శరీరంలోని కొవ్వులో కరోనా వైరస్ తిష్ఠ వేస్తుందా? స్థూలకాయులకు ఇది ప్రాణాంతకమా
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొవ్వును తనకు అనుకూలమైన రిజర్వాయర్‌లా మార్చుకుంటుంది. అందుకే ఊబకాయం ఉన్న రోగుల శరీరంలో ఈ వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది.
ఊపిరితిత్తుల కణాలలో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ టైప్-2 కూడా పెరుగుతుందని స్థూలకాయం ఉన్న జంతువులను పరిశీలించినప్పుడు తేలింది. ఇది వైరస్ కోసం ఎక్కువ సంఖ్యలో బైండింగ్ సైట్‌లను సూచిస్తుంది. పల్మనరీ ఎపిథీలియంలోకి వైరల్ కణాల ప్రవేశానికి అనుకూలంగా మార్చుతుంది.
కోవిడ్-19 వైరస్ వృద్ధి చెందే కొద్దీ దానిపై పోరాటం చేసే కార్యక్రమం ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఇక్కడే రోగ నిరోధక శక్తి ఎక్కువగా పని చేస్తుంది. అయితే, ఊబకాయం ఉన్నవారిలో లో-గ్రేడ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ గుణాలే మనిషిలో రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేస్తాయి.
ఇవి తక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేసే గుణం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కోవిడ్ లాంటి వైరస్‌లు సులభంగా మనిషి శరీరంపై దాడి చేయగలుగుతాయి.
మరోవైపు, ఊబకాయం ఉన్నవారిలో పొట్ట భాగంలో ఉన్న అధిక కొవ్వు వల్ల ఊపిరిత్తులు ఒత్తిడికి లోనవుతాయి. తద్వారా వాటి సామర్ధ్యం తగ్గిపోతుంది. ఈ కారణంగా సదరు మనిషి సులభంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడేందుకు అవకాశం ఏర్పడుతుంది.
నిజానికి, ఊబకాయం శ్వాసకోశ వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌లకు ప్రమాద కారకంగా భావించడం ఇదే మొదటిసారి కాదు. 2009లో H1N1 ఇన్‌ఫ్లూయెంజా వ్యాపించిన సమయంలో, ఊబకాయం ఉన్నవారు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ వరకు వెళ్లాల్సిన అవసరం బాగా పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
- పద్మశ్రీ గ్రహీత మొగిలయ్యకు కేసీఆర్ రూ. కోటి నజరానా
- బడ్జెట్ వివరాలు ఎలా లీక్ అయ్యాయి? 1950 నాటి ఈ ఘటన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
- 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ శ్వేత తివారి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలను ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

