ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలను ప్రచురించవద్దని, ప్రదర్శించవద్దని చెబుతూ మీడియా సంస్థలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలను ప్రచురించవద్దని, ప్రదర్శించవద్దని చెబుతూ మీడియా సంస్థలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
ఈ ప్రకటన ప్రకారం- వార్తాపత్రికలు, టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు ఏ రూపంలోనూ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలను ప్రచారం చేయకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
ఈ వ్యవస్థకు మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని కేంద్రం తన ఉత్తర్వుల్లో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
హంగేరిలోని బుడాపెస్ట్‌లో శుక్రవారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ తరఫున ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆదివారం జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డిబేట్‌లో పాల్గొన్నారు.
ఈ డిబేట్ తర్వాత నుంచి భారీ స్థాయిలో ఆయనకు నిధులు వెల్లువ కొనసాగుతోంది.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డిబేట్ ముగిసిన గంటలోనే వివేక్ రామస్వామి 4,50,000 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3.72 కోట్లకు పైగా సేకరించినట్లు ఆయన క్యాంపెయిన్ ప్రతినిధి త్రిసియా మెక్‌లాఫ్లిన్ అమెరికా న్యూస్ ఏజెన్సీ ఏపీకి చెప్పారు.
రామస్వామి రిపబ్లికన్ లీడర్. పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ డిబేట్‌కు హాజరు కాకపోవడంతో, రామస్వామి ప్రసంగం అమెరికాలో చక్కర్లు కొడుతోంది.
ఈ డిబేట్ తర్వాత విడుదలైన తొలి సర్వేలో, ఆయన ప్రసంగం విన్న 504 మంది వ్యక్తుల్లో 28 శాతం మంది రామస్వామి ఉన్నతంగా మాట్లాడారని తెలిపారు.
రామస్వామితో పాటు రిపబ్లికన్ నేత, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా అభ్యర్థి రేసులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోయారు.
20 నిమిషాల పాటు జైలులో గడిపిన ట్రంప్, ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు.
ఏ అమెరికా అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడికి ఎదురుకాని పరిస్థితి తొలిసారి ట్రంప్‌కి ఎదురైంది.
అమెరికా చరిత్రలో ఇదెన్నడూ జరగలేదు.
ట్రంప్ జైలులో ఉన్న మగ్‌షాట్ ఫోటో(పోలీసు రికార్డుల కోసం తీసిన క్రిమినల్ ముఖానికి చెందిన ఫోటో)ను జైలు అధికారులు పబ్లిక్‌కు విడుదల చేశారు.
జార్జియాలో 2020 ఎన్నికల్లో తన ఓటమి ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మొత్తంగా ట్రంప్‌పై 13 నేరపూరిత అభియోగాలు నమోదయ్యాయి.
బెయిల్‌పై విడుదలయ్యేందుకు ట్రంప్ 2 లక్షల డాలర్ల బాండ్ మొత్తాన్ని జైలు అధికారులకు కట్టారు.
గత కొన్ని నెలలుగా ట్రంప్ ఎదుర్కొంటోన్న నాలుగవ క్రిమినల్ కేసు ఇది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2021 తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన ట్రంప్
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ట్రంప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విటర్)పై ట్వీట్ చేశారు.
జార్జియా జైలు విడుదల చేసిన తన మగ్‌షాట్(పోలీసు రికార్డుల కోసం తీసిన క్రిమినల్ ముఖానికి చెందిన ఫోటో) ఫోటోతో పాటు, కొంత సమాచారాన్ని షేర్ చేశారు.
అంతకుముందు చివరిసారి ట్రంప్ 2021 జనవరి 8న ట్వీట్ చేశారు. ట్విటర్‌పై ట్రంప్‌ను బ్యాన్ చేశారు.
ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలుచేసిన తర్వాత, ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అయినప్పటికీ, ట్రంప్ ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడలేదు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి. నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.