చంద్రబాబు అరెస్ట్: రెండేళ్ల కిందటి ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా ఎందుకు అరెస్టు చేశారు? ఆ ఎఫ్ఐఆర్‌లో ఎవరెవరి పేర్లున్నాయి

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
ఈ కేసులో 11 పేజీల ఎఫ్ఐఆర్‌ను రెండేళ్ల కిందటే ఏపీ సీఐడీ నమోదు చేసింది.
ఆర్థిక నేరాల (ఎకనామిక్ ఆఫెన్సెస్)లో భాగంగా 2021 డిసెంబరు 9న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా ఉంది. సీఆర్పీసీ సెక్షన్లు 154, 157 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
కేసులో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె. అజయ్ రెడ్డి ఫిర్యాదుదారు (కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తి)గా ఉన్నారు.

ఫిర్యాదు ఎవరెవరిపై ఉంది?
2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రధానంగా 26 పేర్లను సీఐడీ ప్రస్తావించింది. వారందరిపై అప్పట్లో కేసు నమోదైంది. సీఐడీ ప్రస్తావించిన పేర్లు ఏంటంటే...
సీరియల్ నం.1 - ఘంటా సుబ్బారావు
2. కె. లక్ష్మీ నారాయణ
౩. నిమ్మగడ్డ వెంకట కృష్ణ
4. డిజైన్ టెక్ సిస్టమ్స్
5. స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్
6. సౌమ్యాద్రి శేఖర్ బ్రదర్స్
7. ప్రతాప్ కుమార్
8. వికాస్ వినాయక్ ఖన్వెల్క్
9. సంజయ్ దాగా
10. ముకుల్ అగర్వాల్
11. సౌరభ్ గార్గ్
12. హర్జీ కన్జీ పటేల్
13. శిరీష్ చంద్రకాంత్
14. డైరెక్టర్స్ ఆఫ్ పత్రికిన్ఫ్
15. డైరెక్టర్స్ ఆఫ్ ఐటీ స్మిత్
16. డైరెక్టర్స్ ఆఫ్ ఇన్ వెబ్
17. ప్రాజెక్ట్ టీం మెంబర్స్ అసోసియేట్స్
18. డైరెక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్ కంపెనీ
19. డైరెక్టర్స్ ఆఫ్ టాలెంట్ ఎడ్జ్
20. సురేష్ గోయల్
21. మనోజ్ కుమార్ జైన్
22. యోగేష్ గుప్తా
23. సీతారాం అరోరా
24. సౌరభ్ గుప్తా
25. విపిన్ శర్మ
26. సమాంగ్ కుమార్ తోలరాం

ఫొటో సోర్స్, ap police
దర్యాప్తు అధికారిగా డీఎస్పీ ఎం.ధనుంజయుడు
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా డీఎస్పీ ఎం. ధనుంజయుడును ఏపీ ప్రభుత్వం నియమించింది. ఎఫ్ఐఆర్‌లోనూ ఆయన ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరుగుతున్నట్లుగా ఉంది.
ఈ ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు ప్రస్తావన లేదు.
ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండాలని లేదు. అప్పటికీ వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉంటాయి.
తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు జత చేసే వీలుంటుంది.
అదే విధంగా చంద్రబాబు పేరు జత చేసి ఉండొచ్చు. ఈ విషయాన్ని పోలీసులు సహజంగా కేసు డైరీలో రాసుకుంటూ వస్తారు’’ అని బీబీసీకి న్యాయవాది లక్ష్మీనారాయణ వివరించారు.

నాటి ఎఫ్ఐఆర్‌లో ఏం ఉంది?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 2014-15 నుంచి 2018-19 మధ్య జరిపించిన అంతర్గత ఆడిట్‌లో చాలా విషయాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఎఫ్ఐఆర్‌లో రాశారు.
2021 సెప్టెంబరు 7న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నివేదిక ఇచ్చారు. అదే ఏడాది డిసెంబరు 9న ఇచ్చిన ప్రిలిమినరీ నివేదిక ప్రకారం సీఐడీకి ఫిర్యాదు అందిందని ఎఫ్ఐఆర్‌లో ఉంది.
ఇందులో నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపు, తప్పుడు నివేదికలు, ప్రభుత్వ నిబంధనల నుంచి పక్కకు జరగడం వంటివి జరిగిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
ప్రస్తుతం సీఐడీ ఏం చెబుతోంది?
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను కుంభకోణం చేసేందుకే ప్రారంభించారని సంజయ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














