కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ బాధితుల చికిత్స కోసం చైనా వుహాన్‌లో 8 రోజుల్లో నిర్మించిన 1000 పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది.

లీషెన్షాన్‌లో నిర్మిస్తున్న మరో హాస్పిటల్ బుధవారానికి పూర్తవుతుంది.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

25000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైన హైషెన్షాన్ హాస్పటల్ సోమవారం ప్రారంభం కానుంది. జనవరి 24న దీని నిర్మాణం ప్రారంభమైంది.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

చైనా సైన్యానికి చెందిన 1400మంది వైద్య సిబ్బంది దీని నిర్వహణను చూస్తారని, వారికి ఇన్ఫెక్షన్‌ల కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో అనుభవం ఉందని స్థానిక టీవీ తెలిపింది. వారు వుహాన్‌లోని నూతన హాస్పటల్ వద్దకు చేరుకుంటారని తెలిపింది.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటివరకూ దాదాపు 22 దేశాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య, సార్స్ మహమ్మారి కేసులను మించిపోయింది. 2003లో వచ్చిన సార్స్ 20 దేశాలకు పైగా వ్యాపించింది. కానీ కరోనావైరస్ వల్ల మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇది అంత ప్రాణాంతకం కాదని చెబుతున్నారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో 361 మంది మరణించారు. 17000కు పైగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు.

చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం నాడు విడుదల చేసిన వివరాలను బట్టి...

  • 21558 అనుమానిత కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి
  • 152700 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు
  • 475 మందిని హాస్పటల్ నుంచి డిశ్ఛార్జ్ చేశారు
చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం నాడు చైనా బయట ఫిలిప్పీన్స్‌లో మొదటి కరోనావైరస్ మృతి నిర్ధరణైంది.

వుహాన్ నుంచి వచ్చిన ఓ 44ఏళ్ల వ్యక్తికి అక్కడకు చేరడానికి ముందే ఆ వైరస్ సోకిందని భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా బయట కూడా 150కి పైగా కరోనావైరస్ బాధిత కేసులు నమోదయ్యాయి.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

Presentational grey line
News image
Presentational grey line
చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పటళ్లలో ప్రస్తుతం సిబ్బంది కొరతతో పాటు, సామర్థ్యానికి మించిన రోగుల తాకిడి నెలకొంది. మరోవైపు కరోనావైరస్ బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు.

హాస్పటళ్లలో పనిచేసే కొందరు సిబ్బంది కనీసం బాత్ రూమ్‌కి వెళ్లే సమయం కూడా లేకపోవడంతో నేపీలు ధరించి పనిచేస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

ఆస్పత్రుల్లో మందులు, ఇతర సామగ్రికి కూడా లోటు ఏర్పడింది. "వైద్య సామగ్రి సరిపడా అందుబాటులో లేదు, దయచేసి హెల్ప్ చేయండి" అని వుహాన్ పిల్లల ఆస్పత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆస్పత్రుల బయట పొడవైను క్యూలు ఉండటం సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో కనిపిస్తోంది.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

కొత్తగా నిర్మించిన హాస్పటళ్లతో కలుపుకుంటే నగరంలో మొత్తం 10000 పడకలు అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం నమోదవుతున్న అనుమానిత, నిర్ధారిత కరోనావైరస్ కేసుల చికిత్సకు ఇవి సరిపోతాయని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి జియా యహూయ్ వార్తాసంస్థ రాయిటర్స్‌కి తెలిపారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

హుబే ప్రావిన్సులో శనివారం నాడు మరో 45 మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా 2590 మందికి కొత్తగా వ్యాధి నిర్థరణ జరిగింది. అయితే అధికారిక లెక్కల కన్నా వాస్తవంగా బాధితులు ఇంకా ఎక్కువగానే ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అంచనా వేసింది. వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌లో 75000కు పైగా బాధితులు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

రాబోవు రోజుల్లో కరోనా కేసులు పెరగవచ్చని 60 లక్షల మంది నివసించే హ్యుయాంగంగ్ మేయర్ హెచ్చరించినట్లు దేశ మీడియా చెప్పింది. వుహాన్ నుంచి బయటికెళ్లడాన్ని నిషేధించక ముందు ఆ నగరం నుంచి 7 లక్షల వేల మంది హ్యుయాంగంగ్ నగరానికి తిరిగి వచ్చారు.

దీంతో నగరంలో దారుణమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆహారం, ఇతర సరుకులు కొనుక్కోడానికి రెండు రోజులకు ఒకసారి బయటికివెళ్లడానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ నివారణ, చికిత్సలకోసం 170 బిలియన్ డాలర్లను దీనికోసం వెచ్చించనున్నట్లు ఆదివారంనాడు ప్రభుత్వం ప్రకటించింది.

వుహాన్ సహా మిగతా ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ ఉంది. దేశవ్యాప్తంగా ప్రాధాన్యం లేని వ్యాపారాలను మూసివేశారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

ప్రయాణాలపై ఉన్న నిషేధం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

"ప్రయాణాలపై నిషేధం వల్ల అది సమాచారం పంచుకోవడాన్ని, మందుల సరఫరాను అడ్డుకుని మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తుంది" అని డబ్ల్యుహెచ్ఓ హెడ్ శుక్రవారం అన్నారు.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

చైనా నుంచి వచ్చే విదేశీయులను చాలా దేశాలు నిషేధించాయి. చైనా నుంచి వచ్చే తమ పౌరులను సైతం క్వారంటైన్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నాయి.

చైనా ఆస్పత్రి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

అధికారిక సరిహద్దుల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని డబ్ల్యుహెచ్ఓ సూచించింది. సరిహద్దులను మూసేయడం వల్ల ప్రయాణికులు అనధికారికంగా దేశాల్లోకి ప్రవేశిస్తే, వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.

ప్రయాణాలపై నిషేధం విధించడాన్ని చైనా విమర్శించింది. విదేశీ ప్రభుత్వాలు అధికారిక సలహాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

కరోనా కేసులు

ఇటీవల చైనాలో పర్యటించి తమ దేశానికి వచ్చే విదేశీయులను అనుమతించబోమని అమెరికా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. రష్యా, జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియాలు కూడా కొన్ని ఆంక్షలు విధించాయి.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)