తెలంగాణ సచివాలయం: చివరి దశకు చేరిన కూల్చివేత - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయని, కేవలం రెండు బ్లాకులు మాత్రమే ఉన్నాయని ఈనాడు కథనం ఇచ్చింది.
కూల్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, పదుల సంఖ్యలో ఆధునిక కూల్చివేత యంత్రాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయనని ఈనాడు పేర్కొంది.
శిథిలాల నుంచి వ్యర్ధాలను, ఇనుమును వేరు చేసేందుకు వందలమంది కార్మికులు పని చేస్తున్నారని అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.
మొత్తం 11 బ్లాకుల్లో 9 బ్లాకుల కూల్చివేత పూర్తయిందని, మంగళవారం సాయంత్రం లేదంటే బుధవారం మధ్యాహ్నంకల్లా అన్ని భవనాల కూల్చివేత పూర్తవుతుందని, కూల్చివేత సందర్భంగా దుమ్ముగాలిలో కలవకుండా ఆధునిక యంత్రాలతో నీళ్లు చల్లుతున్నారని ఈ కథనం వెల్లడించింది.
శిథిలాల నుంచి 4500 లారీల వ్యర్ధాలు వస్తాయని అంచనా వేశామని , ఇప్పటికే 2000 లారీల వ్యర్థాలను తరలించామని అధికారులు వెల్లడించినట్లు ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'నా స్నేహితుడితో సుఖపడు... అమెరికా వెళ్లి ముగ్గురం ఎంజాయ్ చేద్దాం'
కూతురు జీవితం బాగుంటుందని ఆశపడి ఎన్నారైతో పెళ్లి చేయగా, పెళ్లయిన రెండో రోజే కాపురం తనతో కాదని, తన స్నేహితుడితో చేయాలని వరుడు మెలికపెట్టాడంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక కథనం రాసింది.
‘‘గుంటూరుకు చెందిన యువతికి అమెరికా సంబంధమని ఘనంగా కట్నకానుకలిచ్చి నగరానికే చెందిన యువకుడితో వివాహం చేశారు.
అయితే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అతను, పెళ్లయిన రెండో రోజే యువతికి షాకిచ్చాడు.
తనకు అమ్మాయిలంటే ఇష్టంలేదని, తాను 'గే'నని, అమెరికాలో ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నానని వధువుకు చెప్పాడు.
తాను ఆ యువకుడితోనే ఉంటానని, నువ్వు అతనితో సంసారం చేయాలని భార్యకు చెప్పాడ’’ని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
వరుడి వైఖరికి వధువు షాక్ తినగా, పెళ్లయిన రెండు నెలల తర్వాత వరుడు చెప్పాపెట్టకుండా అమెరికా వెళ్లిపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన తల్లిదండ్రులు వరుడిపై కేసు పెట్టారని ఆ కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, facebook/somu veerraju
ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికైనట్లు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికలు ప్రధాన వార్తగా రాశాయి.
ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఆయన్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుందని ఆంధ్రజ్యోతి రాసింది. కన్నాను మరో దఫా కొనసాగిస్తారని అంతా అనుకున్నారని, కానీ ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును ఎంపిక చేశారని వెల్లడించింది.
కొన్నాళ్లుగా కన్నాకు, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి పడటంలేదని, కన్నాపై ఆయన తరచూ అవినీతి ఆరోపణలు చేశారని, దిల్లీలో బీజేపీ అధిష్టానానికి సన్నిహితుడైన విజయసాయి, కన్నాను తప్పించడంలో తనవంతు పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని ఆంధ్రజ్యోతి రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
పబ్జీ, లూడో గేమ్‌లకు త్వరలో చెక్ ! -మరో 47 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం
దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పు ఉందన్న అనుమానంతో చైనాకు చెందిన మరో 47 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని సాక్షితో పాటు పలు పత్రికలు కథనాలు ఇచ్చాయి.
దీంతో ప్రభుత్వ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 106కు చేరుకుంది.
త్వరలోనే పబ్జీ, లూడోగేమ్, అలీబాబా ఈ-కామర్స్‌కు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరికొన్ని యాప్‌లపై కూడా నిషేధం విధించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సాక్షి వెల్లడించింది.
చైనాకు చెందిన మొత్తం 275 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని, ఈ యాప్‌ల నుంచి భారతదేశానికి సంబంధించిన సమాచారం చైనాలోని వివిధ కంపెనీల చేతిలోకి వెళుతోందని ఒక్క భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








