జాత్యహంకారి అంటూ గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ

ఫొటో సోర్స్, Emmanuel Dzivenu/JoyNews
భారత ‘జాతిపిత’ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఘనా దేశ రాజధాని అక్రా నగరంలోని ఘనా యూనివర్శిటీ తమ క్యాంపస్ నుంచి తొలగించింది.
2016లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, దీన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఘనా యూనివర్శిటీ అధ్యాపకులు ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, DANIEL OSEI TUFFUOR
గాంధీ 'జాత్యాహంకారి' అని, ఆఫ్రికా హీరోలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ వివాదం నేపథ్యంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలిస్తామని ఘనాలోని అప్పటి ప్రభుత్వం తెలిపింది.
యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని బుధవారం తొలగించినట్లు యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, RashtrapatiBhvn/Twitter
విగ్రహం తొలగించిన విషయాన్ని యూనివర్శిటీ కూడా ధృవీకరించింది. విదేశీ వ్యవహారాలు, ప్రాంతీయ సమన్వయ మంత్రిత్వ శాఖే దీనికి బాధ్యత వహించాలని తెలిపింది.
న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న యూనివర్విటీ విద్యార్థి నానా అడోమా అసారే అదీ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆయన విగ్రహం ఇక్కడ ఉందంటే.. ఆయన కట్టుబడిన అంశాలన్నింటికీ మేం కూడా కట్టుబడి ఉన్నట్లే. ఆయన జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆయన విగ్రహాన్ని క్యాంపస్‌లో ఉంచాలని నేను భావించట్లేదు'’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Emmanuel Dzivenu/JoyNews
ఇంతకీ గాంధీ ‘జాత్యాహంకారం’ ఏంటి?
తన అహింసా ఉద్యమంతో భారతదేశం నుంచి బ్రిటిష్ వలస పాలనను వెళ్లగొట్టిన భారత స్వాతంత్ర్య పోరాట నాయకులు గాంధీ 20వ శతాబ్ధపు ప్రముఖుల్లో ఒకరు.
అయితే, యువకుడిగా ఉన్నప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో నివశించారు. అక్కడ న్యాయవాదిగా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తి నింపిన గాంధీ.. తన యవ్వనంలో నల్లజాతి ఆఫ్రికన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
నల్లజాతి దక్షిణాఫ్రికా వారిని 'కఫీర్లు' (దక్షిణాఫ్రికాలో నివశించే ఒక తెగ - అత్యంత తీవ్రమైన జాత్యాహంకార వ్యాఖ్య) అని సంబోధిస్తూ యువకుడైన గాంధీ తన రచనల్లో పేర్కొన్నారు. అలాగే.. నల్లజాతి ప్రజల కంటే భారతీయులు 'ఎంతో ఉన్నతమైన' వాళ్లు అని కూడా గాంధీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








