ఎలవెనిల్ వాలరివన్: ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేకెత్తిస్తున్న టాప్ షూటర్ - ISWOTY

పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రపంచ నెం.1 ఎలవెనిల్ వాలరివన్. ఆమె అమ్మ, నాన్న ఇద్దరూ విద్యావేత్తలే. అయినా, క్రీడలు మాని, చదువు మీదే దృష్టి పెట్టాలన్న ఒత్తిడి కూతురిపై ఎప్పడూ పెట్టలేదు.
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) నిర్వహించిన టోర్నీల్లో ఇప్పటివరకూ వాలరివన్ ఏడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు.
2018లో సిడ్నీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తించతగ్గ విజయాన్ని ఆమె నమోదు చేశారు. ఆ టోర్నీలో స్వర్ణం నెగ్గి, ఆ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ విజయం తనకు ఎంతో ప్రత్యేకమని వాలరివన్ అంటున్నారు. పోటీలకు ఒక్క రోజు ముందే ఆమె సిడ్నీ చేరుకున్నారు. జెట్ లాగ్ కారణంగా అప్పుడు ఆమె కాళ్లు వాచిపోయి ఉన్నాయి.
మరుసటి ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ రియోలో జరిగిన వరల్డ్ కప్‌లో వాలరివన్ స్వర్ణం సాధించారు. ఆ తర్వాత 2019లో చైనాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ బంగారు పతకం గెలిచారు.
ఈ ప్రదర్శనల ఫలితంగా ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి వెళ్లారు.
ప్రపంచ నెం.1గా మారిన తర్వాత తన పట్ల అంచనాలు ఎక్కువయ్యాయని, కానీ తన ప్రదర్శనపై ఆ ప్రభావం పడదని ఆమె అంటున్నారు.
మొదట్లో వాలరివన్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో ఆసక్తి ఉండేది. కానీ, ఆమె తండ్రి షూటింగ్ ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
ఆ సలహాను అనుసరిస్తూ షూటింగ్ ప్రయత్నించిన ఆమెకు, ఆ క్రీడ చాలా నచ్చింది.
షూటింగ్ సాధన తనకు ప్రశాంతతను ఇస్తూ ఉంటుందని వాలరివన్ అంటున్నారు.
అయితే, చకచకా, చురుగ్గా ఉండే తాను ఈ క్రీడకు తగ్గట్లుగా మారడానికి కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
షూటింగ్‌లో రాణించాలంటే శ్రద్ధ, ఓపిక చాలా అవసరం. ఈ క్రీడ కోసం మానసికంగానూ వాలరివన్ బాగా సన్నద్ధమవ్వాల్సి వచ్చింది.

సాధన మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే ఆమె మంచి ప్రదర్శన కనబరిచారు.
దీంతో ఆమె ప్రముఖ భారత షూటర్ గగన్ నారంగ్ దృష్టిలో పడ్డారు. నారంగ్ ఆమెను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.
గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న జిల్లా స్థాయి క్రీడా పాఠశాలలో వాలరివన్ 2014లో ప్రొఫెషనల్‌గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు.
మొదట్లో మ్యానువల్ షూటింగ్ రేంజీల్లోనే సాధన చేయాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వాలరివన్ గుర్తు చేసుకున్నారు.
2017 వరకూ కోచ్ నేహా చౌహాన్, నారంగ్ తనకు శిక్షణ ఇచ్చారని ఆమె చెప్పారు.
నారంగ్ మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అంతర్జాతీయ టోర్నీల్లో రాణించేందుకు తనకు ఎంతగానో తోడ్పడ్డాయని వాలరివన్ అన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా తనకు అండగా నిలిచాయని చెప్పారు.
2017లో జాతీయ జట్టులో భాగమైనప్పటి నుంచి తమకు వసతులు చాలా మెరుగుపడ్డాయని ఆమె చెప్పారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నట్లు వాలరివన్ అన్నారు.
(వాలరివన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









