మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?

ఫొటో సోర్స్, AFP / Angelika OSIEWALSKA
మెక్ డోనల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ ఐస్‌ల్యాండ్‌లోని తమ రెస్టారెంట్లన్నింటినీ 2009లో మూసేసింది.
అప్పుడు జెర్టర్ స్మారసన్ అనే ఒకాయన మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లి వాళ్లు అమ్మిన ఆఖరి బర్గర్‌ను, దానితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను కొన్నారు.
మెక్ డోనల్డ్స్ ఆహార పదార్థాలు ఎన్ని రోజులు గడిచినా పాడైపోవని ప్రచారంలో ఉంది. దాన్ని పరీక్షించేందుకే తాను అది కొన్నానని స్మారసన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
ఈ వారంతో ఆ బర్గర్‌కు పదేళ్లు నిండాయి. అది ఇంకా నిక్షేపంగా ఉంది.
దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని స్నోట్రా హౌస్ అనే హోటల్‌లో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. అద్దాల పెట్టెలో భద్రపరిచిన దీన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైనా చూడొచ్చు.
ఈ బర్గర్‌ను చూసేందుకు వివిధ దేశాల నుంచి ఔత్సాహికులు వస్తున్నారని, తమ హోటల్ వెబ్‌సైట్‌ను రోజూ 4 లక్షల మంది సందర్శిస్తున్నారని స్నోట్రా హౌజ్ యజమాని సిగ్గి సిగర్డర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP / Angelika OSIEWALSKA
ఈ పదేళ్లలో ఈ బర్గర్ చాలా చోట్లు మారింది.
మొదట ఈ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను స్మారసన్ ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి కొన్నాళ్లపాటు తన గ్యారేజ్‌లో పెట్టారు.
మూడేళ్లైనా అది అలాగే చెక్కు చెదరకుండా ఉంది. దీంతో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఐస్‌ల్యాండ్‌కు దాన్ని ఆయన ఇచ్చారు.
అయితే, ఆహార పదార్థాలను భద్రపరిచే సామగ్రి తమ వద్ద లేదంటూ ఆ మ్యూజియం అధికారులు దాన్ని స్మారసన్‌కు తిరిగి ఇచ్చేశారు.
‘‘వాళ్లు పొరపాటు చేశారు. బర్గర్ దాన్నదే రక్షించుకుంటుంది’’ అని స్మారసన్ అన్నారు.
ఆ తర్వాత కొంతకాలం రెయిక్జవిక్‌లోని ఓ హోటల్‌లో ఆ బర్గర్ ఉంది. అనంతరం స్నోట్రా హౌజ్‌కు చేరింది.
సోషల్ మీడియాలో ఈ బర్గర్ ఫొటోలపై చర్చ జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘మా స్కూల్‌లో హెల్త్ టీచర్ ఇలాగే బర్గర్‌ను ఓ షెల్ఫ్‌లో పెట్టి వదిలేశారు. ఇన్నేళ్లు గడిచినా బూజు పట్టకపోవడానికి ఆ బర్గర్‌లో కనీసం బూజు పెరిగేందుకు అవసరమైన పోషకాలు కూడా లేవని ఆయన చెప్పారు’’ అని ట్విటర్‌లో ఓ మహిళ చెప్పారు.
అయితే, మెక్ డోనల్డ్స్ ఆహార పదార్థాలతో ఇలాంటి ప్రయోగాలు ఇంతకుముందూ జరిగాయి.

ఫొటో సోర్స్, Snotra hostel
1996లో తాను కొన్న బర్గర్ 14 ఏళ్ల తర్వాత కూడా కొత్త దానిలాగే ఉందని కెరెన్ హాన్రహన్ అనే ఆవిడ 2010లో వెల్లడించారు.
2010లో శాలీ డేవిస్ అనే ఫొటోగ్రాఫర్ మెక్ డోనల్డ్స్‌లో తాను కొన్న హ్యాపీ మీల్‌ను ఆరు నెలలపాటు రోజూ ఫొటోలు తీశారు.
అది అస్సలు పాడవ్వలేదని.. బూజు, వాసన లాంటివేమీ రాలేదని ఆమె చెప్పారు.
2013లో ఈ విషయం గురించి మెక్ డోనల్డ్స్ స్పందించింది.
‘‘సరైన వాతావరణంలో మిగతా ఆహార పదార్థాల్లాగే మా ఉత్పత్తులు కూడా పాడవుతాయి. అయితే తేమ లేకుంటే, అందులో బ్యాక్టీరియా, బూజు లాంటివి పెరిగే అవకాశాలు తక్కువ’’ అని వివరించింది.
ఆహారం పాడవ్వడానికి తేమ ముఖ్యమని, అది లేకుంటే అవి కేవలం ఎండిపోతాయని యూనివర్సిటీ ఆఫ్ ఐస్‌ల్యాండ్ ఫుడ్ సైన్స్ సీనియర్ లెక్చరర్ జోర్న్ అడాల్జోర్న్సన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది
- సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ మ్యాగజీన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- దేశ సైన్యంపై వ్యంగ్య కవితలు.. ఫేస్బుక్లో లైవ్.. అయిదుగురు కవులకు జైలు శిక్ష
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- చైనాలోని ఆకర్షణీయమైన గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








