భారత జీడీపీ మందగమన ప్రభావం ప్రపంచంపైనా ఉంటుంది: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గోతా గోపీనాథ్

గీతా గోపీనాథ్

ఫొటో సోర్స్, gitagopinath/twitter

ఫొటో క్యాప్షన్, గీతా గోపీనాథ్

భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తగ్గించింది.

2019-20లో వృద్ధి రేటు 5 శాతం కన్నా తక్కువ ఉండొచ్చని, 2020-21 వృద్ధి రేటు 5.8 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

మరోవైపు ఐరాస కూడా భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 5.7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

ఇవన్నీ చూస్తుంటే భారత ఆర్థికవ్యవస్థ గాడిలో లేదని అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వం ప్రకటనలు ఎలా ఉన్నా, జీడీపీ వృద్ధి రేటు తగ్గుతూ పోతోంది.

భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు బ్యాంకింగేతర రంగాల్లోని సమస్యలు, డిమాండ్ కొరత కారణంగా ఆర్థిక మందగమనంలో ఉన్నాయని... దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది.

ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2019లో 2.9 శాతం, 2020లో 3.3 శాతం, 2021లో 3.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

భారత వృద్ధి రేటు 2019లో 4.8 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో ఈ అంచనాను 1.3 శాతం మేర తగ్గించింది.

Presentational grey line
News image
Presentational grey line

2020, 2021ల్లో భారత వృద్ధి రేటు వరుసగా 5.8 శాతం, 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

2019లో భారత వృద్ధి రేటును ఐఎంఎఫ్ తగ్గించడానికి బ్యాకింగేతర ఆర్థిక రంగాలు, గ్రామాల్లో ఆదాయ వృద్ధి తగ్గడం ప్రధాన కారణాలు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

క్రెడిట్ గ్రోత్ తగ్గడం అంటే జనాలు అప్పులు తక్కువ తీసుకుంటుండటం పట్ల కూడా ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా క్రెడిట్ గ్రోత్ తగ్గిపోవడానికి జనాల ఆదాయం తగ్గడం కారణం కావొచ్చు.

ఎన్డీటీవీ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని.. చిలీ, హాంకాంగ్‌లు ఇందుకు ఉదాహరణలని ఆమె అన్నారు.

భారత్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలకు సంబంధించి తాజా నివేదికల్లో ఏమీ ప్రస్తావించలేదని... కానీ, ఇలాంటి ఆందోళనల ప్రభావం ఆర్థికవ్యవస్థపై ఉంటుందని మాత్రం తాను చెప్పగలనని ఆమె అన్నారు.

మోదీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. విపక్ష పార్టీలు ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపిస్తున్నాయి. విపక్షాలు కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తూ, అనవసరంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని మోదీ ప్రభుత్వం అంటోంది.

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్ పోషించే పాత్ర చాలా పెద్దదని గీతా గోపీనాథ్ అన్నారు. భారత జీడీపీ వృద్ధిరేటు పతనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతోందని ఆమె చెప్పారు.

ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించిన తర్వాత మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీయడం ప్రారంభించాయి.

ఐఎంఎఫ్ అంచనా ఓ రియాల్టీ చెక్ లాంటిదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ట్వీట్ చేశారు. భారత వృద్ధి రేటు ఆ సంస్థ చెప్పినదానికన్నా తగ్గినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నోట్ల రద్దును మొదటగా తప్పుపట్టిన ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ కూడా ఒకరన్న విషయాన్ని చిదంబరం గుర్తు చేశారు.

''ఐఎంఎఫ్‌పై, గీతా గోపీనాథ్‌పై ఇక మన మంత్రులు దాడి చేస్తారు. మనం దానికి సిద్ధంగా ఉండాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

మోదీ-అమిత్ షా ద్వయం భారత్‌ను బలహీనపరిచిందని కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు, మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు.

''ఐఎంఎఫ్ 2019-20కి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 4.8 శాతానికి తగ్గించింది. దీని వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా దిగజారుతుందని అంటోంది. దేశవ్యాప్తంగా యవత, వృద్ధులు... అందరూ భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు (వేసుకున్న దుస్తులను బట్టి వారెవరో గుర్తించలేం)'' అని వ్యాఖ్యానించారు.

గీతా గోపీనాథ్

ఫొటో సోర్స్, gitagopinath/twitter

గీతా గోపీనాథ్ ఎవరంటే..

గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా పనిచేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మైక్రోఎకనామిక్స్‌ల్లో పరిశోధనలు చేశారు.

2017లో రళ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఆమెను నియమించుకుంది.

భారత్‌లో పుట్టిన ఆమె.. గ్రాడ్యుయేషన్ వరకూ ఇక్కడే చదువుకున్నారు. దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో ఎకనామిక్స్‌లో హానర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత 1994లో వాషింగ్టన్ యూనివర్సిటీలో చేరారు.

1996 నుంచి 2001 వరకూ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.

పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విధానాలు, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల సమస్యల వంటి అంశాలపై 40కుపైగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

2001 నుంచి 2005 వరకూ షికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో 2005 నుంచి 2015 వరకు అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా, ఆ తర్వాత ప్రొఫెసర్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)