దక్షిణ కొరియా యువతకు తెగ నచ్చేసిన పెంగ్విన్

ఫొటో సోర్స్, PENGSOO/INSTAGRAM
దక్షిణ కొరియాలో ఇప్పుడు కొత్త పెంగ్విన్ ఒకటి ఆకట్టుకుంటోంది. భారీ సైజులో ఉన్న ఈ పెంగ్విన్ ఆడా కాదు, మగా కాదు. దాని గొంతు కరకుగా ఉంటుంది. కీర్తి కండూతి చాలా ఎక్కువ. దాని పేరు పెంగ్సూ. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా, ఇది నిజం పెంగ్విన్ కాదు. ఇదో మస్కట్.
నిజానికి చిన్నపిల్లలను ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ భారీ పెంగ్విన్ మస్కట్ ఇప్పుడు అనేక మంది మిలీనియల్స్‌నూ ఆకట్టుకుంటూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
2.1 మీటర్ల ఎత్తున్న ఈ పెంగ్విన్ కేవలం ఒక బొమ్మే అయినప్పటికీ దాన్ని 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
మాటకు మాట అప్పగించే పెంగ్విన్
పదేళ్ల వయసున్న ఈ మస్కట్ అంటార్కిటికా నుంచి దక్షిణ కొరియాకు వచ్చి స్టార్ అయిందని దీన్ని రూపొందించిన సంస్థ ఎడ్యుకేషన్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (ఈబీఎస్) తెలిపింది.
దక్షిణ కొరియాలో చిన్నారులు బాగా ఇష్టపడే గాగుల్స్ ధరించిన పాత్ర పొరోరోను అనుకరించడం ఈ పెంగ్విన్‌కు ఇష్టం. అంతేకాదు... పాపులర్ సౌత్ కొరియన్ బ్యాండ్ బీటీఎస్ కంటే ఎక్కువ పాపులర్ కావాలనుకుంటుంది ఇది.
''అవతలివారు ఎంత పెద్దవారైనా, చట్టసభ సభ్యుడైనా, కంపెనీ ప్రెసిడెంటయినా, గొప్ప సెలబ్రిటీ అయినా కూడా పెంగ్సూ వారిని ఒకేలా ట్రీట్ చేస్తుంది'' అని దాని అభిమాని అయిన 31 ఏళ్ల ఇంజినీర్ ఒకరు చెప్పారు.
పెంగ్సూ తనను తాను ''సూపర్ స్టార్''గా అభివర్ణించుకుంటుంది. బయటకు వినయంగా ఉండాలని భావించే దక్షిణ కొరియా సమాజానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
ఒక్కోసారి ఇది తనను సృష్టించిన ఈబీఎస్ కంపెనీ అధినేతనూ అనుకరిస్తుంది.

ఫొటో సోర్స్, PENGSOO/INSTAGRAM
ఈబీఎస్ ప్రొడ్యూసర్ లీ స్యూలినా 'బీబీసీ కొరియన్'తో మాట్లాడుతూ.. కుటుంబమంతా ఇష్టపడే ఒక పాత్రగా ఉనికిలోకి వచ్చి ఇప్పుడు పదేళ్ల వయసు పిల్లలకు అత్యంత ప్రియమైనదిగా మారిందని చెప్పారు.
'దీన్ని త్రీడీ క్యారక్టర్‌గా మార్చాలనుకుంటున్నాను'' అన్నారామె.
ఇరవై, ముప్ఫై ఏళ్ల వయసు వారి నుంచి ఆదరణ రావడంతో ఈ భారీ పెంగ్విన్ హిట్ అయింది. పెంగ్సూ, జెయింట్ పెంగ్ వంటివి ఉన్న ఈబీఎస్ యూట్యూబ్ చానల్‌కు 12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
టీవీ కార్యక్రమాలు, టాక్ షోల్లోనూ పెంగ్సూ అతిథిగా వ్యవహరిస్తుంటుంది.. అంతేకాదు, ఇది దక్షిణ కొరియా విదేశీ వ్యవహారాల మంత్రి కేంగ్ క్యుంగ్ వాను కూడా ఒకసారి కలుసుకుంది.
పెంగ్సూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే అవకాశం ఉందని కొరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎకనమిక్స్, ట్రేడ్ అంచనా వేస్తోంది.
కాబట్టి కొద్ది రోజుల తరువాత మీ ఊళ్లో మీకు ఎక్కడైరా భారీ పెంగ్సూ ఎదురుపడితే ఆశ్చర్యపోకండి.
ఇవి కూడా చదవండి:
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- 'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








