ఐశ్వర్య రాయ్ : బీజేపీ ఎంపీలను ‘శపించిన’ జయాబచ్చన్ - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
'మీకు చెడ్డ రోజులు దాపురించనున్నాయి, నేను శపిస్తున్నాను' అంటూ బీజేపీ ఎంపీలపై జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌కు, పాలక బీజేపీ సభ్యులకు రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశంపై జయా బచ్చన్ మాట్లాడుతూ, "మీరు ఎవరి ముందు వీణ వాయిస్తున్నార"ని ఇతర విపక్ష నేతలను నిలదీశారు.
"త్వరలో మీకు గడ్డు రోజులు రానున్నాయి. నేను మిమ్మల్ని శపిస్తున్నాను."
అధికార పార్టీ ఎంపీలు తనపై, ఐశ్వర్య రాయ్‌పై వ్యాఖ్యలు చేశారని జయ బచ్చన్ అన్నారు.
పనామా పేపర్స్ లీక్ కేసులో జయ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం దిల్లీలో విచారించింది. గతంలో రెండు సార్లు ఈడీ ముందు హాజరు కావల్సిందిగా ఆమెకు నోటీసులు పంపినా, ఆమె విచారణకు రాలేదు.
రాజ్యసభ నుంచి బయటకు వస్తూ జయ బచ్చన్ విలేఖరులతో మాట్లాడారు.
"ఇలా జరగాల్సింది కాదు. నేను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ, కొన్ని విషయాలు మాట్లాడిన తీరుకు చాలా కలత చెందాను" అని ఆమె అన్నారు.
పనామా పేపర్స్ లీక్‌లో 500 మందికి పైగా భారతీయుల పేర్లు ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీలు విదేశాలలో అక్రమంగా పెట్టుబడి పెట్టినట్లు ఈ లీకుల్లో బయపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్
నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి వచ్చారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
పనామా పేపర్స్ కేసులో ఆమెను విచారించడానికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇంతకు ముందు రెండుసార్లు ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆమెకు నోటీసులు పంపినా ఆమె విచారణకు రాలేదు.
చాలామంది సెలబ్రిటీలు విదేశాలలో అక్రమంగా డబ్బును దాచినట్లు లీకైన పనామా పేపర్లలో ఉంది. 500మందికి పైగా భారతీయుల పేర్లు పనామా పేపర్స్‌లో ఉన్నట్లు గుర్తించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రపంచంలోని పలు దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పనామా కంపెనీ 'మొసాక్ ఫోన్సెకా'కు చెందిన లక్షల కొద్దీ పేపర్లు 2016 సంవత్సరంలో లీక్ అయ్యాయి.
పన్ను ఎగవేత, మనీలాండరింగ్, ఆర్థిక ఆంక్షల నుండి తప్పించుకోవడానికి మొసాక్ ఫోన్సెకా తన ఖాతాదారులకు ఎలా సహాయం చేసిందో తెలిపే వివరాలు ఈ పత్రాలలో లభించాయి.
ఈ పత్రాలను 100 మీడియా సంస్థల సహకారంతో ఏర్పడిన 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' (ఐసీఐజే) పరిశీలించింది. భారత్ నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఇందులో భాగస్వామి.
ఇవి కూడా చదవండి
- మియన్మార్: సామాన్య పౌరులను హింసించి చంపేసిన సైన్యం, బీబీసీ పరిశోధనలో బయటపడ్డ దారుణాలు
- 150కి పైగా దోపిడీ, కిడ్నాప్, హత్యా కేసులున్న డాన్ పప్పూ దేవ్ పోలీసు కస్టడీలో ఎలా చనిపోయారు?
- ఒమిక్రాన్‌కు అసాధారణ రీతిలో వ్యాపించే శక్తి ఉంది, జాగ్రత్త పడకుంటే ముప్పే.. అమెరికా నిపుణుల హెచ్చరిక
- తబ్లీగీ జమాత్‌ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








