కృష్ణా జిల్లా: మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల మృతి, రోదిస్తున్న తల్లిదండ్రులు

మున్నేరు

ఫొటో సోర్స్, UGC

కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో ఈత కోసం వెళ్లి గల్లంతైన ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

చనిపోయిన విద్యార్థులను బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేశ్‌గా గుర్తించారు. వీరంతా 12 సంవత్సరాల లోపు వారే.

సోమవారం సాయంత్రం చిన్నారులు గల్లంతు కావడంతో జాతీయ విపత్తు ప్రతిస్పంద దళం (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఐదుగురి మృతదేహాలు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ మృతదేహాలు బాల యేసు, చరణ్, అజయ్ సన్నీవి, రాకేశ్‌లవిగా గుర్తించారు.

మృతిచెందిన చిన్నారులు
ఫొటో క్యాప్షన్, మృతి చెందిన అయిదుగురు చిన్నారుల్లో నలుగురు

ఘటన నేపథ్యంలో మున్నేరు వాగు వద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్న ఈ చిన్నారులు సోమవారు మున్నేరులో స్నానానికి వెళ్లారు.

పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి వీరెవరూ కనిపించలేదు. వీరంతా మున్నేరు వైపు వెళ్లాలని ఓ పశువుల కాపరి చెప్పడంతో అక్కడికి వెళ్లి చూశారు.

మున్నేరు

ఫొటో సోర్స్, UGC

అక్కడ బట్టలు, సైకిళ్లు మాత్రమే కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సోమవారం సాయంత్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)