నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్‌తో ఎందుకు పోటీపడలేకపోతోంది
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ 2018 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో మాట్లాడుతూ, నెట్‌ఫ్లిక్స్‌కు తదుపరి 10 కోట్ల సబ్‌స్క్రైబర్లు "భారతదేశం నుంచే ఉంటారని", దానికి కారణం దేశంలో ఇంటర్నెట్ చౌక ధరలకు లభ్యమవుతూ, వేగంగా విస్తరించడమేనని అన్నారు.
అయితే, మూడు సంవత్సరాల తరువాత హేస్టింగ్స్‌లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ అనుకున్నంత విజయం సాధించలేదని గత వారం ఒక ఇన్వెస్టర్ కాల్‌లో హేస్టింగ్స్ వాపోయారు.
"అన్ని ప్రధాన మార్కెట్లలోనూ నెట్‌ఫ్లిక్స్ విజయం సాధించడం సంతోషకరం. కానీ, భారతదేశంలో సఫలీకృతం కాలేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మేం ఆ మార్కెట్‌వైపే మొగ్గు చూపుతున్నాం" అని ఆయన అన్నారు.
భారతదేశంలో సుమారు 10 కోట్ల సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా 2 బిలియన్ డాలర్ల స్ట్రీమింగ్ మార్కెట్ తయారైందని మీడియా పార్ట్నర్స్ ఆసియా తెలిపింది. అయితే, ఆరేళ్ల క్రితం భారతదేశంలో ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది.
ఓటీటీ పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతదేశంలో సుమారు 55 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్‌ఫ్లిక్స్ దాని ప్రధాన ప్రత్యర్థులైన డిస్నీ+ హాట్‌స్టార్ (4.6 కోట్లు), అమెజాన్ ప్రైమ్ వీడియో (1.9 కోట్లు) కంటే వెనుకబడి ఉంది.
ఇవి కూడా చదవండి:
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
- కోవిడ్ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థను బాధించలేదు - ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఆర్థిక సర్వే అంచనా
- దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు ఎంక్వైరీ కమిషన్ నివేదిక
- దళితులు మాయావతి బీఎస్పీకి దూరమయ్యారా? దళితుల ఓట్లు కోరుకుంటున్న పార్టీలు వారికోసం ఏం చేస్తున్నాయి?
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

