అమెరికాలో జాత్యహంకార దాడి: ముగ్గురి హత్య.. తనను తాను కాల్చేసుకున్న దుండగుడు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ సాయుధుడు ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చేసుకున్నాడు. ఇది జాత్యహంకార దాడేనని నగర మేయర్ డోనా డీగన్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఒక్కరు చాలు.. పిల్లలను కనడంలో భారత్‌లోనూ ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోందా

  3. చంద్రుడికి సంబంధించి విక్రమ్ ల్యాండర్ తాజాగా పంపిన వివరాలు ఇవీ..

    చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన ల్యాండర్‌లోని ‘చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్’(ChaSTE ) పేలోడ్ అక్కడ సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను పంపింది.

    ఆ వివరాలను ఇస్రో వెల్లడించింది.

    చంద్రుడి ఉఫరితలంపైన, ఉపరితలం నుంచి కొన్ని సెంటీమీటర్ల లోతున ChaSTEనమోదు చేసిన ఉష్ణోగ్రతలను ఇస్రో గ్రాఫ్ రూపంలో వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. పెళ్లి చేసుకుని, కొడుకును కని ఇద్దరినీ ఢాకాలో వదిలేశారంటూ ఇండియాలో ‘భర్త’పై కేసు వేసిన బంగ్లాదేశీ మహిళ

  5. బ్లాక్ స్వాన్ - శ్రియ: కే-పాప్‌లో భారత యువతి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి?

  6. చనిపోయింది ప్రిగోజినేనని జన్యు పరీక్షల్లో వెల్లడైంది: రష్యా

    ప్రిగోజిన్

    ఫొటో సోర్స్, Getty Images

    వాగ్నర్ చీఫ్ యెవ్‌గినీ ప్రిగోజిన్ చనిపోయినట్లు రష్యా ప్రభుత్వం ధ్రువీకరించింది.

    బుధవారం జరిగిన విమాన ప్రమాదం ఘటనలో లభించిన మృతదేహాలకు జన్యుపర్యమైన పరీక్షల అనంతరం ఈ ధ్రువీకరణకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

    ఆయనతోపాటు మరణించిన పది మందినీ గుర్తించినట్లు దర్యాప్తు చేపడుతున్న కమిటీ తెలిపింది.

    మరోవైపు ఈ ప్రమాదానికి తామే కారణమన్న వార్తలను రష్యా ఖండించింది.

  7. సూలూరు సుబ్బారావు మర్డర్ కేసు: మహిళల వెంటపడే ఆయన ఎలా చనిపోయారు

  8. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జెండా కనిపించదా? ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటుతో ఆటగాళ్ల ఒలింపిక్ కలలు చెదిరిపోయాయా

  9. ఆస్ట్రేలియాలో కుప్పకూలిన అమెరికా మిలిటరీ హెలికాప్టర్

    హెలికాప్టర్ ప్రమాదం

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాలో యుద్ధ విన్యాసాలు చేస్తున్న అమెరికా మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది.

    డార్విన్ కోస్టులో ఈ ప్రమాదం జరిగినట్లు స్కై న్యూస్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

    ప్రమాదం జరిగే సమయంలో ఆ హెలికాప్టర్‌లో 20 అమెరికా నావికా దళ జవాన్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

    మెల్విలీ దీవి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్కై న్యూస్ వెల్లడించింది.

  10. అమెరికాలో జాత్యహంకార దాడి: ముగ్గురి హత్య.. తనను తాను కాల్చేసుకున్న దుండగుడు

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ సాయుధుడు ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చేసుకున్నాడు.

    జాక్సన్‌విల్‌లోని డాలర్ జనరల్ స్టోర్‌లోకి ప్రవేశించి అతడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

    దాడి చేసిన వ్యక్తి తెల్లజాతీయుడని, అతడి వయసు 20లలో ఉంటుందని పోలీసులు తెలిపారు.

    ఈ దాడిలో ఇద్దరు మగవారు, ఒక మహిళ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరు ముగ్గురూ నల్లజాతీయులేనని, ఇది జాత్యహంకార దాడని నగర మేయర్ డోనా డీగన్ చెప్పారు.

    దుండగుడి దగ్గర ఆటోమేటిక్ రైఫిల్‌తోపాటు ఒక హ్యాండ్ గన్ కూడా ఉందని, అతడు తన కుటుంబంతో జాక్సన్‌విల్‌లోని క్లే కౌంటీలో ఉండేవాడని వివరించారు.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.