సీఏఏ వల్ల దేశంలోని 130 కోట్ల భారతీయుల్లో ఏ ఒక్కరికైనా అన్యాయం జరుగుతుందా? -కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్

ఫొటో సోర్స్, FB/BJP4Andhra
"బంగ్లాదేశ్ వారికి భారత పౌరసత్వం లభిస్తే, సగం బంగ్లాదేశ్ ఖాళీ అవుతుంది" కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లో సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ మాట ఆయన చెప్పారు.
అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఎలా భారత పౌరులకు ఎలా వ్యతిరేకం అవుతుందో చెప్పాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సవాలు విసిరారు.
"భారత్ బంగ్లాదేశీయులకు పౌరసత్వం ఇవ్వడం ప్రారంభిస్తే, సగం బంగ్లాదేశ్ ఖాళీ అయిపోతుంది. తర్వాత దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. రాహుల్ గాంధీనా, లేక కేసీఆరా? వారు చొరబాటుదారుల కోసం పౌరసత్వం డిమాండ్ చేస్తున్నారు" అని కిషన్ రెడ్డి అన్నారు.
"సీఏఏ వల్ల ఈ దేశంలో ఉన్న 130 కోట్ల భారతీయుల్లో ఏ ఒక్కరికైనా అన్యాయం జరుగుతుందా, నష్టం జరుగుతుందా నిరూపించాలని నేను టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌కు సవాలు విసురుతున్నా" అని కిషన్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శరణార్థులు, చొరబాటుదారులను ఒకేలా చూడకూడదని కిషన్ రెడ్డి అన్నారు.
"కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి" అన్నారు.
బంగ్లాదేశ్ కూడా భారత కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. కొన్నిరోజుల ముందు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సీఏఏ, ఎన్ఆర్సీ భారత అంతర్గత అంశాలని, కానీ వాటి ఔచిత్యం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు.
ఇంతకు ముందు పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతుండడంతో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మోమిన్, హోంమంత్రి అసద్ ఉజ్జమాన్ ఖాన్ తమ భారత పర్యటన రద్దు చేసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు హింసకు గురవుతున్నారన్న భారత హోంమంత్రి అమిత్ షా ప్రకటనను అబ్దుల్ మోమిన్ ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగైన జీవితం కోసం భారత నుంచి బంగ్లాదేశ్ వస్తున్నారు
"బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అది అవాస్తవం. మొత్తం ప్రపంచంలో బంగ్లాదేశ్ లాంటి మత సామరస్యం ఉన్న దేశాలు చాలా తక్కువ. మా దగ్గర మైనారిటీలు ఎవరూ లేరు. మేమంతా సమానం. ఒక పొరుగు దేశంగా, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు విఘాతం కలిగేలా భారత్ అలా ఏదీ చేయదనే మేం ఆశిస్తున్నాం. ఈ విషయం గురించి మాకు ఇటీవలే తెలిసింది. మేం ఆ చట్టం గురించి పూర్తిగా చదువుతాం. ఆ తర్వాత భారత్ దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం" అని ఆ దేశ మంత్రి మోమిన్ అన్నారు.
మతాల ఆధారంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం వల్ల భారత్ లౌకికవాదం బలహీనం అవుతుందని అన్నారు.
బంగ్లాదేశ్ మెరుగైన ఆర్థికవ్యవస్థ, ఆ దేశంలో ఉచిత భోజనం లాంటివి చూసి భారత పౌరులు తమ దేశానికి వస్తున్నారని ఆయన చెప్పారు.
"మా పరిస్థితి చాలా బాగుంది కాబట్టే భారతీయులు బంగ్లాదేశ్ వస్తున్నారు. మా ఆర్థికవ్యవస్థ బలంగా ఉంది. ఇక్కడికి వస్తున్నవారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. పేద ప్రజలకు ఇక్కడ ఉచిత భోజనం కూడా లభిస్తోంది".
"భారత్‌తో పోలిస్తే మా ఆర్థికవ్యవస్థ చాలా బాగుంది. భారతీయులకు ఉద్యోగాలు లభించడం లేదు. అందుకే వారు బంగ్లాదేశ్ వస్తున్నారు. కొంతమంది మధ్యవర్తులు బంగ్లాదేశ్‌లో ఉచిత భోజనం లభిస్తుందని భారత్‌లో పేదలకు చెబుతున్నారు" అన్నారు.
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల వాదనలు, రాజకీయ ప్రకటనల మధ్య ప్రస్తుత పరిస్థితిని చూస్తే, బంగ్లాదేశ్ ఆర్థిక విజయం దిశగా వెళ్తోందనే విషయంలో వాస్తవం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ భారత్ కంటే ముందుందా?
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎప్పుడూ స్నేహ సంబంధాలు ఉంటూ వచ్చాయి. కానీ బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం ఇప్పుడు ఈ రెండు దేశాలనూ ప్రత్యర్థులుగా మారుస్తుందా? బంగ్లాదేశ్ భారత్‌ను దాటి ముందుకెళ్లిపోతుందా?
ఎందుకంటే, భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు పతనమై 5 శాతానికి దగ్గరగా ఉంది. ఇక్కడ ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, సర్వీస్ సెక్టార్ పరిస్థితి దెబ్బతినడంతో ఆర్థికవ్యవస్థ వేగం మందగించింది.
అటు బంగ్లాదేశ్ తన ఐటీ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ బలంతో 8 శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్తోంది.
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థ ఇప్పుడు 180 బిలియన్ డాలర్ల నుంచి పెరిగి 2012 నాటికి 322 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇటు భారత్ ఆర్థికవ్యవస్థ దాదాపు 2.7 ట్రిలియన్ డాలర్లు ఉంది. మరో ఐదేళ్లలో భారత్‌కు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ, భారత ఆధిపత్యం చెలాయించే ఆర్థిక రంగాలపై బంగ్లాదేశ్ గట్టి దెబ్బ కొట్టడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ ప్రగతి ఎలా ఉంది?
వస్తూత్పత్తి రంగంలో బంగ్లాదేశ్ వేగంగా ప్రగతిపథంలో వెళ్తోంది. వస్త్ర పరిశ్రమలో ఆ దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇటీవలి దశాబ్దంలో బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థ సగటు 6 శాతం వార్షికరేటుతో ముందుకెళ్తోంది. 2018 జూన్ నెలలో ఈ వృద్ధిరేటు 7.86 శాతం వరకూ చేరుకుంది.
16.6 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ 1974లో భయంకర కరువు తర్వాత ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. 2009 నుంచి బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
గత ఏడాది బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం 1750 డాలర్లు అయ్యింది. బంగ్లాదేశ్‌లో పెద్ద సంఖ్యలో జనం పేదరికంలో ఉన్నారనేది కూడా ఒక వాస్తవం. కానీ ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం ప్రతి రోజూ 1.25 డాలర్లలో జీవితం గడిపేవారు దేశంలో 19 శాతం ఉండేవారు. అది ఇప్పుడు 9 శాతం అయ్యింది.
బంగ్లాదేశ్ వృద్ధి రేటులో భారత్‌ను అధిగమించగలదని ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బశు అన్నారు.
- బంగ్లాదేశ్- భారత్ పోటాపోటీగా ఉన్న రంగాలను ఒకసారి చూస్తే
- బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి సగటు వయసు 72 ఏళ్లు. అది భారత్‌లో 68 ఏళ్లు.
- భారత్‌లో బ్యాంక్ ఖాతా ఉన్నా, అందులో ఎలాంటి లావాదేవీలు జరపని వారు 48 శాతం మంది ఉన్నారు. బంగ్లాదేశ్‌లో అలాంటి వారు 10.4 శాతం మంది ఉన్నారు. అంటే బంగ్లాదేశ్‌లో లావాదేవీలు చేయని ఖాతాదారుల సంఖ్య భారత్ కంటే తక్కువ.
- శిశుమరణాల రేటు, లైంగిక సమానత్వం, సగటు వయసు విషయాల్లో బంగ్లాదేశ్ భారత్ కంటే ముందుంది.
- ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అంచనాల ప్రకారం దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యానికి బంగ్లాదేశ్ సవాలు విసరవచ్చు.
- బంగ్లాదేశ్ జనరిక్ మందుల తయారీ విషయంలో భారత్‌కు సవాలు విసిరేందుకు ప్రయత్నిస్తోంది. జనరిక్ మందుల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ రెండో అతిపెద్ద దేశంగా మారింది. 60 దేశాల్లో ఈ మందులను దిగుమతి చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు
- ‘జన్‌ధన్ ఖాతాలో ఉన్నట్లుండి రూ.30 కోట్లు వచ్చిపడ్డాయ్.. ఎవరు వేశారో తెలియదు’
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









