అయోధ్య రామమందిర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం - పార్లమెంటులో మోదీ ప్రకటన

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఆదేశానుసారం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభలో చెప్పారు.
అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రామ మందిరం ట్రస్టు ఏర్పాటు కోసం మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు ఫిబ్రవరికి ముగియబోతోంది.
"ఈరోజు ఉదయం కేంద్ర మంత్రిమండలి సమావేశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం శ్రీరామ జన్మభూమిపై శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం, దానికి సంబంధించిన ఇతర విషయాల కోసం మా ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది" అని ప్రధానమంత్రి పార్లమెంటులో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించాం. ఈ ట్రస్ట్ అయోధ్యలో భగవాన్ శ్రీరామ జన్మభూమిలో భవ్య, దివ్య శ్రీరామ మందిర నిర్మాణం, దానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోడానికి పూర్తి స్వతంత్రతో వ్యవహరిస్తుంది" అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లోతుగా చర్చించిన తర్వాత, అయోధ్యలో ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలియజేసింది.

ఫొటో సోర్స్, Reuters
15 మంది ట్రస్టీలు
ప్రధానమంత్రి ప్రకటన తర్వాత మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా "శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారు. అందులో దళిత సమాజానికి చెందిన ఒక ట్రస్టీ కూడా ఉంటారు. సామాజిక సామరస్యం పెంచేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతున్నాను" అన్నారు.
భారతీయుల జీవితాల్లో, భారత ఆదర్శాలలో, భారత మర్యాదల్లో భగవాన్ శ్రీరాముడికి, అయోధ్య చారిత్రకతకు, అయోధ్య ధామ్ పవిత్రతకు ఉన్న ప్రాధాన్యం గురించి మనందరికీ తెలుసు అని ఆయన అన్నారు.
"ప్రస్తుతం, భవిష్యత్తులో రామ్‌లల్లా దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య, వారి భావనలను దృష్టిలో పెట్టుకుని అయోధ్యలో భగవాన్ శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్య యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న దాదాపు 67.703 ఎకరాల మొత్తం భూమిని (ఇందులో లోపలి భాగం, ప్రాంగణం కూడా ఉన్నాయి) ఈ భూమిని కొత్తగా ఏర్పాటు చేసిన 'శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్'కు బదిలీ చేస్తాం" అని ప్రధాని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. "పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 11న ముగియబోతున్నాయి. ప్రభుత్వం దీనిని ఫిబ్రవరి 8 తర్వాత ప్రకటించి ఉండచ్చు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రకటన చేశారు" అని అసదుద్దీన్ ఆరోపించారు.
ఒకప్పుడు మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"సుప్రీంకోర్టు రామమందిరం నిర్మించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును గౌరవించడం ప్రభుత్వ కర్తవ్యం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు తీర్పు
జస్టిస్ రంజన్ గోగోయ్ అధ్యక్షతన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల విచారణ తర్వాత గత ఏడాది నవంబర్‌లో అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించింది.
ఈ తీర్పులో వివాదాస్పద స్థలంలో పూజలకు అనుమతించి, మసీదు కోసం ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలనే ఆదేశంతో మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
సుప్రీంకోర్టు తన తీర్పులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అనువైన ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది.
సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇచ్చే భూమి 1993 అయోధ్య యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూమిలో భాగం కావచ్చు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో అనువైన భూభాగాన్ని ఎంపిక చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

ఇవి కూడా చదవండి:
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు
- ‘జన్‌ధన్ ఖాతాలో ఉన్నట్లుండి రూ.30 కోట్లు వచ్చిపడ్డాయ్.. ఎవరు వేశారో తెలియదు’
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









