బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బొంబాయి అంటే ఈనాటి ముంబయి. ఇక్కడ 1966లో శివసేన ఉనికిలోకి వచ్చింది. బాల్ ఠాక్రే ఈ పార్టీని స్థాపించారు. మహారాష్ట్రలో యువత ప్రయోజనాలను రక్షించడం చాలా ముఖ్యం అని ఆయన అప్పుడు చెప్పారు.
2019కి ముందు అంటే ఉద్ధవ్ ఠాక్రేకు ముందు ఠాక్రే కుటుంబంలోని ఏ సభ్యుడూ ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదు.
అయితే శివసేన పార్టీ నుంచి ఇద్దరు కచ్చితంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వారే మనోహర్ జోషి, నారాయణ్ రాణే. కానీ ఠాక్రే కుటుంబంలోని ఏ వ్యక్తీ మంత్రులు కావడం, ఏదైనా ప్రభుత్వ పదవుల్లో ఉండడం ఎప్పుడూ జరగలేదు.
50 ఏళ్లకు పైగా పురాతనమైన ఈ పార్టీకి నేతృత్వం వహించిన ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మొట్ట మొదటి వ్యక్తి ఆదిత్య ఠాక్రే.
ఇప్పుడు అదే ఠాక్రే కుటుంబం నుంచి మహారాష్ట్ర మఖ్యమంత్రి అయిన మొదటి సభ్యుడు ఉద్ధవ్ ఠాక్రే.
శివాజీ పార్కులో ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అదే శివాజీ పార్కును బాల్ ఠాక్రే తన 'కర్మభూమి'గా చెబుతుండేవారు.
అలాంటప్పుడు, ఠాక్రే కుటుంబం అధికారానికి ఇప్పటివరకూ దూరంగా ఎందుకు ఉంటూ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది.
బాల్ ఠాక్రే ఎప్పుడూ అధికారానికి బయటే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ శైలి భిన్నంగా ఉండేది. కానీ, అధికారం బయట ఉన్నప్పటికీ, ఆయన పవర్ సెంటర్‌గా ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
"మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే ఏది చెబితే, అదే జరిగేది. అధికారంలో కూర్చున్న వ్యక్తి బాల్ ఠాక్రే మాట వినకపోయినా, ఆయన అభిమానులు చాలా మంది తమదైన పద్ధతిలో ఆ నేత మాట వినేలా చేసేవారు. అందుకే, బాల్ ఠాక్రే ఎప్పుడూ అధికారంలోకి రాలేదు" అని సమర్ ఖడస్ చెప్పారు.
కానీ సీనియర్ జర్నలిస్ట్ సుజాతా ఆనందన్ మాత్రం, ఠాక్రే కుటుంబం అధికారానికి దూరంగా ఉండడానికి కారణం, వారు దానిని చేజిక్కించుకోలేకపోవడమే అంటారు.
"వాళ్లు ఎక్కువగా కార్పొరేషన్ పీఠాన్ని గెలిచారు. కానీ అక్కడ ఒకసారి అధికారం చేతిలోకి రాగానే, పవర్ అంటే ఏంటో వారికి అర్థమైంది. అందుకే వారు ఇప్పటివరకూ 'బృహన్ ముంబై'ని తమ చేతుల్లోంచి వెళ్లనీయలేదు" అంటారు సుజాత
"అసెంబ్లీలో అడుగుపెట్టడానికే ఠాక్రే కుటుంబం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు ఆ పార్టీలో ప్రభుత్వంలో భాగం అయ్యేంత ఎక్కువమంది అభ్యర్థులు ఉండేవారే కాదు".
"90వ దశకం తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. హిందుత్వవాద ప్రభుత్వాలు రావడం మొదలైంది. వారితోపాటు పొత్తు పెట్టుకుని శివసేన అధికారానికి దగ్గరగా వచ్చింది."
"50 ఏళ్ల పురాతన పార్టీ 1967లో ఎలా పని చేసేదో, 2019లో కూడా అలాగే పనిచేయలేదు. ఎందుకంటే పనితీరు మారింది. మొత్తం రాజకీయాలే మారిపోయాయి. అందుకే ఠాక్రే కుటుంబం నుంచి ఉద్ధవ్ ఠాక్రే అధికారం చేజిక్కించుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి నేతగా ఆవిర్భవించారు" అని సుజాత చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారం రిమోట్ కంట్రోల్
1995లో మొదటిసారి వారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినపుడు మనోహర్ జోషి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు బాల్ ఠాక్రే "ఈ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ నా చేతుల్లో ఉంటుందని" చెప్పారు.
బాల్ ఠాక్రే ‘నేను ఎలా కావాలనుకుంటే, అలా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాను’ అనేవారు. ఆయన కాస్త అలాగే చేశారు. ఎన్రాన్ అనే ఒక వివాదాస్పద పవర్ కంపెనీ ఉండేది. అది ముఖ్యమంత్రి మనోహర్ జోషితో మాట్లాడకుండా మాతోశ్రీలో కూర్చుని ఠాక్రేతో మాట్లాడి కాంట్రాక్టులు తెచ్చుకునేది. అలా రిమోట్ కంట్రోల్ బాల్ ఠాక్రే దగ్గరే ఉండేది. మనోహర్ జోషితో మాట్లాడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసింది" అని సుజాతా ఆనందన్ చెప్పారు.
బాల్ ఠాక్రే కాలంలో శివసేన ఒక 'గూండా పార్టీ'గా ఉండేదని ఆమె చెప్పారు.
"ఆ సమయంలో ముంబయి, థాణేలో శివసేన హవా నడిచేది. దాంతో బాల్ ఠాక్రేకు అధికారం అవసరమే లేకుండా పోయింది. ఆయన తన పనులన్నిటినీ ముఖ్యమంత్రులతో చేయించేవారు, బలవంతంగా చేయించేవారు" అని సుజాత చెప్పారు.
"కానీ గత 10-12 ఏళ్లుగా ఉద్ధవ్ ఠాక్రే చేతికి శివసేన పగ్గాలు వచ్చినప్పటి నుంచి ఉద్ధవ్ పార్టీని మెయిన్‌స్ట్రీమ్ చేయడానికి ప్రయత్నించారు".
"ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి ఉన్న 'గూండా' ఇమేజ్‌ను మార్చారు. ఒక విధంగా మంచి పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు ఆయన అధికారం చేజిక్కించుకోడానికి అవసరమైన అన్ని పద్ధతులూ పాటించాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడం, అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్లడం అంతా ఆయనకు అవసరమైంది".

ఫొటో సోర్స్, Getty Images
మెయిన్ స్ట్రీం పార్టీ
"ప్రజలు బాల్ ఠాక్రేను ఎంత అభిమానించేవారో, ఆయనంటే అంత భయపడేవారు కూడా. కానీ ఉద్ధవ్ దగ్గర అలాంటిదేం లేదు. అందుకే, ఉద్ధవ్ ఠాక్రే దగ్గర వేరే నేతల రిమోట్ కంట్రోల్ ఏదీ లేదు. ముఖ్యమంత్రి కావడం, రాష్ట్ర రాజకీయాలను తన ఇష్ట ప్రకారం నడిపించడం అనే అవసరం ఆయనకు రావడానికి కారణం ఇదే" అని సుజాత చెప్పారు.
"రాజకీయాలు అనేవి క్షణ క్షణం మారుతూ ఉంటాయి. ఈరోజు రాజకీయాలకు సరిపోయే వాటినే ఉద్ధవ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాల్ ఠాక్రే కారు. ఆయన తర్వాత రాజకీయాలు చాలా మారిపోయాయి. అందుకే ఉద్ధవ్ ఠాక్రే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు" అని సమర్ ఖడస్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు అధికారం నేరుగా ఠాక్రే కుటుంబం చేతుల్లోకే వచ్చింది. ఆయన ఎలా పనిచేస్తారు?
"ఇది వేచిచూడాల్సిన విషయం. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం సరిగా నడుపుతారా, లేదా అనేదే అందరూ చూస్తున్నారు. కానీ మనోహర్ జోషి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేంద్ర ఫడణవీస్ కూడా మొదటిసారి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. వయసులో ఆయన ఉద్ధవ్ ఠాక్రే కంటే చిన్నవారు కూడా" అంటారు సుజాతా ఆనందన్.
"ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మొదటిసారి అధికారం అందుకోవాల్సి వస్తుంది. ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూడాల్సుంటుంది. కొంతమంది ప్రభుత్వాన్ని నడిపిస్తే, కొందరు సరిగా నడిపించలేదు. కాలం గడిచేకొద్దీ ఆయన ప్రభుత్వం నడపగలరా, లేదా అనేది తేలుతుంది" అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శరద్ పవార్ పాత్ర కూడా చాలా కీలకం కాబోతోంది. సుజాతా ఆనందన్ ప్రకారం శరద్ పవార్ ఇప్పుడు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తారు. అంటే వెనక సీటులో కూర్చుని కారు నడిపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ క్రౌన్డ్ కింగ్
"ఈ ప్రభుత్వంలో ఎన్సీపీ పాత్ర చాలా కీలకం అయ్యింది. ఉద్ధవ్ ఠాక్రే దగ్గర అనుభవం లేదు. ఆయన బ్యూరోక్రాట్స్‌పై ఆధారపడతారు. ఆయన గత ప్రభుత్వాల్లో అనుభవం ఉన్న మంత్రులపై కూడా కాస్త ఆధారపడవచ్చు. కానీ అందరికంటే ఎక్కువగా ఎన్సీపీ పైనే ఆధారపడతారు. అందుకే మొత్తం అధికారం ఇప్పుడు శరద్ పవార్ చేతుల్లోకి వచ్చేసిందని చెప్పవచ్చు".
"మనం ఇన్నేళ్ల నుంచీ శరద్ పవార్‌ను మహారాష్ట్ర అన్ క్రౌన్డ్ కింగ్ అంటూ వచ్చాం. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో లేకపోయినా, మొత్తం అధికారం శరద్ పవార్ చేతుల్లోనే ఉండే అదే స్థితి మళ్లీ వచ్చింది" అంటారు సుజాత.
కానీ సమర్ ఖడస్ మాత్రం శరద్ పవార్ అలాంటి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడపడం లాంటి రాజకీయాలే చేయరని చెబుతున్నారు.
"శరద్ పవార్ రాజకీయ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తి నమ్మకంతో ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుంచి అందుకు ఒప్పుకోలేదు. కానీ శరద్ పవార్ ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే, కళ్లెం మీరే అందుకోవాలని ఆయనకు నచ్చజెప్పారు. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఒప్పుకున్నారు. అందుకే, నాకు తెలిసి శరద్ పవార్ రిమోట్ కంట్రోల్ రాజకీయాలు చేయరనిపిస్తోంది. ఆయన ఒక దిశను నిర్ణయిస్తారు. నగరాల అభివృద్ధి ఎలా ఉండాలి, కార్మికులకు ఏం ఇవ్వాలి, కార్పొరేట్ సెక్టార్ కోసం ఏం చేయాలి అని ఒక ప్రోగ్రాం నిర్ణయిస్తారు" అంటారు ఖడస్.
ఇవి కూడా చదవండి.
- మహారాష్ట్ర: శరద్ పవార్‌ది అంతా అనుకుంటున్నట్లు ‘స్క్రిప్టెడ్ డ్రామా’నా?
- దేవేంద్ర ఫడణవీస్ ముళ్ల సింహాసనంపై కూర్చోబోతున్నారా?
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం: ఉద్ధవ్ ఠాక్రే: రాజ్ ఠాక్రేను కాదని బాల్ ఠాక్రే వారసుడిగా ఎలా ఎదిగారు...
- దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు
- రాజకీయ చదరంగంలో అమిత్ షాపై శరద్ పవార్ ఎలా గెలిచారు.. అసలు చాణక్యుడు ఎవరు?
- శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఇప్పుడు ఏమవుతాయి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
- ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఆ సబ్బులతో మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతాయా
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








