ఉత్తర కొరియా: ఏడాది తర్వాత కనిపించిన అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రిసోల్‌జు గత ఏడాది కాలంగా ఎవరికీ కనిపించ లేదు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో అధ్యక్షుడితో కలిసి పాల్గొన్నట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది.
మంగళవారంనాడు జరిగిన కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో రిసోల్‌జు ప్రత్యక్షమయ్యారు.
గతంలో భర్త కింగ్ జోంగ్ ఉన్‌తో కలిసి ఆమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ గత ఏడాది జనవరి నుంచి ఆమె ప్రజలకు కనిపించడం మానేశారు.
ఆమె ఆరోగ్యం బాగా లేదని కొంతకాలం, ఆమె గర్భవతి అయ్యారని కొంతకాలం అనేక ఊహాగానాలు ప్రచారమయ్యాయి.
అయితే కోవిడ్-19 కారణంగా రిసోల్‌జు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తమ దేశపార్లమెంటుకు తెలిపింది. ఆమె పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉండొచ్చని పేర్కొంది.
ఉత్తర కొరియా తమ దేశంలో కోవిడ్ కేసులు నమోదైనట్లు ఇంత వరకు అధికారికంగా ప్రకటించ లేదు. తమ దేశంలో అసలు కేసులే లేవని ఆ దేశం చెబుతుండగా, అది నిజం కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కింగ్ జోంగ్ ఉన్ భార్య కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో కనిపించగానే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయని మాన్సుడాయి ఆర్ట్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ జంట పేర్కొంది.
ఈ ప్రోగ్రామ్ సందర్భంగా కిమ్ అతని భార్య నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారని, ముఖాని మాస్కులు, సామాజిక దూరంలాంటి నియమాలేవీ వారు పాటించలేదని ఆ జంట వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
ఎవరీ రిసోల్ జు?
రిసోల్‌జు ఓ ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ అని, తల్లి ప్రసూతి వైద్యురాలని చియాంగ్ సియోంగ్-చాంగ్ అనే విశ్లేషకుడు వివరించారు.
31 సంవత్సరాల రిసోల్‌జు గతంలో గాయని అని, ఉన్హాసు ఆర్కెస్ట్రా అనే ప్రముఖబ్యాండ్‌లో పని చేసేవారని, అందులోని ఆర్టిస్టులందరినీ ప్రభుత్వమే నిర్ణయించేదని మీడియా రిపోర్టులు వెల్లడించాయి.
2009 రిసోల్‌జు కిమ్ జోంగ్ ఉన్‌ను వివాహమాడారు.2008లో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి తనకు గుండెపోటు రావడంతో హడావుడిగా ఈ వివాహం నిశ్చయించారని చియాంగ్ వెల్లడించారు.
ఉత్తర కొరియా ఇంటెలిజెన్స్ ప్రకారం కిమ్, రిసోల్‌జు దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిద్దరికీ జు-అయి అనే కూతురు ఉన్నట్లు తనకు తెలుసని అమెరికాకు చెందిన మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రాడ్‌మన్ తెలిపారు. మా డాడీ చాలా మంచివారని ఆ చిన్నారి తనకు తెలిపినట్లు రాడ్‌మన్ వెల్లడించారు.
మంగళవారం ఉదయం కిమ్ సూర్యదేవాలయమైన కుముసాన్ ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ తన తండ్రి, తాతల సమాధుల వద్దకు వెళ్లి వారికి నివాళులు అర్పించారు.
అయితే ఈసారి ఉత్తర కొరియా అధికారిక మీడియా కిమ్‌ను చైర్మన్ అని కాకుండా ప్రెసిడెంట్ అని సంబోధించడం చర్చనీయాశం అయ్యింది.
గతవారం ఉత్తరకొరియాకు చెందిన సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆయన్ను తొలిసారి ప్రెసిడెంట్‌గా సంబోధించింది.
ప్రెసిడెంట్ అనే మాటను కేవలం కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్‌జోంగ్ ఇల్‌కు మాత్రమే ఉపయోగిస్తుండగా, ఇప్పుడు కిమ్‌కు కూడా అదేమాట వాడటం ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:
- ప్రిన్సెస్ లతీఫా: దుబాయ్ పాలకుడి కుమార్తె 'నిర్బంధం' వ్యవహారంలో కొత్త మలుపు
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









