరిపేందుకు ముఖ్యమంత్రి అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారులు ఏపీ‌ఎన్‌ఆర్‌టిఎస్ చైర్మన్‌తో సమావేశం నిర్వహించారు.

ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్లు:

దిల్లీ

పి రవి శంకర్ , ఒఎస్డీ : 9871999055

ఎంవిఎస్ రామారావు, అసిస్టెంట్ కమీషనర్ : 9871990081

ఏఎస్ఆర్ ఎన్ సాయి బాబు, అసిస్టెంట్ కమీషనర్: 9871999430

ల్యాండ్ లైన్: 011-23384016

ఈ- మెయిల్:[email protected]

యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ప్రజలు ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చు. 0863 - 2340675

వాట్సాప్ : +91 - 8500027678

వెబ్ సైట్: https://www.apnrts.ap.gov.in/

విద్యార్థులు ఏపిఎన్ ఆర్ టి ఎస్ అధికారులను కూడా సంప్రదించవచ్చు. 0863 - 2340678,

రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. గీతేష్ శర్మ 7531904820, రవిశంకర్ 9871999055 నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు.

విజయవాడ:

ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ

వెబ్ సైటు : https://www.apnrts.ap.gov.in/

24/7 Helpline: 0863-2340678

వాట్సాప్: +91-8500027678

ఈ మెయిల్: [email protected], [email protected]

ఆపరేషన్ గంగలో భాగంగా ఫిబ్రవరి 28 న నాలుగు విమానాల్లో యుక్రెయిన్‌లో చిక్కుకున్న వారు భారతదేశానికి చేరుకున్నారు. మరో నాలుగు విమానాలు మార్చి 01న చేరుకున్నాయి.

యుక్రెయిన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా వివరాలను అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు

కంట్రోల్ రూం 9491222122 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు అందించవచ్చని లేదా [email protected] మెయిల్‌కు తెలియజేయవచ్చని వివరించారు.

మరో వైపు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా (94918-15166, 94918-10718, 94410-72564) హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

యుక్రెయిన్ దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Rajat Johal

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు

తెలంగాణ హెల్ప్ లైన్ నంబర్లు:

యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు, విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో, హైదరాబాద్‌లో తెలంగాణ సెక్రటేరియట్‌లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (ఎన్‌ఆర్‌ఐ) దగ్గర హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

తెలంగాణ భవన్, దిల్లీ

విక్రమ్ సింగ్ మాన్ - +91 - 7042566955

చక్రవర్తి - +91 9949351270

నితిన్ - +91 9654663661

ఈ మెయిల్: [email protected]

తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్

ఈ చిట్టిబాబు - 040-23220603, +919440854433 ను

-మెయిల్: [email protected]

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసి, ప్రభుత్వంతో, యుక్రెయిన్‌లో చిక్కుకున్న వారితో కాంటాక్ట్ లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటనలో కోరారు.

తెలంగాణ బీజేపీ కూడా యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 8333871818

యుక్రెయిన్‌లో చిక్కుకున్న వారు కీయెవ్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా (ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టా గ్రామ్ ) సైట్లను ఫాలో అవ్వమని సూచించింది. రాయబార కార్యాలయం హెల్ప్ లైన్లు:

+380997300483, +38099730042, +380933980327, +380635917881, +380935046170

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం దిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు 24/7 హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. +911123012113, +911123914104, +911123017905 and 1800118797 నంబర్లకు కాల్ చేయవచ్చు.

వీడియో క్యాప్షన్, నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం
ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)