పౌరసత్వ సవరణ చట్టం: ఈ చట్టంతో భారతదేశంలో ఏ ఒక్కరూ పౌరసత్వం కోల్పోరు - అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వాన్ని పోగొట్టదని కేంద్ర హోం మంత్రి స్పష్టత ఇచ్చారు.
ఈ విషయంలో కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఝార్ఖండ్‌లోని పొరియాహాత్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రధాని సమాధానం చెప్పాలి: ప్రియాంకా వాధ్రా
‘‘జామియా యూనివర్సిటీలో ఆదివారం ఏం జరిగిందో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ఎవరికి ప్రభుత్వం విద్యార్థులను చితకబాదింది? మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మాట్లాడాలి.. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే దానిపై ప్రధాని ఎందుకు మాట్లాడరు?’’ అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాధ్రా ప్రశ్నించారంటూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ తదితర కాంగ్రెస్ నాయకులు ఇండియా గేట్ సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శాంతియుతంగా ఉండండి: ప్రధాని మోదీ
పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సోమవారం వరుస ట్వీట్లు చేశారు.
ఈ చట్టంపై హింసాత్మక ఆందోళనలు దురదృష్టకరమని, తీవ్ర విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది శాంతిని, ఐక్యతను, సోదరభావాన్ని పాటించాల్సిన తరుణమని, వదంతులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఏ మతానికి చెందిన ఏ భారతీయ పౌరుడిపైనా సీఏఏ ప్రభావం చూపదని, దీని గురించి భారతీయులెవ్వరూ ఆందోళన చెందవద్దని మోదీ చెప్పారు.
ఇది భారత్ వెలుపల ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొని, భారత్‌లో తప్ప మరెక్కడా ఆశ్రయం పొందలేకపోయిన వారి కోసం తెచ్చిన చట్టమని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PTI
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు మెట్రో సేవలపై ప్రభావం చూపిస్తున్నాయి.
పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) ట్విటర్లో తెలిపింది. మెట్రో రైళ్లు పటేల్ చౌక్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లలో ఆగవని చెప్పింది.
అనంతరం రాత్రి 7.30 ప్రాంతంలో అన్ని స్టేషన్లను ఎప్పటిలా ప్రయాణికుల రాకపోకలకు వీలు కల్పిస్తూ తెరిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆందోళనలకు కేంద్రమైన ప్రాంతంలోని 'జామియా మిలియా ఇస్లామియా' స్టేషన్ గేట్లను డీఎంఆర్‌సీ ఇంతకుముందే మూసివేసింది. అక్కడ రైళ్లను ఆపడం లేదని సంస్థ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఉన్న నడ్వా కళాశాలలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. నిరసనకారులను కళాశాల నుంచి బయటకురాకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. బలగాలు వర్సిటీ గేటు మూసేశారు.
సుమారు 150 మంది గుంపుతో కూడిన గుంపు నిరసన ప్రదర్శన చేస్తున్న సమయంలో ఒక 30 సెకన్లపాటు రాళ్లు రువ్వకం జరిగిందని లఖ్‌నవూ ఎస్పీ కలానిధి నైథానీ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందని, విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి వెళ్లారని నైథానీ చెప్పినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
జామియా యూనివర్సిటీలో ఆదివారం చోటుచేసుకున్న హింస గురించి తక్షణమే విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారిస్తామని తెలిపింది.
సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కోలిన్ గొంజాల్వేజ్ తక్షణ విచారణ జరపాలని సోమవారం ఉదయం కోర్టును అభ్యర్థించారు. విచారణ కోసం విశ్రాంత న్యాయమూర్తిని పంపాలని కోరారు.
‘‘ప్రజా సంపదకు నష్టం ఎందుకు జరిగింది? బస్సులు ఎందుకు తగలబడ్డాయి? ఈ విధ్వంసాన్ని ఎవరు మొదలుపెట్టారో, ముందుగా వారు ఆగాలి. విద్యార్థులైనంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కుదరదు. శాంతి పూర్వక పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఆ అంశంపై నిర్ణయం తీసుకోగలం. మొదట అక్కడ ఆందోళనలు ఆగాలి’’ అని భారత్ చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.

‘విద్యార్థుల వెంట మేమున్నాం’
జామియాలో జరిగిన పరిణామాలపై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నజ్మా అఖ్తర్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును ఆమె తప్పుపట్టారు.
‘‘విద్యార్థులకు జరిగింది చూసి చాలా బాధపడుతున్నా. పోలీసులు అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి, లైబ్రరీలోకి చొరబడ్డారు. ఏ తప్పూ చేయని విద్యార్థులను కొట్టడం గర్హనీయం. ఈ కష్టకాలంలో మీరు ఒంటరివారు కాదని మా విద్యార్థులకు నేను చెబుతున్నా. మీ వెంట నేనున్నా. మొత్తం వర్సిటీ ఉంది’’ అని నజ్మా ఓ వీడియోలో వ్యాఖ్యానించారు.
దిల్లీలో నిరసన సెగలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం దిల్లీలోని దిల్లీ-మధుర రహదారిలో కొన్ని బస్సులకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించాయి.
దిల్లీలోని ఓక్లా, జామియా, కాలింది కుంజ్ ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
జామియా యూనివర్సిటీలోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకు వచ్చి విద్యార్థులను కొట్టారని చీఫ్ ప్రోక్టర్ చెప్పారు. పోలీసుల చర్యపై యూనివర్సిటీ విద్యార్థులు దిల్లీలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. అరెస్ట్ చేసిన 50 మంది విద్యార్థులను ఆ తరువాత విడుదల చేశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాలింది కుంజ్ రోడ్డుపై నిరసనకు దిగారని ఏఎన్ఐ తెలిపింది. యూనివర్సిటీ పరిసరాల్లో స్థానిక ప్రజలు ఆందోళనలు నిర్వహించినప్పుడు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, విద్యార్థులు యూనివర్సిటీలో ప్రదర్శనలు చేసినప్పుడు ఎలాంటి ఘటనలు జరగలేదని యూనివర్సిటీ అధికారులు చెప్పినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.
జామియా వద్ద ఉన్న బీబీసీ ప్రతినిధి సాల్మన్ రవి, ఈ ఘటనల అనంతరం దిల్లీ పోలీసులు యూనివర్సిటీని దిగ్బంధం చేశారని చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
ఈ ఘటనల తర్వాత జామియా ప్రాంగణాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి తెలిపారు.
అనుమతి లేకుండా దిల్లీ పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించారని చీఫ్ ప్రొఫెసర్ వసీమ్ అహ్మద్ ఖాన్ ట్వీట్ చేశారు. తమ సిబ్బందిని, విద్యార్థులను కొట్టారని, క్యాంపస్ వదిలి వెళ్లాలని చెప్పారని ఆయన అన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2

ఫొటో సోర్స్, Ani
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
స్థానిక నేతలు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనవద్దని జామియా టీచర్స్ అసోసియేషన్ తన విద్యార్థులను కోరింది.
లైబ్రరీలో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకెళ్లామని, వారు సురక్షితంగా ఉన్నారని జామియా వీసీ నజ్మా అక్తర్ పీటీఐకి తెలిపారు. పోలీసు చర్యలను ఆయన ఖండించారు.

ఫొటో సోర్స్, Ani
ఓ మగ పోలీస్ తన మొబైల్ లాక్కొని, పగలగొట్టి, తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఘటనా స్థలంలో ఉన్న బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్ తెలిపారు.

దిల్లీ పోలీసులేమంటున్నారు?
"నిరసనల్లో పాల్గొన్నవాళ్లు చాలా ఆవేశంగా ఉన్నారు. పరిస్థితిని అదుపుచేయడానికి వారిని చెదరగొట్టాం. దీంతో వాళ్లంతా రాళ్లు రువ్వారు. ఆరుగురు పోలీసులు గాయపడ్డారు" అని సౌత్ఈస్ట్ దిల్లీ డీసీపీ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.
"జామియా విద్యార్థులతో మాకెలాంటి ఇబ్బందీ లేదు. కానీ, క్యాంపస్ లోపలి నుంచి కూడా మాపై రాళ్లు విసిరారు. ఆ పని చేసిన విద్యార్థులను గుర్తించాల్సిందిగా మేం యూనివర్సిటీ అధికారులను కోరతాం" అని బిస్వాల్ అన్నారు.

నిరసనకారులు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. వీటిలో నాలుగు డీటీసీ బస్సులు, రెండు పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
జామియా యూనివర్సిటీ, సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని హెచ్చరించారు.
ప్రత్యక్ష సాక్షులేమంటున్నారు?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. జామియా నగర్, భారత్ నగర్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, అపోలో హాస్పిటల్ ప్రాంతాల్లో ఈ నిరసనలు జరిగాయి.
దీనిలో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే బాట్లా హౌస్ పరిసర ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరారు. వారంతా శాంతియుతంగా నిరసన చేస్తున్నారు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రదర్శన చేసినా శాంతియుతంగా ఉండాలని శనివారమే ఓ విద్యార్థి సంఘం పిలువునిచ్చింది.
అయితే, ఈ ప్రదర్శన న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని కమ్యూనిటీ సెంటర్‌ను దాటుతుండగా, పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు.
దీంతో, విద్యార్థుల్లో కొందరు అక్కడే నేలపై కూర్చుని నిరసనకు దిగారు. వీరిలో ప్రస్తుత విద్యార్థులతో పాటు జామియా పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో వీరిలో కొంతమంది ఆశ్రమ్ వైపు వెళ్లడం ప్రారంభించారు.
కాసేపటికి, వీరంతా ఆశ్రమ్ రోడ్డును బ్లాక్ చేశారు. ఆ తర్వాత దిల్లీ, ఫరీదాబాద్ లను కలిపే మధురా రోడ్ కూడా బ్లాక్ అయింది.
దీంతో రోడ్డును క్లియర్ చెయ్యడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
దీనికి ప్రతిగా, ఆ సమూహం నుంచి రాళ్ల దాడి మొదలైంది. నినాదాలతో ఆ ప్రాంతం హోరెక్కింది.
గత రెండురోజులుగా పోలీసులు న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు.
స్కూళ్లకు సెలవు
ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- దక్షిణ కొరియా యువతకు తెగ నచ్చేసిన పెంగ్విన్
- మానవ చర్మాన్ని దిగుమతి చేసుకుంటున్న న్యూజీలాండ్
- ప్రపంచ నాయకులను కాల్చి పడేయాలని అనలేదు.. అలా అర్థమైతే క్షమించండి: గ్రెటా థన్‌బర్గ్
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
- 'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)