పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?

రష్యా రూబుల్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సైమన్ జ్యాక్
    • హోదా, బిజినెస్ ఎడిటర్

రష్యా యుక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు రష్యా పై ఆంక్షలు విధించాయి. రష్యా మాట వినని పక్షంలో ఆ దేశంతో జరిగే అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవహారాల నుంచి రష్యా సెంట్రల్ బ్యాంకు, ఇతర రష్యా బ్యాంకులను తప్పించడమే ఆఖరి అస్త్రం అని భావించారు. ఇందుకోసం స్విఫ్ట్ చెల్లింపులను నిలిపివేయాలని అనుకున్నారు.

అంతర్జాతీయ చెల్లింపులు చేసేందుకు స్విఫ్ట్ ఒక విధానంగా పని చేస్తుంది. అయితే, ఈ స్విఫ్ట్ విధానాన్ని నిలిపివేయడం ద్వారా చెల్లింపులు చేయాల్సిన సంస్థలు, ఆర్ధిక సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే, ఈ నష్టం సత్వరమే జరగొచ్చు లేదా దీర్ఘకాలిక ఆర్ధిక కాంట్రాక్టులపై ప్రభావం పడవచ్చు.

2018లో ఇరాన్ లోని బ్యాంకులను ఇబ్బంది పెట్టేందుకు స్విఫ్ట్ చెల్లింపులను నిలిపివేయాలని అమెరికా స్విఫ్ట్ పై ఒత్తిడి తెచ్చేది. కానీ, అది చాలా చిన్న ఆర్ధిక వ్యవస్థ. అమెరికా విధానాన్ని అప్పట్లో చాలా యూరోపియన్ ప్రభుత్వాలు విమర్శించాయి.

జర్మనీ తమ ఇంధన సరఫరా కోసం మూడింట రెండు వంతులు రష్యా పైనే ఆధారపడుతూ ఉండటం వల్ల ఈ విషయంలో కాస్త సున్నితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే, రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను ధ్రువీకరించే ప్రక్రియను ఆపివేయాలని జర్మనీ నిర్ణయించింది.

వీడియో క్యాప్షన్, పెన్‌లు ఇచ్చి గన్‌లు తీసుకుంటున్నారు

అయితే, ఇలాంటి చర్యల వల్ల ఏర్పడే ముప్పును తగ్గించేందుకు ఇంధనానికి సంబంధించిన లావాదేవీలను చేసే బ్యాంకుల పై ప్రభావం లేకుండా చూడటం లేదా ఇంధనం, ఆహారానికి సంబంధించిన చెల్లింపులకు అనుమతి ఇవ్వడం లాంటివి చేయాలని అమెరికా, యూరోప్, యూకేలో అధికారులు ఒక నిర్ణయానికొచ్చారు.

అయితే, వీటినెలా అమలు చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు.

ఈ విధానం అమలు చేస్తే అది రష్యాను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కానీ, 2014లో క్రైమియా ఏర్పాటు తర్వాత రష్యా సిస్టం ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్సియల్ మెసేజెస్ (ఎస్‌పిఎఫ్‌ఎస్) అనే ప్రత్యామ్నాయ విధానాన్ని ఏర్పాటు చేసుకుంది.

చైనాలో కూడా చెల్లింపుల కోసం క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టం (సిఐపిఎస్) అనే విధానముంది.

రష్యాను అధికారికంగా పక్కన పెట్టడం ద్వారా ఆ దేశాన్ని చైనాకు దగ్గరగా చేస్తుందని చాలా మంది భావించారు. ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న డాలర్ ఆధారిత చెల్లింపుల ప్రాధాన్యతను తగ్గించేందుకు చూస్తున్న చైనా నాయకులకు ఇదొక అవకాశంగా దొరికి ఈ ట్రెండ్ ను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అనుకున్నారు.

అయితే, చైనా రష్యాకు సహాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు లేదని ఒక బ్యాంకింగ్ ప్రతినిధి బీబీసీకి చెప్పారు. చైనాకు వివిధ దేశాలతో రష్యా కంటే ఎక్కువగా ఎగుమతి దిగుమతి వ్యాపార సంబంధాలున్నాయి.

వీడియో క్యాప్షన్, రష్యా సైనికులను ఎదురించిన యుక్రెయిన్ మహిళ

స్విఫ్ట్ చెల్లింపులను నిలిపివేయడం కంటే కూడా రష్యా సెంట్రల్ బ్యాంకును ఒంటరిగా చేయడం రష్యా కు మరింత పెద్ద దెబ్బగా మారొచ్చు. రష్యా కరెన్సీ రూబుల్ ను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంకుకున్న 630 బిలియన్ డాలర్ల సొమ్మును వినియోగించనివ్వకుండా చేస్తే, దాని విలువ పడిపోతుంది. ఇది రష్యా ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది.

యూకేలో రష్యాకున్న ఆర్ధిక ఆసక్తుల పట్ల యూకే ఇకపై మెత్తని వైఖరి అవలంబించబోమని స్పష్టం చేసింది.

ఇటీవల, ఉత్తర ఫ్రాన్స్ యూకే మధ్యలో ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ నిర్మించేందుకు ఇతర ప్రత్యామ్న్యాయాలను పూర్తిగా శోధించలేదనే కారణంతో యూకే ప్రభుత్వం దరఖాస్తును ఆమోదించలేదు. ఈ ప్రాజెక్టులో యుక్రెయిన్, రష్యా కు సంబంధించిన ఇద్దరూ ఉండటంతో పాటు, యుక్రెయిన్ లో రోజురోజుకీ మారుతున్న పరిస్థితి కూడా ఒక కారణమని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు బీబీసీకి చెప్పారు.

ఆదాయానికి వివరణ ఇవ్వలేని వ్యక్తుల ఆస్తులను జప్తు చేసేందుకు హర్ మెజెస్టీ రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్‌ఎంఆర్‌సి) కు విస్తృతమైన అధికారాలిచ్చారు.

చెల్సీ ఎఫ్ సి నాయకత్వాన్ని ఒక స్వచ్చంద సంస్థకు బదిలీ చేసిన రోమన్ అబ్రామోవిక్ నిర్ణయాన్ని కేవలం చట్టబద్ధంగా మాత్రమే కాకుండా ఒక సంకేతంలా చూస్తున్నారు. దీనిని బట్టి, ప్రస్తుతం యూకేలో గాలి ఎటు వీస్తుందో ఆయనకు అర్ధమయిందని తెలుస్తోంది.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)