‘విదేశాల్లో MBBS చదివే విద్యార్థుల్లో 90 శాతం మంది భారత్‌లో ఫెయిల్ అవుతున్నారు’ - కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి

ఫొటో సోర్స్, Getty Images
''దీన్ని వివాదం చేయాలనుకోవట్లేదు. దీనిపై చర్చించేందుకు ఇది సమయం కూడా కాదు. కానీ, విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థుల్లో 90 శాతం మంది భారత్‌లో నిర్వహించే క్వాలిఫయింగ్ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు'' అని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు.
సోమవారం కర్ణాటకలోని బెల్గాంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతోంది.
భారతదేశం నుంచి, అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళుతున్నారు. యుక్రెయిన్‌లో కూడా చాలామంది తెలుగు విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఇలా విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ వైద్యం చేయాలనుకుంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎమ్‌జీఈ) అనే పరీక్ష రాసి, ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
విదేశాల్లో వైద్య కోర్సులు పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావట్లేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను, విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ప్రల్హాద్ జోషి తెలిపారు. కీయెవ్, ఖార్కియెవ్ నగరాల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ'ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో వాయుసేన కూడా పాల్గొనాలని నరేంద్ర మోదీ సూచించారు.
యుక్రెయిన్‌లో దాదాపు 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని అంచనా. వీరిలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు సుమారు 1400 మంది స్వదేశానికి వచ్చారని అంచనా.
మంగళవారం ఉదయం ఖార్కియెవ్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా ఒక ట్వీట్ చేశారు. విద్యార్థి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి యుక్రెయిన్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. పైగా ప్రల్హాద్ జోషి విద్యార్థులను అవమానించేలా మాట్లాడారని తప్పుపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాజ్యసభ ఎంపీ రిపున్ బోర సైతం ప్రల్హాద్ జోషి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జర్నలిస్టు ప్రేమ్ పానికర్ స్పందిస్తూ.. బహుశా తర్వాతి ప్రసంగంలో నెహ్రూ ఏమాత్రం ఆలోచించకుండా దేశం మొత్తానికీ ఒక లక్ష ఎంబీబీఎస్ సీట్లను మాత్రమే కేటాయించారు.. అంటే 15 మంది ఆశావహులకు ఒక సీటు అని చెప్పండి. మిగతా 14 మంది ఎక్కడికి వెళతారు? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరో జర్నలిస్టు అరవింద్ గుణశేఖర్ ట్వీట్ చేస్తూ.. దేశంలో 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయని, 2021 నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 16.1 లక్షలు అని.. అంటే ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు 19 మంది పోటీపడుతున్నారని పేర్కొన్నారు. మెడిసిన్ చదివేందుకు యుక్రెయిన్ వెళ్లి విద్యార్థులు ఎందుకు ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:
- రష్యా అణు బాంబులు వేస్తుందా? అణ్వాయుధాలను ప్రయోగిస్తే పాశ్చాత్య దేశాలు ఏం చేస్తాయి?
- యుక్రెయిన్ తరఫున యుద్ధం చేసేందుకు 8,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్న కమెడియన్
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్ల కన్సల్టేషన్.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
- ఆక్వా ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రికార్డు ధరలతో రొయ్యలు, చేపల సాగుదారులకు లాభాలు
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















