మియన్మార్‌లో మళ్లీ కాల్పులు.. 14 మందికిపైగా నిరసనకారులు మృతి - Newsreel

నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లో మరోసారి తూటాలు ప్రాణాలు బలిగొన్నాయి. అక్కడి ప్రధాన నగరం యాంగూన్‌లో భద్రతాదళాల కాల్పులలో 14 మందికి పైగా మరణించారు.

యాంగూన్‌లోని హ్లెయింగ్ థర్యార్‌లో కొందరు నిరసనకారులు కర్రలు, కత్తులతో వీధుల్లోకి రావడంతో భద్రతాదళాలు కాల్పులు జరిపినట్లు మీడియాలో వస్తోంది.

మరోవైపు ఈ ప్రాంతంలో తమ దేశస్థులకు చెందిన కర్మాగారాలకు రక్షణ కల్పించాలంటూ చైనా మియన్మార్ అధికారులను కోరింది. చైనీయులకు చెందిన కొన్ని కర్మాగారాలు ఇప్పటికే దాడుల్లో ధ్వంసమయ్యాయి.

సైనిక కుట్ర తరువాత మియన్మార్ అల్లకల్లోలంగా మారింది.

వీల్ చెయిర్‌లో మమత

ఫొటో సోర్స్, Ani

మమత బెనర్జీపై దాడి జరగలేదు: ఈసీఐ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై దాడి జరగలేదని భారత ఎలక్షన్ కమిషన్(ఈసీఐ) కొట్టిపారేసింది.

ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీఐ ఈ నిర్ణయానికి వచ్చిందంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బుధవారం మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం తనపై దాడి జరిగిందని ఆరోపించారు. తన వెంట పోలీసులు లేనపుడు నలుగురు, ఐదుగురు పురుషులు తనను నెట్టివేశారని ఆమె చెప్పారు.

అనంతరం ఆమె కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే.. మమతా బెనర్జీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల్లో సానుభూతి కోసం ఇలా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ఆరోపించాయి.

పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో మమత బుధవారం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రాం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఆలయం నుంచి తిరిగి కారు దగ్గరకు వస్తుండగా.. కొందరు పురుషులు తనను నెట్టివేశారని, కారు డోరును కూడా వారు గట్టిగా తోయటంతో తన కాలు డోరులో చిక్కుకుందని.. మోకాలు, మడమలకు గాయాలయ్యాయని ఆమె చెప్పారు.

మమత బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉంటారని భావించారు. కానీ ఆమె కోల్‌కతా తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవటంతో ఆమెను నేరుగా రాష్ట్ర రాజధానిలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు.

ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లు.. మమత ఎడమ కాలుకి, మడమ ఎముకకి తీవ్ర గాయాలయ్యాయని.. ఆమె కుడి భుజానికి, కుడి చేయికి, మెడకు కూడా గాయాలయ్యాయని చెప్పారు.

తాజాగా ఈసీఐ మమత చెబుతున్నట్లుగా దాడి ఏమీ జరగలేని పేర్కొంది.

అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు

ఫొటో సోర్స్, Reuters

అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు

అర్జెంటీనాలోని పటగోనియా ప్రాంతంలో ఆ దేశాధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ప్రయాణిస్తున్న మినీబస్‌ను డజన్లకొద్దీ నిరసనకారులు చుట్టుముట్టారు. రాళ్లు విసురుతూ, వాహనంపై పిడిగుద్దులు గుద్దుతూ ముట్టడించారు.

కార్చిచ్చు అంటుకుని నాశనమైన ప్రాంతాన్ని ఫెర్నాండెజ్ సందర్శించారు. కార్చిచ్చు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే, నిరసనలు అందుకు కాదు.

చుబుత్ ప్రాంతంలో ఓపెన్-పిట్ మైనింగ్ (గుంతలు తెరిచి ఉంచి గనులు తవ్వడం) మళ్లీ ప్రారంభించే ప్రణాళికను వ్యతిరేకిస్తూ ప్రజలు నిసరనలు చేపట్టారు.

క్లారిన్ వార్తాపత్రిక అందించిన సమాచారం ప్రకారం.. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ ప్రోజెక్టులను మళ్లీ చేపట్టాలనే ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అక్కడ బంగారం, వెండి, యురేనియం భారీ నిల్వలు ఉన్నాయి. కమ్యూనిటీ సెంటర్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనకారులు గుమికూడారు.

ఫెర్నాండెజ్ తన వాహనం ఎక్కుతుండగా నిరసనకారులు చుట్టుముట్టారు. రాళ్లు, రువ్వుతూ వాహనంపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. వాహనం అద్దాలు కొన్ని పగిలిపోవడం గమనించవచ్చు.

ఇది అల్లరి మూకల దాడి అని, ఎవరో కొద్ది మంది గుమికూడి తన వాహనంపై రాళ్లు రువ్వారని, వీరికి చుబుత్‌లోగానీ అర్జెంటీనాలోని మిగతా ప్రాంతాల్లోగానీ మద్దతు లేదని ఫెర్నాండెజ్ కొట్టిపారేశారు.

ఇటీవల కాలంలో పటగోనియా ప్రాంతంలో పలుమార్లు కార్చిచ్చులు అంటుకున్నాయి. దీనివల్ల అనేకమంది తమ ఆవాసాలు కోల్పోయారు.

కార్చిచ్చుకు కారణాలు ఇంతవరకూ స్పష్టం కాలేదు. కానీ, ఇవి ఉద్దేశపూర్వకంగా ప్రారంభమైనవని అర్జెంటీనా అంతర్గత వ్యవహారాల మంత్రి అన్నారు.

దిశా రవి

ఫొటో సోర్స్, REUTERS/Adnan Abidi

'మీడియా టీఆర్‌పీ కోసం నన్ను నేరస్తురాలిని చేసింది.. కోర్టు కాదు': దిశా రవి ఆవేదన

టూల్ కిట్ కేసులో అరెస్ట్ అయిన పర్యావరణ కార్యకర్త దిశా రవి బెయిల్‌పై విడుదల అయిన తరువాత తొలిసారిగా శనివారం ఒక ప్రకటకన విడుదల చేశారు.

ట్విట్టర్‌లో విడుదల చేసిన నాలుగు పేజీల ప్రకటనలో మీడియాను విమర్శించడంతోపాటూ తనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

"ఏది వాస్తవమో అది సత్యానికి చాలా దూరంగా ఉంది: దిల్లీ పొగ (స్మాగ్), పటియాలా కోర్టు, తీహార్ జైలు. రాబోయే ఐదేళ్లల్లో మీరు ఎక్కడ ఉంటారని ఎవరైనా అడిగితే జైలు మాత్రం కాదని చెబుతాను'' అని పేర్కొన్నారు.

''ఆ సమయంలో, అక్కడ ఉన్నప్పుడు ఎలా అనిపించింది అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. కానీ, నా దగ్గర సరైన సమాధానం లేదు. ఇదంతా ఎలా ఎదుర్కోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నాకొక్కటే మార్గం కనిపిస్తోంది.. ఇదంతా నాకు జరగట్లేదని అనుకోవాలి. 2021 ఫ్రిబ్రవరు 13న పోలీసులు నాకోసం రాలేదు. నన్ను అరెస్ట్ చెయ్యలేదు. నన్ను పటియాలా హౌస్ కోర్టుకు తీసుకెళ్లలేదు. అక్కడ మీడియా నన్నేం ప్రశ్నించలేదు'' అని ఆమె ఆ ప్రకటనలో రాశారు.

''కోర్టులో ఏం చెప్పాలో నాకర్థం కాలేదు. అర్థమయ్యేసరికి నన్ను ఐదు రోజులు కస్టడీలో ఉంచారు. తరువాత, నా హక్కుల హననం జరిగింది. మీడియా నిండా నా ఫొటోలే. నన్ను నేరస్థురాలిని చేశారు. కోర్టు చెయ్యలేదు గానీ మీడియా తమ టీఆర్‌పీ కోసం నన్ను నేరస్థురాలిని చేసేసింది'' అంటూ దిశా రవి ఆవేదన వ్యక్తంచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''నా గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో తెలీక నేను అక్కడ కూర్చున్నాను. ఈ దురాశకు, వినిమయతత్వానికి మనం త్వరగా స్వస్తి చెప్పకపోతే పర్యావరణంలాగానే మనం వినాశనానికి దగ్గరవుతూ ఉంటాం" అని పేర్కొన్నారు.

తనకు మద్దతునిచ్చి, సహాయంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. "నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు ప్రో-బోనో (ప్రజా ప్రయోజన) చట్టం సహాయం లభించింది. కానీ ఇలాంటి సహయం అందని వారి సంగతేంటి? ఆ వెనుకబడిన వర్గాల వారి సంగతేంటి?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆలోచనలు ఎప్పుడూ అంతమైపోవు. ఎంత కాలమైనా సరే నిజం బయటకు రాక తప్పదు" అన్నారామె.

కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా గ్రేటా థన్‌బర్గ్ సోషల్ మీడియా షేర్ చేసిన 'టూల్ కిట్'‌కు సంబంధించి దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఫిబ్రవరి 13న బెంగళూరులో దిశా రవిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 23న దిల్లీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)