సైదాబాద్ అత్యాచార ఘటన: చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENAPARTY
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటన జరిగి వారం కావొస్తున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.
ఇంట్లోంచి బయటకు వెళ్లిన చిన్నారిని దారుణంగా హత్యచేయడం దుర్మార్గమని పవన్ కల్యాణ్ అన్నారు.
ఒక ఇంటి వారిపై అనుమానం ఉందని చిన్నారి తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటికీ నిందితుడు దొరకలేదని పవన్ కల్యాణ్ అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు, ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
మీడియా కొన్ని ఘటనలను ఎక్కువగా ప్రచారం చేసి, ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చిందని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఫొటో సోర్స్, YSRTP
అంతకుముందు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
చిన్నారి ఇంటి వద్దే ఆమె ధర్నాకు దిగారు.
నిందితుడిని వెంటనే పట్టుకోవాలని, బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Telangana police
నిందితుడి కోసం పోలీసుల వేట
నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు 15 బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మ్యూజిక్ డైరెక్టర్, నటుడు ఆర్పీపట్నాయక్ నిందితుడిని పట్టించిన వారికి తన వంతుగా మరో రూ.50 వేలు ఇస్తానని తెలిపారు.
నిందితుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
ఈ ఘటనపై టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ట్విటర్‌లో స్పందించారు.
'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ఘటనపై హీరో నాని కూడా స్పందించారు.
'నిందితుడు బయటెక్కడో ఉన్నాడు, ఉండకూడదు' అంటూ తెలంగాణ పోలీసుల ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అసలేం జరిగింది?
గత గురువారం సాయంత్రం పెరుగు తీసుకురావడానికి వెళ్లిన ఆరేళ్ల బాలిక తిరిగి ఇంటికి రాలేదు.
సంవత్సరం నుంచి ఎప్పుడు మాట్లాడని ఇంటిపక్కనే ఉండే వ్యక్తి పాప కోసం వెతుకుతున్నారా అని తమ వద్దకు వచ్చి అడగడంతో అనుమానం వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
అతని ఇంటికి వెళ్లి చూడగా, తాళం వేసి ఉందన్నారు. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు తాళం పగలగొట్టి చూశారు. బాలిక అక్కడ విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు. బాలిక మృతదేహం పరుపులో చుట్టేసి కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నోట్లో గుడ్డలు కుక్కి కనిపించాయని వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








