Vodka Ban: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా, కెనడా దేశాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యన్ వోడ్కాను తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

వోడ్కా మాత్రమే కాకుండా రష్యాలో తయారైన అన్ని ఆల్కాహాలిక్ పానీయాలను షెల్ఫ్‌ల నుంచి తొలగించాలని ఈ దేశాల్లోని కొన్ని రాష్టాలు అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

పశ్చిమ దేశాలు ఎంతగా హెచ్చరించినా, రష్యా యుక్రెయిన్‌పై దాడికి దిగింది.

యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించనున్నట్లు" రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిబ్రవరి 24 గురువారం ఉదయం ప్రకటించారు.

అయితే, యుక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తోందని, యుద్ధం మొదలైన నాలుగు రోజుల్లో రష్యా భారీ నష్టం చవిచూసిందని బ్రిటన్ రక్షణ శాఖ విశ్వసిస్తోంది.

ఇప్పటివరకు 5,000లకు పైగా రష్యన్ సైనికులను హతమార్చినట్టు యుక్రెయిన్ రక్షణ శాఖ ఒక ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది.

94 మంది పౌరులు చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

రష్యా దాడిని ఖండిస్తూ పలు చేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.

ఇప్పుడు తాజాగా రష్యాలో తయారైన ఆల్కాహాల్‌ను నిషేధించాలని అమెరికా, కెనడాలలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

కెనడాలో అత్యధిక జనాభాగల రాష్ట్రం ఒంటారియాలో అన్ని రష్యన్ లిక్కర్ ఉత్పత్తులను రద్దు చేయాలని లిక్కర్ కంట్రోల్ బోర్డ్‌ ఆఫ్ ఒంటారియాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు రాయిటర్స్ ఒక కథనంలో తెలిపింది.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి రష్యన్ లిక్కర్ ఉత్పత్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఉటా రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు.

"రష్యా దాడిని ఖండించేందుకు, యుక్రెయిన్ సోదర సోదరీమణులకు సంఘీభావం తెలిపేందుకు మన వంతు కృషి చేద్దాం. తక్షణమే, రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి రష్యన్ లిక్కర్ ఉత్పత్తులన్నింటినీ తొలగిస్తున్నాం. రష్యాతో ఇతర వాణిజ్య సంబంధాలను కూడా సమీక్షిస్తాం" అని ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ఫిబ్రవరి 27న ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"లిక్కర్, వైన్ దుకాణాల నుంచి రష్యాలో తయారైన ఉత్పత్తులన్నింటినీ తొలగించాల్సిందిగా ఈరోజు ఉదయం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరుపై సంతకం చేశాను. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రం యుక్రెయిన్ ప్రజల స్వతంత్ర పోరాటంలో వారికి అండగా నిలుస్తుంది" అని న్యూ హాంప్‌షైర్ గవర్నన్ క్రిస్టోఫర్ సునును ఫిబ్రవరి 26న ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రస్తుతం యుక్రెయిన్, రష్యా ప్రతినిధులు బెలారస్‌లో శాంతి చర్చల కోసం సమావేశమయ్యారు.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)