ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ ప్రకటించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
'ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐబీఎస్ఏ)' వరల్డ్ గేమ్స్‌లో భారత అంధ మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం సాధించింది.
శనివారం జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచింది.
ఐబీఎస్ఏ గేమ్స్ ఆస్ట్రేలియాలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, telangana congress
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ ప్రకటించారు.
సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Telangana congress
ఎస్టీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని ప్రధానాంశాలు

ఫొటో సోర్స్, telangana congress

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రుబియలెజ్‌ను ఫిఫా సస్పెండ్ చేసింది.
ఫుట్‌బాల్ మహిళా ప్రపంచకప్‌ను స్పెయిన్ జట్టు గెలుచుకున్న తరువాత ఆ జట్టు క్రీడాకారిణి జెన్నీ హెర్మసోను లూయిస్ ముద్దు పెట్టుకున్నారు. ఆమె పెదవులపై లూయిస్ ముద్దు పెట్టడం వివాదానికి దారితీసింది.
దీంతో లూయిస్‌ను రాజీనామా చేయాలని ఫిఫా కోరినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల ఫుట్ బాల్ సంబంధిత కార్యక్రమాల నుంచి ప్రాథమికంగా సస్పెండ్ చేశారు.
‘ఈ రోజు నుంచి సస్పెన్షన్ అమలులోకి వస్తుంది. మొత్తం 90 రోజుల పాటు ఈ సస్పెన్షన్ ఉంటుంది’ అని ఫిఫా వెల్లడించింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంలోని రహస్యాలు తెలుసుకోవడానికి ‘శివశక్తి పాయింట్’లో ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని పేర్కొంటూ ఇస్రో ఈ వీడియోను ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
ఆగస్ట్ 23న సాయంత్రం చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై దిగింది. అనంతరం ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి చంద్రుడిపై తిరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్‌కి సమీపంలో రైలుకి మంటలు అంటుకోవడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు.
మీడియా రిపోర్ట్‌ల ప్రకారం, ఆగస్ట్ 17న 60 మందికి పైగా యాత్రికులు లఖ్‌నవూ నుంచి రైలులో తీర్ధ యాత్ర కోసం తమిళనాడుకు బయలుదేరారు.

శనివారం ఉదయం ఈ యాత్రికులు మదురై చేరుకున్నారు. శుక్రవారం నాడు వీరు నాగర్ కోయిల్‌లో ఉన్న పద్మనాభ స్వామి ఆలయాన్ని వీరు దర్శించుకున్నారు.
మదురై రైల్వే స్టేషన్‌కి ఒక కిలోమీటర్ దూరంలో రైలు ఆగి ఉండగా, ఒక కోచ్‌కి మంటలు అంటుకున్నాయి.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రైలులో ఉన్న యాత్రికులు కొందరు సిలిండర్‌పై టీ పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. రైలు కోచ్‌కి ఈ మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు బీబీసీకి చెప్పారు.
ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడక్లిక్చేయండి.