జర్మనీ: తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడికి జైలు

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీలో ఒక ఐటీ ఉద్యోగి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తాడు. నొప్పి నుంచి ఉపశమనానికి సంబంధించి తానో శాస్త్రీయ ప్రయోగం చేస్తున్నానని, ఇందులో భాగంగా కరెంటుతో షాక్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మహిళలను, బాలికలను ఒప్పించాడు. తను చెప్పినట్లు చేసి వాళ్లు విద్యుదాఘాతంతో బాధపడుతుంటే, అతడు చూసి ఆస్వాదించాడు.
ఈ నేరాన్ని లైంగిక ఆనందం కోసం చేశాడని అధికారులు తెలిపారు.
అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష పడింది.
నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ప్రయోగం పేరుతో బాధితులను నమ్మించి అతడు ఈ నేరానికి పాల్పడ్డట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇలా చేస్తే వారికి డబ్బులు ఇస్తానన్నాడని చెప్పారు.
బవేరియా ప్రాంతంలోని వుర్జ్‌బర్గ్ నగరానికి చెందిన అతడి వయసు 30 ఏళ్లు. పేరు డేవిడ్.జి. అని అధికారులు చెప్పారు.
బాధితులు తమ ఇళ్లలోని లోహపు వస్తువులను విద్యుత్ వ్యవస్థలకు అనుసంధానించి తమను తాము విద్యుదాఘాతానికి గురిచేసుకొంటుంటే డేవిడ్ 'స్కైప్'లో చూసి సంతోషపడేవాడని, ఇదంతా రికార్డు చేసుకొనేవాడని తెలిపారు.
మ్యూనిక్ నగరంలోని న్యాయస్థానం 13 హత్యాయత్నాల్లో డేవిడ్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించింది.
డేవిడ్ నకిలీ వైద్యుడి అవతారమెత్తి, తను చేపట్టే ఒక నకిలీ శాస్త్రీయ అధ్యయనంలో పాల్గొనేందుకు అమ్మాయిల కోసం ఆన్‌లైన్లో వెతికాడని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తర్వాత బాధిత మహిళలను సంప్రదించి, తన 'అధ్యయనం'లో పాల్గొంటే మూడు వేల యూరోలు ఇస్తానని ప్రతిపాదించాడని చెప్పారు.
13 ఏళ్ల బాలిక బాధితుల్లో అందరికన్నా చిన్న వయస్కురాలని వారు తెలిపారు.
లోహపు వస్తువులను కణతలకు దగ్గరగా పెట్టుకొని షాక్ తీసుకోవాలని బాధితులకు డేవిడ్ చెప్పేవాడని, దీనివల్ల వాళ్ల మెదడు విద్యుదాఘాతానికి గురయ్యేదని న్యాయమూర్తి థామస్ బాట్‌ను ఉటంకిస్తూ జర్మనీకి చెందిన డ్యూచె వెలే పత్రిక రాసింది.
ఇవి కూడా చదవండి:
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- అమరావతి-ఆంధ్రప్రదేశ్: దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- ఫేస్‌బుక్‌కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- ఈ 5 విషయాలు మీ సోషల్ మీడియా ఖాతాల్లో ఉండకూడదు.. ఉంటే ప్రమాదమే
- ఆండ్రాయిడ్‌లో 'స్పూఫింగ్' బగ్.. బ్యాంకు ఖాతాల మీద సైబర్ దొంగల దాడి
- డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ఎవరెస్టు సహా హిమాలయాలపై పెరుగుతున్న మొక్కలు.. మంచు తగ్గడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
- గాలి నుంచి ప్రొటీన్ తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- వాట్సాప్ హ్యాకింగ్ వార్తలపై ఇజ్రాయెల్ కంపెనీ ఏమంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








