బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవీ...

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Reuters

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీని "జీఎస్టీ రూపశిల్పి"గా స్మరించుకుంటూ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా అదుపు చేయగలిగామని ఆమె అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ ఆకాంక్షలు, ఆర్థిక ప్రగతి, ప్రజల సంరక్షణ అనే మూడు అంశాల మీదే తన బడ్జెట్ రూపొందిందని ఆమె అన్నారు. ఇవీ బడ్జెట్‌‌లోని ముఖ్యాంశాలు:

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook/BugganaRajendranath

ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన: ప్రత్యేక హోదా ఊసే లేదు

కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ బడ్జెట్‌ వల్ల రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో ఏమన్నారంటే...

రాష్ట్రానికి వచ్చేసరికి చాలా నిరాశగా ఉంది. 2014లో రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. ఆ సమయంలో చాలా విభజన హామీలు ఇచ్చారు. కానీ ఈ హామీలు ఆలస్యం కావడం లేదా వాయిదా పడటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతోంది.

ప్రత్యేకహోదా చాలా కాలంగా నలుగుతున్న అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి హామీ రావడం లేదు.

విభజన నాటి ఆదాయలోటును ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సుమారు రూ.19 వేల కోట్లు రావాలి.

వెనుకబడిన ఏడు జిల్లాలకు బుందేల్ ఖండ్ మాదిరిగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.1000 కోట్లకు పైగా ఇచ్చారు తప్ప అంతకు మించి ఏమీ ఇవ్వలేదు.

పోలవరానికి సంబంధించిన రీయింబర్సమెంట్లు కూడా ఆలస్యం అవుతున్నాయి.

దుగ్గరాజపట్నం, రామాయపట్నం పోర్టులపై స్పష్టమైన హామీ లేదు.

హైదరాబాద్‌లో ఎన్నో సంస్థలను వదులుకోవాల్సి వచ్చింది. వాటికి బదులుగా కడప స్టీల్, ఆయిల్ రిఫైనరీ వంటి సంస్థలు రావాల్సి ఉంది. కొన్ని విద్యాసంస్థలు అయితే వచ్చాయి కానీ వాటికి సంబంధించి ఎంతో గ్రాంట్ రావాల్సి ఉంది.

వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రావాలి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కావాలి.

ప్రధాని నరేంద్ర మోదీ: ఉపాధి కల్పనకు పెద్దపీట

వ్యవసాయం, మౌలికవసతులు, జౌళి, టెక్నాలజీ రంగాల్లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో వీటికి చాలా ప్రాధాన్యం లభించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పి చిదంబరం: ఆర్థికమంత్రి సాధిస్తారనే నమ్మకం లేదు

నామినల్ జీడీపీ, ద్రవ్యలోటు, నికర పన్ను ఆదాయం వసూళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ, వ్యయాలు వంటి వాటి విషయంలో 2019-20 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆర్థికమంత్రి సాధించలేకపోయారు. కాబట్టి 2020-21లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆమె చేరుకుంటారనే నమ్మకం లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సీతారాం ఏచూరి: వట్టి గొప్పలే

గొప్పలు, నినాదాలు మాత్రమే. ప్రజల కష్టాలు, నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరల కట్టడికి నిర్మాణాత్మక చర్యలు ఏమీ లేవు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

1000 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.

300 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.

రాజ్‌నాథ్ సింగ్: అద్భుతమైన బడ్జెట్

దేశానికి అద్భుతమైన బడ్జెట్ అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూనే దేశ అవసరాలు, లక్ష్యాలకు పెద్ద పీట వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

రాహుల్ గాంధీ: డొల్ల బడ్జెట్

బడ్జెట్ చరిత్రలో బహుశా ఇదే సుదీర్ఘ ప్రసంగం కావొచ్చు. కానీ ఇందులో ఏమీ లేదు. వట్టి డొల్ల బడ్జెట్.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Twitter/INCIndia

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ప్రస్తుతం సెన్సెక్స్ 653 పాయింట్ల కోల్పోయి 40,069 వద్ద కదలాడుతోంది. నిన్న 40,723 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఉదయం 40,753 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 40,905 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అటు నిఫ్టీ కూడా 196 పాయింట్ల నష్టంతో 11,766 వద్ద కదలాడుతోంది.

బడ్జెట్ సందర్భంగా నేడు ప్రత్యేక ట్రేడింగ్‌కు అనుమతించారు.

Presentational grey line
News image
Presentational grey line

ఆదాయపు పన్ను శ్లాబు రేటుల్లో మతలబు

పన్ను మినహాయింపు వదులుకుంటేనే కొత్త శ్లాబులు వర్తిస్తాయన్న ఆర్థిక మంత్రి. పన్ను మినహాయింపులు పొందే వారికి పాత పన్ను శ్లాబులే వర్తిసాయి.

ఈ రెండు విధానాల్లో తమకు నచ్చిన దాన్ని పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు.

పన్ను మినహాయింపు వదలుకుంటే...

రూ.2.5-5 లక్షలు-పన్నులేదు

రూ.5- 7.5 లక్షలు -10%

రూ.7.5-10 లక్షలు -15%

రూ.10-12.5 లక్షలు -20%

రూ.12.5-15 లక్షలు-25%

రూ.15 లక్షలకుపైన-30%

పన్ను మినహాయింపులు కావాలనుకుంటే...

రూ.2.5-5 లక్షలు-5%

రూ.5- 10 లక్షలు -20%

రూ.10 లక్షలపైన-30%

1:44 PM

ముగిసిన బడ్జెట్ ప్రసంగం.

1:43 PM

దిగుమతి చేసుకునే వైద్యపరికరాలపై హెల్త్ సెస్.

తక్షణమే పాన్.

ఆధార్ ఆధారిత ట్యాక్స్ వెరిఫికేషన్.

పాదరక్షలు, ఫర్నీచర్‌పై కస్టం డ్యూటీ పెంపు.

1:38 PM

అందుబాటు ధరలో ఉండే గృహ నిర్మాణదారులకు పన్ను విరమణ పొడిగింపు.

పన్ను వివాదాలకు కొత్త డిజిటల్ స్కీం.

వార్షిక ఆదాయం రూ.15 లక్షల ఉండి ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్స్ లేని వారు ఇక రూ.1.95 లక్షలు మాత్రమే పన్నుగా చెల్లించాలి. ఇంతకుముందు ఇది రూ.2.73 లక్షలుగా ఉంది.

1:20 PM

మదుపుదార్లకు భారీ ఊరట. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగింపు.

ఎంప్లాయి స్టాక్ ఆప్షన్స్‌పై పన్ను 5 సంవ్సతరాలు వాయిదా.

1:05 PM

వ్యక్తిగత ఆదాయపన్నులో భారీ సంస్కరణలు. సరికొత్త పన్ను శ్లాబులు ప్రతిపాదన.

రూ.5 లక్షలలోపు ఆదాయానికి పన్ను కట్టనక్కర్లేదు.

రూ.5-7.5 లక్షలు 10%

రూ.7.5-10 లక్షలు 15%

రూ.10-12.5 లక్షలు 20%

రూ.12.5-15 లక్షలు 25%

రూ.15 లక్షలకుపైన 30%

12:45 PM

డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు.

ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వవాటాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తాం.

షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కొత్త యంత్రాంగం.

12:40 PM

ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకుల నాన్-గెజిటెడ్ ఉద్యోగుల నియామకాల విధానంలో సంస్కరణలు.

నాన్-గెజిటెడ్ ఉద్యోగుల నియామకాలకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ.

పన్ను చెల్లింపుదారులకు వేధింపులను తగ్గించేందుకు ట్యాక్స్‌పేయర్ చార్టర్‌.

12:35 PM

జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధికి రూ.30, 757 కోట్లు.

లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.

12:30 PM

పోషకాహారలోపాలను నిర్మూలించేందుకు రూ.35,600 కోట్లు .

ఎస్, ఓబీసీల అభివృద్ధికి రూ.85,000 కోట్లు.

ఎస్‌టీల అభివృద్ధికి రూ. 53,700 కోట్లు.

వయోవృద్ధులు, వికలాంగులకు రూ.9,000 కోట్లు.

12:25 PM

10 లక్షలు జనాభా ఉన్న పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి కోసం రూ.4,400 కోట్లు.

భారత పర్యాటక రంగంలో 7.8శాతం వృద్ధి.

సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు

రాంచీలో ట్రైబల్ మ్యూజియం.

12:20 PM

డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు.

అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా 5 పురాతన క్షేత్రాల అభివృద్ధి. అవి ఏమిటంటే... రాఖీగాడీ (హరియాణ), హస్తినాపుర్ (ఉత్తర్ ప్రదేశ్), శివ్ సాగర్ (అస్సాం), ధోలవీర (గుజరాత్), ఆదిచ్చనల్లూర్ (తమిళనాడు).

12:15 PM

విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.22,000 కోట్లు.

ప్రస్తుత విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తీసుకురావాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి.

12:10 PM

నాబార్డ్ రీఫైనాన్స్ పథకాన్ని పొడిగిస్తాం.

అగ్రికల్చర్ రీఫైనాన్స్ పథకం లక్ష్యం రూ.15 లక్షల కోట్లు.

చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు పెంచుతాం.

వ్యవసాయం, నీటిపారుదలకు రూ.2.83 లక్షల కోట్లు.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌కు రూ.1.23 లక్షల కోట్లు.

12:05 PM

స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లు

వైద్యరంగానికి రూ.69,000 కోట్లు

జల్‌జీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు

టైర్-2, టైర్-3 పట్టణాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన.

జన్ ఔషధి కేంద్రాలను మరింత విస్తరిస్తాం.

12:00 PM

150 ఉన్నత విద్యా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ ప్రారంభిస్తాం.

అప్పుడే ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకొని వచ్చిన విద్యార్థులకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తాయి.

విద్యారంగానికి రూ.99,300 కోట్లు

నైపుణ్యాల మెరుగుదలకు రూ.3,000 కోట్లు

11:40 AM

నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.

టీచర్లు, పారామెడికోల సంఖ్యను పెంచుతాం.

జిల్లా ఆసుపత్రుల్లో వైద్యకళాశాలల ఏర్పాటు.

జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం.

భారత్‌లో చదువుకునేందుకు 'ఇండ్‌సాట్' కార్యక్రమం.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, LSTV

11:30 AM

జీరో బడ్జెట్ జాతీయ వ్యవసాయ విధానం.

రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం.

11:25 AM

వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహానికి 'కృషి ఉడాన్'.

భారతీయ రైల్వే కిసాన్ రైలు తీసుకొస్తుంది.

ప్రస్తుతం ఉన్న గిడ్డంగులకు జియో ట్యాగింగ్.

11:20 AM

వ్యవసాయ రంగానికి 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక.

వ్యవసాయ మార్కెట్ల సరళీకరణ.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నాం.

11:15 AM

ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ.

16 లక్షల మంది కొత్తగా ఆదాయపన్ను పరిధిలోకి వచ్చారు.

మార్చి 2019 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు జీడీపీలో 48.7శాతానికి తగ్గాయి.

11:05 AM

జీఎస్‌టీ విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణ.

దేశ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేస్తాయి.

అరుణ్‌జైట్లీకి సంతాపం తెలిపిన నిర్మలా సీతారామన్.

ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, మైనార్టీల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.

2014-19 మధ్య మా ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.

ఆర్థిక వ్యవస్థమూలాలు బలంగా ఉన్నాయి.

10:55 AM

మరికొద్ది సేపటిలో ప్రారంభంకానున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం. ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని, ఇతర మంత్రులు.

10:40AM

బడ్జెట్ 2020 సమర్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. అంతకు ముందు ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్రమంత్రి మండలి సమావేశం తరువాత 11 గంటలకు ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

మందగమనంలో ఆర్థికవ్యవస్థ

ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ 11 ఏళ్లలో అత్యల్పంగా 5 శాతం రేటుతో వృద్ధి చెందుతోంది. ప్రైవేట్ వినియోగం 7 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. పెట్టుబడుల వేగం 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత నెమ్మదిగా ఉంది. తయారీ రంగం 15 ఏళ్లలో కనీ వినీ ఎరుగని స్థాయిలో కనిష్టానికి చేరింది. వ్యవసాయ రంగంలో కూడా వృద్ధి నాలుగేళ్లలో ఇదే అత్యల్పం.

వీటితో పాటు పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ద్రవ్యోల్పణం 7.35 శాతానికి పెరిగింది. అయితే, తిరోగమనం నుంచి ఆర్థిక వ్యవస్థ దిశను మార్చడానికి ప్రభుత్వం వ్యయం పెంచడం ఒక పరిష్కార మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మాంద్యమా, మందగమనమా

ఫొటో సోర్స్, Pti

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏం చేయవచ్చు?

మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచే చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుంది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) థింక్-టాంక్ విడుదల చేసిన గణాంకాలను బట్టి భారత్‌లో నిరుద్యోగం రేటు 2019 సెప్టెంబర్- డిసెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం పెరిగింది.

ఇకపోతే, ఆర్థికవ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కార్పొరేట్ టాక్స్‌లో కోతలు విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారు.

కానీ జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయంతోపాటూ పన్ను వసూళ్లు ఇప్పటికే తగ్గాయి. దాంతో ఖర్చులు పెంచేందుకు ప్రభుత్వం చేతుల్లో తక్కువ మొత్తం ఉంది.

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గుతుందా?

ఈ బడ్జెట్లో ఆదాయ పన్ను తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"వ్యక్తిగత పన్నులో కోత విధిస్తే, దానివల్ల ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వస్తుంది. తద్వారా వారిలో ఖర్చుపెట్టే, పెట్టుబడులు పెట్టే ధోరణిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకే వ్యక్తిగత పన్నులో కోత మంచిదనే భావిస్తున్నారు.

"అతిపెద్ద, పెరుగుతున్న ఆర్థికవ్యవస్థలో ఆర్థిక పునరుద్ధరణ అనేది, రీటైల్ వినియోగం, కార్పొరేట్ మూలధన పెట్టుబడుల చర్య. దానికి ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాల్లో క్రెడిట్ ప్రవాహాలు అవసరం" అని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ కె.జోసెఫ్ థామస్ బీబీసీకి చెప్పారు.

ఆదాయ పన్ను శ్లాబ్స్ ఎలా ఉండాలనే అంశంపై లోకల్ సర్కిల్ అనే గణాంకాలు సేకరించే సంస్థ ఒక భారీ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 80 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం 69 శాతం మంది వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరుకున్నారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)