ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే కారణంతో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పు చెప్పింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే కారణంతో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పు చెప్పింది.
అయితే, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు తీర్పు వెల్లడించిందని కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
కొద్దిరోజుల కిందట కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర రావుపై కూడా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే కారణంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

ఫొటో సోర్స్, Reuters
జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియ మొదలైంది.
పాక్షికంగా శుద్ధిచేసిన మిలియన్ టన్నుల ఈ రేడియోయాక్టివ్ వాటర్‌ను పసిఫిక్ మహాసముద్రంలోకి దశల వారీగా పంపిస్తున్నారు.
జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు నీటిని విడుదల చేయడం మొదలుపెట్టినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రియాక్టర్లను చల్లబరిచేందుకు ఈ నీటిని ఒకప్పుడు ఉపయోగించారు. అయితే, 2011 సునామీలో ఈ అణు విద్యుత్ కేంద్రం దెబ్బతింది.
అప్పటి నుంచీ ఈ వ్యర్థ జలాలను ట్యాంకుల్లో నిల్వ చేస్తూ వచ్చారు. అయితే, 2021లో ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు
అయితే, ఈ నీటిని విడుదల చేయొద్దని జపాన్‌తోపాటు పొరుగునున్న దక్షిణ కొరియా, చైనాల్లోనూ నిరసనలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవగోనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిందని మీడియా సంస్థలు బ్రేకింగ్ ఇచ్చేటప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఫుతిన్ ఎక్కడున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఆ సమయంలో ‘‘నాజీ జర్మనీపై సోవియట్ విజయం 80వ వార్షికోత్సవం’’ను పురస్కరించుకొని కుర్స్‌క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతున్నారు.
1943లో ఇక్కడ చోటుచేసుకున్న యుద్ధం చరిత్రలోని అతిపెద్ద యుద్ధ టాంక్‌ల పోరాటాల్లో ఒకటిగా చెబుతారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడేటప్పుడు విమానం కుప్పకూలిన విషయాన్ని పుతిన్ ప్రస్తావించలేదు. కానీ, యుక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్న రష్యా సైనికులను ఆయన స్మరించుకున్నారు.
దీనికి ముందుగా.. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశానికి వర్చువల్‌గా పుతిన్ హాజరయ్యారు.

ఫొటో సోర్స్, UGC
విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున టీవీఎస్ షోరూమ్‌లో వ్యాపించిన మంటల్లో వాహనాలు కాలి బూడిదయ్యాయి. సుమారుగా 250కి పైగా వాహనాలు కాలిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదని, ప్రాథమికంగా షార్ట్ సర్య్యూట్ కారణమయి ఉంటుందని భావిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
టీవీఎస్ షోరూమ్‌లో మొదటి అంతస్తులో తొలుత మంటలు మొదలయ్యాయి. అవి వేగంగా వ్యాపించడంతో వాహనాలన్నీ మంటల్లో చిక్కుకున్నాయి.

ఫొటో సోర్స్, UGC
గోడౌన్, సర్వీస్ సెంటర్లను కూడా మంటలు చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ అధికారులు రంగంలో దిగి, మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే చాలా నష్టం సంభవించింది.
ఫ్రీ ఫ్యాబ్రిక్ పద్ధతిలో కట్టిన షోరూమ్ కావడంతో మంటలు త్వరగా వ్యాప్తి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు కూడా షోరూమ్‌లో ఉన్నాయి. చార్జింగ్ పెట్టి ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందా అనే అనుమానాలున్నాయి. ఆ కోణంలోనే విచారిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్‌గోనీ ప్రిగోజిన్ ఇలానే మరణిస్తారని ముందే ఊహించినట్లు బ్రిటన్ విదేశీ గూఢచర్య సంస్థ (ఎంఐ6)లోని రష్యా డెస్కు మాజీ అధిపతి క్రిస్టోఫర్ స్టీలే అన్నారు.
భద్రతా విభాగంలోని కీలక స్థానంలో ఉండేవారే ఈ విమానాన్ని కూల్చివేసినట్లు భావిస్తున్నట్లు ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘కొన్ని వారాల క్రితమే మేం ఈ విషయాన్ని చెప్పాం. ప్రిగోజిన్‌ను హత్య చేసేందుకు కొంతమందితో కాంట్రాక్టు కుదుర్చుకున్నారని మాకు తెలిసింది’’ అని ఆయన తెలిపారు.
‘‘ఆయనకు అన్ని వైపులా శత్రువులే ఉన్నారు. అధికార యంత్రాంగంలో ఆయనకు విశ్వాసపాత్రులు చాలా కొద్దిమందే ఉన్నారు. అలాంటప్పుడు ఇలా జరగడం సాధారణమే’’ అని ఆయన వివరించారు.
బీబీసీ లైవ్ పేజ్‌కు స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజ్‌ను చూడండి. నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడక్లిక్ చేయండి.