చక్కెర బదులు తేనె వాడటం మంచిదేనా?

ఫొటో సోర్స్, Getty Images
తేనె ఎలా వస్తుందో మనందరికీ తెలిసిందే. తేనెటీగలు పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించి తేనెతుట్టెలో దాచుకుంటాయి. ఈ తేనెతుట్టెలు శీతాకాలంలో వాటి ఆహార అవసరాలను తీరుస్తాయి.
ప్రాచీన గ్రీసులో తేనెను ‘ఫుడ్ ఆఫ్ ది గాడ్’గా వర్ణించేవారు. అయితే చైనాలో తేనెను ఓ ఔషధంగా వర్గీకరించారు.
తేనెలో పోషక పదార్థాలు ఇవీ
ముడి తేనెలో అమినో ఆసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర ఉంటాయి.
తేనెలో అత్యంత తీపి (ఫ్రక్టోజ్) గుణం ఉంటుంది.
ఈ గుణమే తేనెను చక్కెర కంటే ఎక్కువ తీయగా చేస్తుంది.
కాకపోతే ఇందులో నిర్ణీత మోతాదులో గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ) కూడా ఉంటుంది.
జీఐ అంటే ఒక ఆహార పదార్థంలోని చక్కెర మన శరీరంలో ఎంత వేగంగా పెరుగుతుందని చెప్పే రేటింగ్ వ్యవస్థ లాంటిది.
ఒక టేబుల్ స్పూన్ తేనె (20గ్రాములు)లో పోషకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
58 కిలోకేలరీలు
15.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్
15.4 గ్రాముల చక్కెర
0.1 ప్రొటీన్
0 గ్రాముల కొవ్వు

ఫొటో సోర్స్, Getty Images
తేనెతో కలిగే మేలు ఇదీ
తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆ తేనెను ఎంత నాణ్యమైన పుష్పాల నుంచి తేనేటీగలు సేకరించాయనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
ముడి తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే వేడి చేయని, పాశ్చరైజ్ చేయడం లేదంటే వడగట్టని తేనె ఎక్కువగా ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే పోషకాలను కలిగి ఉంటుంది. అయితే స్టాండర్డ్ ప్రాసెసింగ్ మెథడ్స్ వల్ల తేనె తన పోషక విలువలను కోల్పోతుంది.
తేనెను ఎప్పటి నుంచో యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది గాయాలను, పుండ్లను, కాలిన దెబ్బలను త్వరగా నయం చేస్తుందని నమ్ముతారు.
తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలిసి ఉండటమే దీనికి కారణం. ఈ గుణం గాయంలో ఉండే నీటిని పీల్చుకుని, గాయం ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల గాయంపైన బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అవకాశం ఉండదు.
ప్రత్యేకించి ముదురు వర్ణంలో ఉండే తేనెలో ఫ్లేవనాయిడ్స్ లాంటి రసాయన మూలకాలు ఉంటాయి.
ఫ్లేవనాయిడ్స్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇనఫ్లమేటరీ, యాంటీ అలర్జీ గుణాలు కలిగి ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ కారణంగానే చక్కెర కంటే తేనె మంచిదని చెబుతారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది.
దీంతోపాటు పంచదార కంటే తేనెలో తక్కువ జీఐ ఉంటుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండి బ్లడ్ షుగర్‌ను పెంచుతుంది. కాబట్టి తగిన మోతాదులోనే వాడాలి.
పంచదార కంటే మేలైనదా?
పంచదార కంటే తేనెలో జీఐ తక్కువగా ఉంటుంది. అంటే దానర్థం ఇది బ్లడ్ షుగర్ స్థాయులను చక్కెర అంత త్వరగా పెంచదని. చక్కెర కంటే తేనె తియ్యగా ఉంటుంది కాబట్టి, తేనెను కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అయితే చక్కెరతో పోలిస్తే టీ స్పూన్ తేనెలో కేలరీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అలాగే మీ ప్రొటీన్ స్థాయులపై కూడా ఓ కన్నేసి ఉంచడం మంచిది.
మీరు తేనెను వాడదలుచుకుంటే ముడి తేనెను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ముడి తేనెలో చక్కెరలో కంటే ఎక్కువ విటమిన్లు, ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే దీనిని తగిన మోతాదులో వినియోగించాలి. కానీ తేనె వల్ల కలిగే పోషక ప్రయోజనాలు తక్కువగా ఉంటాయనే సంగతి మాత్రం మరచిపోకండి.

ఫొటో సోర్స్, Getty Images
తేనె అందరికీ మంచిదేనా?
తేనెను నిర్ణీత మోతాదులో తీసుకోవడం వల్ల చాలా మంది పెద్దలకు సురక్షితమే. అయితే డయాబెటిస్ ఉన్నవారు, లేదంటే బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించాలనుకునేవారికి తేనె వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే, ఈ రెండు కూడా బ్లడ్ షుగర్ స్థాయులను ప్రభావితం చేస్తాయి.
దీంతోపాటు ఏడాదిలోపు పిల్లలకు ముడి తేనె, లేదంటే మార్కెట్లో దొరికే తేనె తినిపించకూడదు. ఇది బాచులిజం (ఆహారం విషపూరితం కావడం వల్ల ఎదురయ్యే సమస్య) అనే ముప్పునకు దారితీయచ్చు.
ఇక కృత్రిమంగా తేనెను సాగు చేయడమనేది,కష్టపడి తేనెను కూడబెట్టుకుని శీతాకాలంలో తమ ఆహార అవసరాలు తీర్చుకునే తేనెటీగల మనుగడకు ముప్పు తెస్తుంది.
ఇవి కూడా చదవండి:
- సముద్రం అడుగున ‘తిమింగలం ఎముకల గూడు’ అవార్డు తెచ్చిపెట్టింది
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లి కొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్ డోస్ కావడంతో చనిపోయారా?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















