నుదుటిపై తిలకం, హిందూ సంప్రదాయ వస్త్రాల్లో ప్రధాని మోదీ: సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్

ఫొటో సోర్స్, PTI
రామానుజాచార్య స్మారకార్థం హైదరాబాద్‌లో నిర్మించిన 'సమతా మూర్తి' విగ్రహాన్ని శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోదీ హిందూ సంప్రదాయ వస్త్రాల్లో, నుదుటిపై చందన తిలకంతో కనిపించారు. మోదీ వేషధారణకు సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మైక్రో బ్లాగింగ్ సైట్ 'ట్విట్టర్'లో #MyPM అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
అందరికంటే ముందు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య... 'మా ప్రధాన మంత్రి (మేరా ప్రధానమంత్రి)' అంటూ ఆ ఫొటోకు వ్యాఖ్యను జోడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ట్వీట్ తర్వాత హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ ఆహార్యానికి సంబంధించిన ఈ ఫొటో... 'my pm" అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనిపై 30 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
ప్రధాని మోదీ, తన హిందుత్వ గుర్తింపును ఈ విధంగా బహిరంగంగా చాటుకుంటున్నారని మరికొందరు ఈ ఫొటోను ఉదాహరణగా చూపిస్తూ వ్యాఖ్యానించారు.
రాకేశ్ బూరుగుల అనే ఒక యూజర్... ''హిందువుగా పుట్టినందుకు చింతించని ప్రధాని నరేంద్ర మోదీ. మా ప్రధాని మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్‌ను రాసుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''దేశ ప్రధానిగా ఇలాంటి ఒక వ్యక్తి ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ధన్యవాదాలు మోదీ గారు'' అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''మా ప్రధానమంత్రి, తన మత గుర్తింపును భుజాలపై మోసేందుకు సంకోచించరు'' అని ఇంకో వ్యక్తి ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నరేంద్రమోదీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా... సమతా మూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ ఆహార్యానికి సంబంధించిన ఈ ఫొటోలను షేర్ చేసింది.
''మత సామరస్యం, సోదరభావం, సామాజిక సాధికారత వంటి అంశాల్లో శ్రీ రామానుజాచార్య చేసిన బోధనలకు 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ఒక నివాళి'' అనే వ్యాఖ్యను జోడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
శనివారం 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ... '' వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహావిష్కరణ జరిగింది. రామానుజాచార్యులు ప్రవచించిన ఉపదేశాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని నేను ప్రార్థిస్తున్నా. మన గురువుల విగ్రహాలు మనకు జ్ఞాన మార్గాలుగా నిలుస్తాయి'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI
''రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానానికి ప్రతీక. ఈ విగ్రహం, భారతీయ ప్రాచీన సంస్కృతిని మరోసారి బలోపేతం చేస్తుంది. ఏళ్ల తరబడి చేసిన యాత్రల ద్వారా రామానుజాచార్యులు పొందిన జ్ఞానం ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి వస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI
ప్రధానమంత్రి ఫొటోలను షేర్ చేస్తోన్న చాలామంది యూజర్లు 'ఈ రోజుకు ఇవే అత్యుత్తమ ఫొటోలు' అంటూ వ్యాఖ్యను జోడిస్తున్నారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI
నుదుటిపై చందనంతో, సంప్రదాయ హిందూ మత దుస్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించడం ఇదే తొలిసారి కాదు.
గతంలో కేదార్‌నాథ్ పర్యటనతో పాటు ఇటీవల కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ప్రధాని మోదీ వేషధారణ చర్చల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, PMO
2019లో కేదార్‌నాథ్ పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ ఒక గుహలో ధ్యానం చేస్తోన్న ఫొటో బయటకొచ్చింది. దీనిపై అప్పట్లో భారీ చర్చ జరిగింది. ధ్యానం సందర్భంగా మోదీ, ఒక పొడవైన కాషాయ వస్త్రాన్ని ధరించారు.

ఫొటో సోర్స్, ANI
గతేడాది డిసెంబర్‌లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా గంగానదిలో నరేంద్ర మోదీ స్నానమాచరించడం కూడా చర్చనీయాంశమైంది.

ఫొటో సోర్స్, PTI
ఇవి కూడా చదవండి:
- 'శవం అంటేనే భయపడేదాన్ని... ఇప్పుడు చితి పక్కనే కూర్చుని పూజలు చేస్తున్నా'- మహిళా జంగం దేవర కథ
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
- గాలిచొరబడకుండా సీల్ చేసిన బబుల్.. లోపల జీవితం ఎలా ఉందంటే..
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)