బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీ రామారావు(ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, Twitter/rashtrapatibhvn
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీ రామారావు(ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నాణెం విడుదల కార్యక్రమం జరిగింది.
తెలుగు సినిమాల ద్వారా ఎన్టీఆర్ భారతీయ సినిమాను, సాంస్కృతిని సుసంపన్నం చేశారని అన్నారు.
రామాయణ, మహాభారత్ వంటి ప్రముఖ పాత్రలో తాను జీవించారని చెప్పారు.
నటన ద్వారా సామాన్య ప్రజల బాధలను ఎన్టీఆర్ తెలియజేశారని అన్నారు. తన సినిమాల్లో ఒకటైన ‘మనషులంతా ఒక్కటే’ అనే దాని ద్వారా సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని వ్యాప్తి చేశారు.
ప్రజానాయకుడిగా, నేతగా అంతే పాపులారిటీని ఎన్టీఆర్ సంపాదించారని చెప్పారు.
నేటికి కూడా గుర్తుండిపోయే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ నాణేన్ని తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖను రాష్ట్రపతి అభినందించారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
ఆగస్ట్ నెల ప్రారంభం నుంచి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు.
మహారాష్ట్రకి చెందిన లతూర్‌కు చెందిన 16 ఏళ్ల ఆవిష్కర్ సంభాజి ఆదివారం కాస్లే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ రాసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత 3.15 గంటలప్పుడు ఇన్‌స్టిట్యూట్ ఆరవ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ప్రమాద స్థలంలోనే అతను మరణించాడు.
ఆవిష్కర్ సంభాజి చనిపోయిన మూడున్నర గంటల తర్వాత, సాయంత్రం ఏడు గంటలప్పుడు మరో విద్యార్థి చనిపోయినట్లు తెలిసింది.
బిహార్‌కి చెందిన 18 ఏళ్ల ఆదర్ష్ తన రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
నీట్ కోచింగ్ కోసం నాలుగు నెలల క్రితం ఆదర్ష్ కోటాకు వచ్చాడు. తన తోబుట్టువులతో కలిసి ఫ్లాట్‌లో ఉంటున్నాడు.
సాయంత్రం ఫుడ్ కోసం కాల్ చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో, డోర్ పగలగొట్టి చూడగా, ఆదర్ష్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు.
అప్పటికే ఆదర్ష్ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన టెస్ట్‌లో తక్కువ మార్కులు రావడంతో, వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో రెండు నెలల పాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల టెస్ట్‌లపై నిషేధం విధించారు. టెస్ట్‌లు నిర్వహించడం ఆపివేయాలని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, ANI
తిరుమల ఘాట్‌లో బోను సాయంతో మరో చిరుతపులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఆపరేషన్ చిరుత పేరుతో వారం రోజులుగా చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు.
ఎట్టకేలకు నిన్న రాత్రి 7వ మైలు రాయి వద్ద చిరుతను అధికారులు పట్టుకున్నారు.
ఈ పులిని వెంకటేశ్వర జంతుప్రదర్శన శాలకు తరలించారు.
ఆగస్టు నెల నుంచి పట్టుకున్న నాలుగో చిరుతపులి ఇది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.