NEET: 'సీఎం సార్‌.. హెల్ప్‌ మీ'.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కి తూర్పు గోదావరి విద్యార్థి వేడుకోలు - ప్రెస్ రివ్యూ

స్టాలిన్‌ను కలిసి నీట్ రద్దుకు ప్రయత్నించాలని కోరుతున్న విద్యార్థి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, స్టాలిన్‌ను కలిసి నీట్ రద్దుకు ప్రయత్నించాలని కోరుతున్న విద్యార్థి

నీట్‌ ప్రవేశ పరీక్ష నుంచి దేశానికి విముక్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి తమిళనాడు సీఎం స్టాలిన్‌కు విన్నవించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాసింది.

‘‘తమిళనాడు సీఎం స్టాలిన్‌ సచివాలయానికి వెళ్తుండగా.. ఎన్‌.సతీ‌ష్ అనే విద్యార్థి 'సీఎం సార్‌.. హెల్ప్‌ మీ' అనే ప్లకార్డుతో రోడ్డు పక్కన నిల్చున్నాడు.

సీఎం.. కాన్వాయ్‌ ఆపి ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచారు. 'సార్‌.. నేను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వాసిని. ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించినా, నీట్‌ ప్రవేశ పరీక్ష కారణంగా వైద్య కోర్సులో చేరలేకపోయాను.

నీట్‌ రద్దు కోసం మీ ప్రభుత్వం ఎంతో పోరాడుతోంది. మీ మద్దతు మా రాష్ట్రానికీ కావాలి. నీట్‌ నుంచి ఒక్క తమిళనాడుకే కాకుండా దేశం మొత్తానికి విముక్తి కల్పించండి సార్‌' అంటూ చేతులెత్తి మొక్కాడు.

అయితే, తమిళనాడు ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్‌ తిప్పిపంపడం గమనార్హం.

సమీర్ శర్మ

‘ఐఆర్ వడ్డీ లేని అప్పు లాంటిది.. దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తాం’

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్) వడ్డీ లేని అప్పు లాంటిదని.. దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.

''ఇది ఏ పీఆర్సీలోనైనా జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా 30 నెలలపాటు 27% ఐఆర్ ఇవ్వలేదు. ఐఆర్ ఉద్యోగుల హక్కు కాదు. తెలంగాణలో ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఐఆర్ ఇవ్వకుండా డీఏలే ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు ఆదా అయ్యేది' అని సమీర్ శర్మ అన్నారు.

ఏమైనా అభ్యంతరాలుంటే ఉద్యోగ సంఘాలు వచ్చి మంత్రులు కమిటీ ముందు పెడితే పరిష్కారం కావచ్చు. సంప్రదింపుల్లో పరస్పర ఆమోదయోగ్య పార్యులా రావచ్చు.

అంతేకానీ సమ్మెకు వెళ్తే ఏమైనా జరగొచ్చు. బయటి శక్తులు వచ్చి ఏం చేస్తాయో చెప్పలేం అన్నారాయన.

ఉద్యోగ సంఘాలను ఆయన మరోసారి చర్చలకు ఆహ్వానించారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎస్.ఎస్. రావత్, ఈశభూషణ్ కుమార్, సమాచారశాఖ డైరక్టర్ విజయకుమార్రెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. 'ఐఆర్ విషయంలో సంఘాలు ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో మధ్యంతర భృతి ప్రకటించాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది' అని చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.

kalvakuntla kavitha

ఫొటో సోర్స్, facebook/kalvakuntla kavitha

సుత్తిలేకుండా సూటిగా సమాధానం చెప్పండి: నిర్మలా సీతారామన్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌శ్నించారని 'నమస్తే తెలంగాణ' పత్రిక వార్త రాసింది.

''లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోస‌మా? అని ప్ర‌శ్నించారు.

దేశం అంటే మ‌ట్టి మాత్ర‌మే కాదు అని ఆమె పేర్కొన్నారు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏంట‌ని ఎమ్మెల్సీ క‌విత నిల‌దీశారు.

సీఎం కేసీఆర్‌ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాల‌ని నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌విత ప్ర‌శ్నించార''ని ఆ వార్తలో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

Alia Bhatt, NTR

ఫొటో సోర్స్, facebook/RRRMovie

నీ భాష నాకు అర్థం కాదు: ఎన్టీఆర్‌పై ఆలియా సెటైర్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌లో బాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై ఆలియా భట్ సెటైర్‌ వేసిందని 'సాక్షి' తన వార్తాకథనంలో రాసింది.

''జూ.ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నాడని..అది తనకు అర్థం కావడం లేదని ఆలియా చెప్పింది. దానిని ఎవరైనా అనువదించి తనకు చెప్తారేమోనని దిక్కులు చూడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ను ఎదురుగా పెట్టుకొనే ఇలా చెప్పేసింది ఆలియా.

ఇక దానికి సమాదానంగా ఎన్టీఆర్‌ కూడా కౌంటర్‌ ఇచ్చాడు. మేం తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం. కాకపోతే అది నీకు అర్థం కావడం లేదంటూ రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు. అయితే తారక్‌ కౌంటర్‌ ఇచ్చినప్పటికీ ఆలియా మాత్రం తగ్గలేదు. కాదు మీరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదని నవ్వుతూనే ఎదురుదాడి చేసింది.

గతంలో ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్‌ కోసం ముంబై వెళ్లినప్పుడు శ్రద్ధాకపూర్‌ హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ప్రభాస్‌ ఇంగ్లీష్‌తో మేనేజ్‌ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హీందీలో కూడా తారక్‌ అనర్గళంగా మాట్లాడగలడని తెలిసిందే'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)