Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ నటి వ్యాఖ్యలు... హిందూ సంస్థల ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
'మేరా బ్రా కీ సైజ్ భగవాన్ లే రహే హై' (దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు) అంటూ టీవీ నటి శ్వేత తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ హోం మంత్రి ఖండించారు.
ఈ వీడియోను మధ్య ప్రదేశ్‌కు చెందిన సంకేత్ పాఠక్ అనే విలేఖరి ట్వీట్ చేశారు.
ఆ వ్యాఖ్యలపై శ్వేత తివారీ క్షమాపణలు చెప్పాలంటూ హిందూ మత సంస్థలు డిమాండ్ చేశాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శ్వేత తివారి ఎవరు?
శ్వేత తివారి హిందీ సీరియల్ నటి. 'కసౌటి జిందగీ కే', 'బేగు సరాయి' లాంటి హిందీ సీరియళ్లలో ఆమె నటించారు.
ఆమె గత ఏడాది ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11 అనే రియాలిటీ టీవీ షోలో కూడా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు.
ఇది స్టంట్‌లతో కూడిన రియాలిటీ షో. సెప్టెంబర్ 2021లో ముగిసిన ఈ టీవీ షోలో బిజిలానీ విజేతగా నిలిచారు.

ఫొటో సోర్స్, SHWETA TIWARI/INSTAGRAM
తాజా వివాదం ఏమిటి?
వెబ్ సిరీస్‌లో శ్వేతతో పాటు నటిస్తున్న సౌరభ్ రాజ్ జైన్ బ్రా ఫిట్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఇది ఫ్యాషన్ రంగానికి చెందిన వెబ్ సిరీస్.
సౌరభ్ రాజ్ మహాభారత్ లాంటి షోలలో కృష్ణుడి పాత్రల్లో నటించారు. దాంతో ఆయన పై జోక్ వేస్తూ, "దేవుడి వేషాల నుంచి నేరుగా బ్రా ఫిట్టర్ పాత్రలోకి" అంటూ శ్వేత ఛలోక్తి విసిరారు.
వీరిద్దరితో పాటు రోహిత్ రాయ్ కూడా ఈ సిరీస్‌లో నటిస్తున్నారు.
భోపాల్ లో కొన్ని హిందూ సంస్థలు శ్వేత తివారి ఫోటోలను మంటల్లో కాల్చాయి. ఆమె క్షమాపణలు చెప్పాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయని రుచి త్యాగి అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా, చౌకబారుగా ఉన్నాయని కొందరు యూజర్లు ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి ఏమన్నారు?
ఆమె చేసిన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా ఖండించారు. 24 గంటలలోగా ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నివేదిక ఇమ్మని పోలీసులను ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఐపీసీ లోని సెక్షన్ 295ఏను అనుసరించి ఆమె పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆయన గతంలో సన్నీ లియోన్ నటించిన మధుబన్ పాటలో లిరిక్స్ ను కూడా మార్చమని డిమాండ్ చేశారు.
ఆయన డాబర్ సంస్థ రూపొందించిన స్వలింగ సంపర్కులతో రూపొందించిన కర్వా చౌత్ ప్రకటనను, సవ్యసాచి మంగళసూత్ర ప్రకటనల పట్ల కూడా నిరసన వ్యక్తం చేశారు.
ఐపీసీ లో సెక్షన్ 295 ఏ ఏం చెబుతోంది?
మతాన్ని లేదా మత విశ్వాసాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మాటలు, రాతలు, చర్యల ద్వారా కించపరచినప్పుడు గాని, మత విద్వేషాలను రగిల్చేందుకు ఇతరులను ప్రేరిపించినా లేదా ప్రయత్నం చేసినా ఈ సెక్షన్ కింద శిక్షార్హులు.
నేరం నిరూపణ అయితే, నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్: చంద్రున్ని ఢీకొట్టననున్న 'స్పేస్ ఎక్స్' రాకెట్
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
- బాల్ ఠాక్రే ప్రాణ భయమే శివసేనను మహారాష్ట్రకు పరిమితం చేసిందా
- ఈమెయిల్ పంపించి మహేశ్ బ్యాంక్‌లో సైబర్ దోపిడీ.. ‘3 బ్యాంకులనూ కొల్లగొట్టింది ఒక్కడే’
- బీట్రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తింటే బీపీ అదుపులో ఉంటుందా
- సమంత అక్కినేని: ‘‘పెళ్లి తర్వాత పిల్లల గురించి అడిగే వారికి నా సమాధానం ఏంటంటే..’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












