మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా ప్రసంగించలేరా? రాహుల్ గాంధీ ఆరోపణ ఏమిటి

ఫొటో సోర్స్, @PIB_India
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ఉద్దేశించి సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగమిచ్చే సమయంలో స్వల్ప అంతరాయం కలిగింది. దీనిపై కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని విపక్షాలు విమర్శలు చేశాయి.
ప్రసంగ సమయంలో మోదీ తన ఎడమవైపు పదే పదే చూస్తున్నట్లు కనిపించారు. ఆ తర్వాత కొద్ది సెకన్లపాటు మౌనం తర్వాత డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు క్లాస్ స్క్వాబ్‌ను ‘‘నేను, మా అనువాదకుడు మాట్లాడేది వినిపిస్తోందా?’’అని అడిగారు. ఇది ప్రసంగం చూసేవారికి బాగానే వినిపించింది.
ఆ తర్వాత మళ్లీ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మోదీ ప్రసంగ సమయంలో ఎందుకు అంతరాయం కలిగిందో ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే, టెలిప్రాంప్టర్ వల్లే మోదీ ప్రసంగానికి అంతరాయం కలిగిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. ‘‘టెలిప్రాంప్టర్లు మనల్ని మోసం చేశాయి. మన నాయకుడి శక్తి ఏమైంది?’’అని ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా... ‘‘ఇన్ని అబద్ధాలను టెలిప్రాంప్టర్లు కూడా తట్టుకోలేవు’’అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ కూడా దీనిపై స్పందించారు. మోదీకి రెండు వైపులా టెలిప్రాంప్టర్లు కనిపిస్తున్న ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. ‘‘నా రెండు అమూల్యమైన రత్నాలు’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, సోషల్ మీడియాలో అంశాలపై ఫ్యాక్ట్‌చెక్ చేసే ఆల్ట్‌న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా స్పందిస్తూ.. టెలిప్రాంప్టర్ వల్లే మోదీ ప్రసంగానికి అంతరాయం కలిగిందనే వాదనను తోసిపుచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మోదీ ప్రసంగానికి సంబంధించిన మరో సోర్సు నుంచి వీడియోను ట్విటర్‌లో ప్రతీక్ షేర్ చేశారు. ‘‘టెలిప్రాంప్టర్ వల్ల అంతరాయం కలిగే అవకాశం చాలా తక్కువ. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స్ట్రీమ్ చేసిన వీడియోను మీరు గమనిస్తే.. ‘సర్ అంతా బాగానే వినిపిస్తుందా?’ అని ఒకసారి అడగండి అనే వాయిస్ మీకు వినిపిస్తుంది. ప్రధాన మంత్రి మోదీ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో ఈ వాయిస్ మీకు కనిపించడం లేదు’’అని ఆయన అన్నారు.
‘‘సాధారణంగా టెలిప్రాంప్టర్ ముందు ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏమైనా సమస్య ఉంటే, ఆ కార్యక్రమానికి సమన్వయం చేస్తున్న ప్రధాన కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందిస్తారు’’అని కూడా ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
టెలిప్రాంప్టర్‌తో మోదీ..
సుదీర్ఘ ప్రసంగాలిచ్చే నాయకుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఒకరు. అయితే, మోదీ టెలిప్రాంప్టర్ సాయంతో ప్రసంగాలు ఇస్తుంటారని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తుంటాయి.
2019లో పట్నాలోని గాంధీ మైదాన్‌లో మోదీ ప్రసంగించినప్పుడు.. టెలిప్రాంప్టర్‌పై చాలా చర్చ జరిగింది.
2019 మార్చి 3న ఎన్డీయే ర్యాలీలో మోదీ ఈ ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు ఆయన ముందు రెండు టెలిప్రాంప్టర్లు కనిపించాయి.
అయితే, హిందీలో మాట్లాడేటప్పుడు కూడా మోదీకి ఈ టెలిప్రాంప్టర్ అవసరమా? అనే చర్చ జరిగింది.
మోదీ టెలిప్రాంప్టర్ ఉపయోగించడంపై బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు. ‘‘బిహార్‌లో ఓటమి భయంతో ఏం చెబుతానోనని ఆయన టెలిప్రాంప్టర్ పెట్టుకుని ప్రసంగిస్తున్నారు. హిందీ మాట్లాడే ప్రజలతో మాట్లాడేందుకు కూడా ఆయనకు టెలిప్రాంప్టర్ అవసరమైంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, టెలిప్రాంప్టర్లను ఉపయోగించారన్న వార్తలను బీజేపీ అధికార ప్రతినిధి ఖండించారు. కానీ ర్యాలీకి సంబంధించిన వీడియోలో టెలిప్రాంప్టర్లు స్పష్టంగా కనిపించాయి.
బీజేపీ మిత్రపక్షమైన నీతీశ్ కుమార్ పార్టీ జేడీయూ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ కూడా వేదికపై టెలిప్రాంప్టర్లు ఉన్నాయని స్పష్టంచేశారు.
మోదీతోపాటు ఆ రోజు వేదికపై అజయ్ కూడా ఉన్నారు. ‘‘ర్యాలీల్లో మోదీ టెలిప్రాంప్టర్ ఉపయోగించడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన ప్రసంగాలను స్థానిక మాండలికాల్లోని పదాలతో మొదలుపెడతారు. పట్నాలోనూ భోజ్‌పురీ, మైథిలి లాంటి భాషల్లో పదాలను ఆయన ప్రసంగంలో వాడతారు. ఆయనకు ఈ పదాలు అంతగా అలవాటు ఉండవు. అందుకే టెలిప్రాంప్టర్ సాయం తీసుకుంటారు’’అని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ నాయకులు కూడా టెలిప్రాంప్టర్ల సాయం తీసుకుంటారు. అనర్గళంగా ప్రసంగించే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా టెలిప్రాంప్టర్ సాయం తీసుకుంటారు.
నటులు, న్యూస్ రీడర్లు, రాజకీయ నాయకులు తమ స్క్రిప్టులు చదవడంలో ఈ టెలిప్రాంప్టర్లు ఉపయోగపడుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- స్కాచ్ విస్కీ: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












