దిల్లీ: బాత్రా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక 8 మంది కోవిడ్ పేషెంట్లు ఎలా చనిపోయారు... డాక్టర్ ఏమన్నారు? - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని బాత్రా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందకపోవడంతో శనివారం 8 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఆక్సిజన్ అయిపోతుందని ముందుగా చెప్పినా సరైన సమయానికి ఆక్సిజన్ తమకు అందలేదని ఆక్సిజన్ వర్గాలు తెలిపాయి.
హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సీఈఓ) డాక్టర్ సుధాంశు బంకటతో బీబీసీ ప్రతినిధి ఆమీర్ పీర్జాదా మాట్లాడారు.
మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆక్సిజన్ అయిపోతుందని మాకు పొద్దున్న 7 గంటలకే తెలుసు. దాంతో మేము మా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మేము దిల్లీ ప్రభుత్వం నియమించిన ఆక్సిజన్ నోడల్ అధికారిని కూడా సంప్రదించాం. రానున్న ముప్పు గురించి ముందుగానే తెలియచేశాం. మాకు సాధారణంగా ఆక్సిజన్ సరఫరా చేసే గోయల్ అండ్ ఐనాక్స్ గ్యాసెస్ సంస్థ సాయంత్రం లోపు ఆక్సిజన్ పంపలేమని కచ్చితంగా చెప్పేసింది. అప్పటి వరకు పరిస్థితిని నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆక్సిజన్ సహకారం అందుతుందేమోనని ఆశించాం. వారికి మేము 12 గంటల వరకు సమాచారం ఇస్తూనే ఉన్నాం" అని సుధాంశు చెప్పారు.
"నేను ఈ విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకుని వెళ్లాను. ఆక్సిజన్ అయిపోతుందనే విషయాన్ని వివరించాను. సరిగ్గా మాకు ఆక్సిజన్ అయిపోతున్న సమయానికి సహాయం అందించమని కోర్టు దిల్లీ ప్రభుత్వానికి చెప్పింది.
దిల్లీ ప్రభుత్వం పంపిన ట్యాంకర్లు బురారి దగ్గర ఉండి ఉంటాయి. అవి మా దగ్గరకు చేరడానికి గంటా 20 నిమిషాల ముందే ఇక్కడ ఆక్సిజన్ అయిపొయింది. అదే సమయంలో 8 మంది ప్రాణాలు పోయాయి. చనిపోయిన వారిలో మా ఆసుపత్రికి చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కూడా ఉన్నారు. కోవిడ్ రోగులకు చికిత్స చేస్తుండడం వల్ల ఆయనకు కూడా కోవిడ్ సోకింది."
"ఈ రోజు చనిపోయిన వారందరూ కోవిడ్ రోగులే. అయితే, ఎంత మంది చనిపోయారో నేను కచ్చితంగా చెప్పలేను. ఆసుపత్రిలో ప్రస్తుతం 326 మంది రోగులు చికిత్స తీసుకుంటూ ఉండగా అందులో 307 మంది కోవిడ్ రోగులే ఉన్నారు. దిల్లీకి ప్రతి రోజూ 700 ఎమ్ టి ల ఆక్సిజన్ అవసరం ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం 490 ఎమ్ టిలు మాత్రమే జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ 490 ఎమ్ టిలు కూడా పూర్తిగా ఇవ్వలేదు. మా ఆసుపత్రికి 7 ఎమ్ టి ల ఆక్సిజన్ అవసరం ఉంటుంది."
"కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా పద్ధతి వల్ల మేమెప్పుడూ కేవలం 4.9 ఎమ్ టి లు మాత్రమే ఆక్సిజన్ పొందే అవకాశం ఉంది. ఈ లోటును పూడ్చడానికి మా దగ్గర వేరే ప్రత్యామ్న్యాయాలు ఏమి లేవు. అందుకే ఇలాంటి పరిస్థితి మాకు ప్రతి రోజు రెండు సార్లు వస్తోంది" అని ఆయన అన్నారు.
కోవిడ్ 19 సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి ఆసుపత్రులు పాఠాలు నేర్చుకోవాలని దిల్లీ హై కోర్టు చెప్పింది. ఈ సమస్యను నివారించడానికి ఆసుపత్రులు తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖను సీఎంకు బదిలీ చేస్తూ ఆదేశాలు

ఫొటో సోర్స్, Eetala/Twitter
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య-ఆరోగ్య శాఖను సీఎం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూకబ్జా ఆరోపణల్లో చిక్కుకుని విచారణ ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న శాఖను బదిలీ చేయాలని సీఎం చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
శుక్రవారం నాడు కొందరు రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. దానిపై, మీడియాలో వరసగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.
దీనిపై స్పందించిన ఈటల రాజేందర్, "గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు" తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ స్టాఫ్, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు. ఈటల రాజేందర్.

కోవిడ్: దేశంలో 4 లక్షలు దాటిన రోజువారీ కేసులు

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనావైరస్ కేసులు తొలిసారి 4 లక్షలు దాటాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,45,299 మందికి టెస్ట్‌లు చేయగా వారిలో 4,01,993 మందికి పాజిటివ్‌గా తేలింది.
దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1.91 కోట్లకు పెరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గత 24 గంటల వ్యవధిలో దేశంలో 3,523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,11,853కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులున్నాయి.

ఫొటో సోర్స్, Sajid patel
గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
గుజరాత్‌లోని భరూచ్‌లో ఓ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ తెలిపింది.
భరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
ఆసుపత్రి ఐసీయూలో ప్రమాదం జరిగిందని.. ప్రమాద సమయంలో వెంటిలేటర్లపై కొందరు రోగులున్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రమాదంలో 14 మంది కరోనా రోగులు, ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ట్రస్ట్ సభ్యుడు జుబేర్ పటేల్ చెప్పారు.
మిగతా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆసుపత్రిలో మంటలు చూడగానే పరిసర ప్రాంతాలలో నివసించే వారు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ప్రమాదం నుంచి రక్షించినవారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి కారణమేంటన్నది అధికారులు ఇంకా స్పష్టం చేయనప్పటికీ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు చెబుతున్నారు.
ఐసీయూ విభాగం పూర్తిగా కాలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








