స్టాన్ స్వామి: గుండెపోటుతో మృతి చెందిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు

ఫొటో సోర్స్, RAVI PRAKASH
ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.
"శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు" అని ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ డిసౌజా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాన్ స్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఎల్గార్ పరిషద్ కేసులో ఆయన అరెస్టై, జైలు జీవితం గడుపుతున్నారు. మే నెలలో కోవిడ్ సోకడంతో ఆయన్ను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకుముందు, ఝార్ఖండ్ జనాధికార్ మహాసభకు చెందిన సిరాజ్ దత్తా స్టాన్ స్వామి మరణాన్ని బీబీసీ ప్రతినిధి రవి ప్రకాశ్‌కు ధృవీకరించారు.ఆయన మరణవార్తను ధృవీకరిస్తూ జెస్యూట్ ప్రోవిన్షియల్ ఆఫ్ ఇండియా తరఫున డాక్టర్ స్టానిలాస్ డిసౌజా ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

అనారోగ్యంతో మే నెలలో ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
ఆరోగ్యం దెబ్బతినడంతో మే నెలలో స్టాన్ స్వామిని ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆదివారం నాటికి ఆయన ఆరోగ్యం విషమించడంతో స్టాన్ స్వామికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన లాయర్లు సోమవారం ఉదయమే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 జరగాల్సి ఉంది. అయితే, ఆయన మృతి చెందినట్లు హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ అధికారులు బాంబే హైకోర్టుకు తెలిపారు.
స్టాన్ స్వామి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చరిత్రకారులు రామచంద్ర గుహ, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరీ ఇతర మానవ హక్కుల కార్యకర్తలు స్టాన్ స్వామి మృతికి సంతాపం తెలిపారు. హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవను గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వమే స్టాన్ స్వామి మరణానికి బాధ్యత వహించాలని హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
జైలులో ఇబ్బందులు
భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో స్టాన్ స్వామిని గత సంవత్సరం రాంచీలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
జైలులో మంచి నీళ్లు తాగడానికి తనకొక స్ట్రా, ఒక సిప్పర్ కావాలని ఆయన అడిగారు.
స్టాన్ స్వామి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చేతులు ఎప్పుడూ వణుకుతూ ఉంటాయి. గ్లాసుతో నీళ్లు పట్టుకుంటే ఒలికిపోతున్నాయని, నీళ్లు తాగలేకపోతున్నారని ఒక సిప్పర్ లేదా స్ట్రా ఇప్పించమని ఆయన తరపు లాయర్లు కోర్టును కోరారు.
దానికి కూడా జైలు అధికారులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా జైలు అధికారుల ప్రవర్తనపై దేశంలో అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంత చిన్న విషయాన్ని కూడా కోర్టు నిరాకరించింది.
దాంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తింది. తలోజా జైలుకు సిప్పర్లు పంపించాలనే ప్రచారాన్ని నెటిజన్లు ప్రారంభించారు.
#SippersForStan (సిప్పర్‌ఫర్‌స్టాన్) అనే హాష్‌ట్యాగ్‌తో ఈ ప్రచారం ట్విట్టర్‌లో పెల్లుబికింది.
అనేకమంది ఆన్‌లైన్‌లో సిప్పర్లు కొని తలోజా జైలుకు పంపించారు. ఆన్‌లైన్లో కొన్నవాటి రసీదుల స్క్రీన్ షాట్లతో ట్విట్టర్ నిండిపోయింది.
"స్ట్రాలు, సిప్పర్లతో జైలును ముంచెత్తుదాం, రండి" అంటూ ముంబై నివాసి దీపక్ వెంకటేశన్ ఫేస్‌బుక్‌లో రాశారు.
"ఒక జాతిగా మనలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదని ప్రపంచానికి నిరూపిద్దాం. నాయకులను తప్పుగా ఎంచుకుని ఉండొచ్చు.
కానీ మనలో మానవత్వం ఇంకా బతికే ఉంది. ఒక వ్యక్తికి ఒక స్ట్రా ఇప్పించలేని దౌర్భాగ్య దేశం కాదు మనది" అని వెంకటేశన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.
స్టాన్ స్వామి తరపు లాయర్లు కోర్టుకు వెళ్లిన మూడు వారాల తరువాత, స్వామికి సిప్పర్ అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడు నుంచి ఝార్ఖండ్ వరకు
తమిళనాడులో పుట్టిన స్టాన్ స్వామి తండ్రి వ్యవసాయదారుడు కాగా, తల్లి గృహిణి. వెనకబడిన, దళిత వర్గాల ప్రజల కోసం ఆయన బెంగళూరులో స్కూలు నడిపారు.
''ప్రజలు ఆయనంటే ప్రాణమిచ్చేవారు. ప్రజాసేవ విషయంలో ఆయన ఆయన అవసరమైతే చర్చి విధులను కూడా పక్కనబెట్టేవారు'' అని స్టాన్‌స్వామి స్నేహితుడు జేవియర్ డియాస్ అన్నారు. మృదు స్వభావిగా పేరున్న స్టాన్ స్వామి 1991లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడికి చేరుకుని ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.
మావోయిస్టులుగా ముద్రపడి జైళ్లలో మగ్గుతున్న దాదాపు 3వేలమంది ఆదివాసీ ప్రజల కోసం న్యాయస్థానంలో పోరాడారు. ఆదివాసీలకు తమ హక్కులేంటో వారికి గ్రామాలకు వెళ్లి వివరించేవారు.
వాళ్లకు తెలియకుండా, పరిహారం ఇవ్వకుండా వారి భూములను డ్యామ్‌లు, పరిశ్రమల కోసం ఎలా ఆక్రమించుకుంటున్నారో ఆయన ఆదివాసీలకు వివరించే వారు.
ఎల్గార్ పరిషత్ వివాదం ఏమిటి?
భీమా-కోరేగావ్ హింస కేసుకు సంబంధించి వామపక్ష అనుకూల రచయితలు, పాత్రికేయులు, కవి, గిరిజన ప్రాంత కార్యకర్తల అరెస్టులతో ఎల్గార్ పరిషత్ (సదస్సు) వార్తల్లోకి వచ్చింది.
2018 జనవరి 1వ తేదీన భీమా కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద అల్లర్లు చెలరేగాయి. దానికి ఒక రోజు ముందు శనివార్ వాడా మైదానాల్లో ఎల్గార్ పరిషత్‌ను నిర్వహించారు. అది హింసను ప్రేరేపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో స్టాన్ స్వామి పేరును కూడా చేర్చారు.
అసలు.. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఎల్గార్ పరిషత్ అంటే ఏమిటి?
ఈస్ట్ ఇండియా కంపెనీకి, పీష్వాల నాయకత్వంలోని మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన భీమా కోరేగావ్ సంగ్రామానికి 2018 జనవరి 1 నాటికి 200 సంవత్సరాలు. ఆ యుద్ధంలో మరాఠా సైన్యం పరాజయం పాలయింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన మహర్ రెజిమెంట్ సైనికుల సాహసానికి స్మారకంగా బ్రిటిష్ వాళ్లు అక్కడ విజయ ధ్వజం స్థాపించారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఈ స్మారకాన్ని సందర్శించినప్పటి నుంచీ ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఆ విజయోత్సవాలను గుర్తుచేసుకోవటానికి వేలాది మంది దళితులు ఇక్కడికి వస్తారు.
ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా.. 2017 డిసెంబర్ 31వ తేదీన 'భీమా కోరేగావ్ శౌర్య దిన్ ప్రేరణ అభియాన్' అనే వేదిక ఆధ్వర్యంలో పలు సంస్థలు 'ఎల్గార్ పరిషత్' పేరుతో ఒక బహిరంగ సభలో పాల్గొన్నాయి.
'ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని రక్షించండి.. దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఈ సభను శనివార్ వాడ మైదానాల్లో నిర్వహించారు. ఆ ప్రదేశం ఒకప్పటి మరాఠా సామ్రాజ్యానికి అధికార కేంద్రం.
రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ సభను ప్రారంభించారు. బహుజన్ మహాసంఘ్ (భారిప) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.జి.కోల్సే-పాటిల్, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేశ్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, గిరిజన కార్యకర్త సోని సోరి వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
సభలో వారు ప్రసంగించటంతో పాటు.. కబీర్ కళా మంచ్ వంటి బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ మరుసటి రోజు.. భీమా-కోరేగావ్ స్మారకం వద్ద ఉత్సవాలు జరుగుతుండగా సమీపంలోని సనాస్‌వాడి వంటి ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంత సేపు రాళ్లు విసరటం కొనసాగింది. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక యువకుడు చనిపోయాడు. ఆ హింస ధ్వని దేశమంతా వినిపించింది.

స్టాన్ స్వామి అరెస్టు
అక్టోబర్ మొదటివారంలో ఎన్ఐఏ స్టాన్ స్వామిని అరెస్ట్ చేసింది. ఆయనకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించింది.
అయితే , స్వామి ఈ ఆరోపణలన్నిటినీ ఖండించారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు. ఈ కేసులో అరెస్టైన అత్యంత వృద్ధుడు ఆయనే.
ఇవి కూడా చదవండి:
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- మోషన్ సిక్నెస్: వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఖైదీలు కళ్లజోడు, నీరు తాగడానికి స్ట్రా అడిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








