సముద్రం అడుగున ‘తిమింగలం ఎముకల గూడు’ అవార్డు తెచ్చిపెట్టింది

అండర్ గ్రౌండ్ వాటర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్- 2024 అవార్డుకి అలెక్స్ డాసన్ ఎంపికయ్యారు.

తిమింగలాలను వేటాడిన తర్వాత నీటి అడుగున పరిస్థితి ఎలా ఉందా అని ఓ ఫ్రీ డైవర్ పరిశీలిస్తున్న దృశ్యాన్నికెమెరాతో ఒడిసి పట్టినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.

అలెక్స్ డాసన్ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, ALEX DAWSON/UPY2024

తిమింగలాల ఎముకల గూళ్లు కనిపించే ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా 6,500 ఇతర ఫోటోలతో పోటీ పడి అవార్డు తెచ్చిపెట్టింది.

“ఈ ఫోటోను చాలా కఠిన పరిస్థితుల మధ్య తీశారు. గ్రీన్‌ల్యాండ్ మంచు ఫలకాల కింద నేల మీద పడిఉన్న తిమింగలాల కళేబరాల్ని ఊపిరి బిగబట్టి చూస్తున్న ఓ డైవర్” అంటూ దీన్ని వర్ణించారు జడ్జిల ప్యానెల్‌లో ఒకరైన అలెక్స్ మస్టర్డ్.

డైవర్ వేసుకున్న సూట్, అతని చేతిలో టార్చ్‌లైట్.. ఈ చిత్రానికి విజిటింగ్ ఏలియన్ ఫీల్ ఇచ్చాయని అన్నారు.

“ఈ చిత్రంలో అమరిక అబ్బురపరుస్తూనే మీ దృష్టి పయనాన్ని సరైన దిశలో తీసుకెళ్తూ, మీకు కథను వివరిస్తుంది”

మ్యాక్రో, వైడ్ ఏంగిల్, బిహేవియర్ సహా 13విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ 13 విభాగాల్లో నాలుగు బ్రిటిష్ జలాల్లో తీసిన వాటిని పోటీకి అర్హమైనవిగా గుర్తించారు.

బ్రిటిష్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్‌ ద ఇయర్- 2024 స్టార్ అట్రాక్షన్ కేటగిరీ కింద జెన్నీ స్టాక్ అవార్డు గెలుచుకున్నారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, JENNY STOCK/UPY2024

“స్కాట్లండ్‌లోని ఓబన్ దగ్గర లొచ్ లెవెన్ అనేది డైవింగ్ చేసే ప్రాంతం” అని జెన్నీ స్టాక్ చెప్పారు.

“సముద్రంలో ఇరుకైన ముదురు ఆకుపచ్చ లోయలాంటి ప్రాంతం లోపలకు దిగుతున్నప్పుడు ఆ సంధ్యాసమయంలో నా చేతిలోని టార్చ్‌లైట్ వేలాది ‘బ్రిటిల్ స్టార్స్‌’పై పడింది. అవి వెదజల్లే స్పష్టమైన రంగుల మిలమిలలు అబ్బురపరిచాయి” అన్నారామె.

“సముద్రంలో ఈ ఉదారంగు ‘సీ ఉర్చిన్’ను గుర్తించిన తర్వాత నాకు చాలా ఉద్విగ్నంగా అనిపించింది. దీంతో దూరంగా ఉండి హాయిగా ఫోటోలు తీసుకున్నాను” అని చెప్పారామె.

గతేడాది ఫోటోగ్రాఫర్ ఆఫ్‌ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న స్పెయిన్ ఫోటోగ్రాఫర్ రఫేల్ ఫెర్నాండెజ్ కబల్లేరొ ఈసారి ‘బిహేవియర్ అండ్ పోట్రైట్’ విభాగంలో విజేతగా నిలిచారు.

బూడిద రంగు సొరచేప కన్ను మరో బ్రెయిడ్స్ వేల్ చేపల గుంపు మొత్తాన్ని అమాంతం మింగుతున్న ఫోటోలకు గాను కబల్లేరోకు అవార్డు దక్కింది.

ఈ ఫోటోలను ఆయన మెక్సికోలోని మగ్డాలేనా అఖాతంలో తీశారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, RAFAEL FERNANDEZ CABALLERO/UPY2024

“ఈ ఫోటో దాడి జరిగిన క్షణాన్ని కళ్లకు కడుతుంది. తిమింగలం తన దవడల్ని పెద్దగా తెరిచి వందల కేజీల సార్డిన్ చేపల్ని ఒకేసారి మింగేసి వాటిని తినే క్రమంలో నీటిని బయటకు విడుదల చేసే దృశ్యం.. మర్చిపోలేని అనుభవం” అని కబల్లెరో చెప్పారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, RAFAEL FERNANDEZ CABALLERO/UPY2024

“చాలా కొద్దిమంది మాత్రమే సొర చేప కంటిని ఇంత దగ్గరగా చిత్రీకరించారు” అని మస్టర్డ్ చెప్పారు.

“ఈ అద్భుతమైన చిత్రం ద్వారా ఈ తెలివైన జీవి ఆత్మను అనేక మంది తెలుసుకోగలరు – ఇది సముద్రగర్భంలో అత్యద్భుతమైన కళాఖండం అని చెప్పవచ్చు”

అప్ అండ్ కమింగ్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్‌ద ఇయర్ అవార్డు అమెరికాకు చెందిన లిసా స్టెంజెల్‌కు దక్కింది. మెక్సికో సముద్ర తీరంలో మాహిమాహి అనే చేప సార్డైన్ చేపను నోట కరచుకునే దృశ్యాన్ని ఆమె తన కెమెరాలో బంధించారు. ఈ చిత్రం ఆమెకు అవార్డు తెచ్చి పెట్టింది.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, LISA STENGEL/UPY2024

మీరు వినగలిగితే సముద్రం లోపల అంతులేనన్ని శబ్దాలు వినిపిస్తాయి. ప్రత్యేకంగా సొర చేపలు ఆహారాన్ని వేటాడేటప్పుడు” అని స్టెంజెల్ చెప్పారు.

“మాహి చేప చేసే శబ్దం మీదనే నేను ఆధారపడ్డాను. ఆ శబ్దాన్ని అనుసరించి నా కెమెరా వెళ్లింది”

“ఈ టెక్నిక్ అనుకోకుండా నా అవకాశాలను రెట్టింపు చేసింది. ఆ ప్రత్యేక సందర్భాన్ని కెమెరాలో బంధించే అవకాశాన్ని ఇచ్చింది”.

సేవ్ అవర్ సీస్ ఫౌండేషన్ మెరైన్ కన్సర్వేషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు పోర్చుగీస్ ఫోటోగ్రాఫర్ నునొ సవాస్‌కు లభించింది. లిస్బన్‌లో కోస్టా డ కాప్రిసా దగ్గర ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ స్పెర్మ్ వేల్‌ను కాపాడేందుకు బీచ్‌లో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ఆయన కెమెరాలో బంధించారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, NUNO SÁ/UPY2024

“సముద్రంలో కదిలేందుకు ఇబ్బంది పడుతున్న భారీ స్పెర్మ్ వేల్ ఒకటి ఆ ప్రయత్నంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఒడ్డున లోతు లేని చోట చిక్కుకుంది” అని సా చెప్పారు.

“వాళ్లంతా కలిసి ఆ జెయింట్ వేల్‌ను మళ్లీ లోపలకు పంపించేందుకు సాయం చేశారు

కొన్ని గంటల తర్వాత అది చివరి శ్వాస తీసుకుంది. దాని శరీరం బరువుకు అక్కడ నుంచి కదిలే వీలు లేకపోవడంతో ఇసుకలోనే చిక్కుకుపోయింది”

సిడ్నీ సముద్ర తీరంలోని బేర్ ఐలండ్‌దగ్గర్లోని మురికి నీళ్లలో పాట్ బెల్లీ సీ హార్స్ ఫోటోకు మేక్రో ప్రోట్రైట్ కేటగిరీ కింద అవార్డు దక్కింది. ఈ ఫోటోను ఆస్ట్రేలియాకు చెందిన టలియా గ్రీయిస్ తీశారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, TALIA GREIS/UPY2024

అమెరికన్ ఫోటోగ్రాఫర్ మార్టిన్ బ్రొయెన్ తీసిన ఫోటో వ్రెక్స్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. జోర్డన్ తీరంలో అండర్ వాటర్ మిలటరీ మ్యూజియంలో రెండు ట్యాంకులను మార్టిన్ తన కెమెరాలో బంధించారు.

ఈ ట్యాంకులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి ఎర్ర సముద్రంలోని ఓ పగడపు దీవుల దిబ్బ వద్ద ఉన్నాయి.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, MARTIN BROEN/UPY2024

పెర్త్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు స్విమ్మర్లు చేసిన విన్యాసం బ్లాక్ అండ్ వైట్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఈ ఫోటోను జాస్మిన్ స్కై స్మిత్ గెలుచుకున్నారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, UPY2024

షెట్‌ల్యాండ్‌లో రెండు బాంబింగ్ గ్యానెట్స్ డైవింగ్ చేస్తున్న ఫోటోకు గాను అమెరికన్ ఫోటోగ్రాఫర్ క్యాట్ జౌ బ్రిటిష్ వాటర్స్ వైడ్ యాంగిల్ అవార్డు దక్కింది.

ఈ పక్షులు వేగంగా డైవ్ చేయడం వల్ల ఏర్పడిన రింగు రింగుల బుడగలను జడ్జ్‌లు ఇష్టపడ్డారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, KAT ZHOU/UPY2024

ఓ సీసాల్లో ఇరుక్కుపోయి బయటకు చూస్తున్న బ్లెన్నీ చేపను కెమెరాలో బంధించినందుకు క్రిస్టీ అండ్రూస్ బ్రిటిష్ వాటర్ లివింగ్ టు గెదర్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు.

“బ్లెన్నీ చేపలు సహజంగా మూలకు పడి ఉన్న గవ్వల్లో తమ నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఈ ఫోటో చూస్తే అవి కూడా సృజనాత్మకంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది” అని ఆమె చెప్పారు.

“ఫల్ నది సముద్రంలో కలిసే చోట మెత్తటి నేలలో అనేక బ్లెన్నీ చేపలు అక్కడ పడేసిన సీసాలను తమ నివాసంగా మార్చుకున్నాయి”

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, A blenny framed inside a glass bottleIMAGE SOURCE,KIRSTY ANDREWS/UPY2024

డోర్సెట్‌లోని చెసిల్ కోవ్ దగ్గర సముద్రపు గడ్డిలో సంచరిస్తున్న క్యాట్ షార్క్‌ను జోనాధన్ బంకర్ కెమెరాలో బంధించారు. ఈ చిత్రం బ్రిటిష్ వాటర్స్ కాంపాక్ట్ అవార్డు గెలుచుకుంది.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, JON BUNKER/UPY2024

ఇండోనేషియాలోని బాలి ఈశాన్య తీరంలో తలపై కిరీటం పెట్టుకున్నసీ స్లగ్ ఫోటోతో ఎన్రికో సోమోగి కాంపాక్ట్‌ విభాగంలో విజేతగా నిలిచారు.

అవార్డు గెలుచుకున్న ఫొటో

ఫొటో సోర్స్, ENRICO SOMOGYI/UPY2024

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)