భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ.. నికోలస్‌ను తప్పుబట్టిన పద్మాలక్ష్మి

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆహారం 'ఘోరం'గా ఉందంటూ ఒక అమెరికా ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఇతర సంస్కృతుల పట్ల గౌరవం, ఆహారం విషయంలో జాత్యహంకారంపై వాడివేడి చర్చకు తెర లేపింది.
"భారత ఆహారం ఘోరంగా ఉంటుంది. కానీ అలా ఉండదన్నట్టు మనం నటిస్తాం" అని రోడ్ ఐలాండ్‌లోని అమెరికా నౌకాయుద్ధ కళాశాలలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టిమ్ నికోలస్ వ్యాఖ్యానించారు.
ఆహారంపై వివాదాస్పద అభిప్రాయాలు పంచుకోండంటూ ట్విటర్లో మరో యూజర్ అడిగిన తర్వాత ఆయన ఈ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అనుచిత రీతిలో సాధారణీకరించి మాట్లాడుతున్నారని నికోలస్‌పై విమర్శలు వచ్చాయి.
ఆహారం విషయంలో అమెరికాకు వలసవచ్చిన వారి అనుభవాలు, ఎంత మంది జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నారు లాంటి అంశాలు చర్చలోకి వచ్చాయి.
అసలు మీకు టేస్ట్ బడ్స్ ఉన్నాయా అని నికోలస్‌ను ప్రఖ్యాత చెఫ్ పద్మా లక్ష్మి ప్రశ్నించారు.

"టిమ్! మిమ్మల్ని ఒక చోటకు తీసుకెళ్తాను. మనం దేశాన్ని ఏకం చేయాల్సిన అవసరముంది" అని న్యూయార్క్‌కు చెందిన మాజీ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరానా ట్విటర్లో 'బటర్‌చికెన్‌సమిట్' అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి రాశారు.
భారత్ ఎంతో వైవిధ్యమున్న దేశమని, భారత వంటకాల్లో ఒక్క శాతంలోపు వంటకాలే టిమ్ రుచి చూసి ఉండొచ్చని ఇతర యూజర్లు వ్యాఖ్యానించారు.
నికోలస్! భారత్‌లో మీరు ఎక్కడ తిన్నారు, భారత ఆహారం వంద కోట్ల మందికి నచ్చుతుందని, వాళ్లందరి అభిరుచి తప్పయితే కాదని శివ వైద్యనాథన్ అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అమెరికా, బ్రిటన్లలోని భారత రెస్టారంట్లలో మాత్రమే తాను తిన్నానని నికోలస్ తర్వాత తెలిపారు.
అమెరికాలో అంతర్జాతీయ ఆహారాన్ని చాలాసార్లు చౌక ఆహారంగా విక్రయిస్తుంటారని కొందరు యూజర్లు ప్రస్తావించారు. 'అమెరికనైజ్' చేసిన ఈ ఆహారాన్ని చాలా మంది తింటారని, అయితే ఇందులో ఆయా దేశాలవారి వంటకాల్లో వాడే సిసలైన పదార్థాలన్నీ ఉండవని చెప్పారు.
ఇదే ఆహారాన్ని కొన్నిసార్లు 'ఎథ్‌నిక్ ఫుడ్' అని కూడా పిలుస్తుంటారు.
భారతీయ ఆహారమంటూ ఏదీ లేదని, కర్రీ అనే వంటకం కూడా లేదని, చాయ్ (టీ) కూడా లేదని ఓ మహిళా యూజర్ వ్యాఖ్యానించారు.
మైనారిటీలపై జాత్యహంకార వ్యాఖ్యల్లో వాసన, రుచి అనే అంశాలు ఎంత కాలంగా ఉన్నాయో కొందరు యూజర్లు ప్రస్తావించారు. ఇతరుల ఆహారం పట్ల అసహనంతో వ్యవహరిస్తున్నారని నికోలస్‌పై ఆరోపణలు చేశారు.
భారతీయుల వద్ద అసహజమైన వాసన వస్తుంటుందని, వారి ఆహారం అసహజంగా ఉంటుందని, భారతీయులు బహిరంగ మలవిసర్జన చేస్తారని, అందుకే భారతీయులకు సంబంధించినవన్నీ చిత్రమైన వాసన వస్తుంటాయని శ్వేతజాతీయులు తనతో అంటుంటారని తొలితరం భారతీయ అమెరికన్ సైరా రావ్ ట్విటర్లో తప్పుబట్టారు. ఇవన్నీ విన్న తనకు భారత ఆహారాన్ని శ్వేతజాతీయులు కించపరిస్తే ఆగ్రహం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
నికోలస్ వ్యాఖ్యల వివాదంపై భారత మీడియాలో వార్తాకథనాలు రాగా, ఆయన వ్యాఖ్యలకు ప్రతిగా 'మైఫేవరెట్ఇండియన్‌ఫుడ్' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవడం మొదలైంది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి సెనేటర్ కమలా హారిస్- కమెడియన్ మిండీ కలింగ్, తాను ఉన్న ఒక వంట వీడియో టీజర్‌ను ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నికోలస్‌పై విమర్శల దాడిని కొందరు ఆహార ప్రేమికులు కొట్టిపారేశారు.
చైనీస్ ఆహారం నిరాసక్తికరంగా ఉంటుందని, ఉప్పు ఎక్కువగా వేస్తారని, గుర్తుంచుకోవాల్సిన విధంగా ఉండదంటూ ఏబీసీ సీనియర్ రిపోర్టర్ టెర్రీ మొరాన్ చేసిన మరో ట్వీట్‌పైనా విమర్శలు వచ్చాయి.

బావిలో కప్పలాంటి ఈ శ్వేతజాతీయుడికి అసంఖ్యాక ప్రాంతీయ వెరైటీ వంటకాల గురించి తెలియదని ఓ యూజర్ విమర్శించారు.
చైనా సిసలైన వంటకాలను టెర్రీ మొరాన్ ఎన్నడూ రుచి చూసినట్టు లేరని, టేకౌట్ రెస్టారంట్లలో మాత్రమే తిన్నట్టు ఉన్నారని ఆసియా ఆహార ప్రేమికులు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణమేంటో తెలుసా...
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
- బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ ఉండే కుబేరుల నగరానికి ఆర్థిక కష్టాలు
- మహారాష్ట్ర: ఏ పార్టీ ఏం ఆశిస్తోంది... గతంలో ఇలాంటి సందర్భాలలో కోర్టు ఏం చెప్పింది?
- BHU: మతానికి, భాషకు సంబంధం ఉందా.. సంస్కృతం బోధించే ప్రొఫెసర్ హిందువే కావాలన్న డిమాండ్ కరెక్టేనా?
- టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ: 'డిపోల వద్ద శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు' - ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
- పీఎస్ కృష్ణన్: ఉద్యోగాన్ని సామాజిక ఉద్యమంలా చేసిన బడుగు వర్గాల బాంధవుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








