ట్రంప్-జెలియెన్‌స్కీ చర్చ 10 నిమిషాల్లోనే ఎలా ముగిసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ బేట్‌మాన్, బెర్న్‌డ్ దెబుస్మాన్ జూనియర్
- హోదా, వైట్‌హౌస్ నుంచి బీబీసీ న్యూస్
తన దేశ భవిష్యత్‌లో అమెరికాకు వాటాను ఇచ్చేందుకు ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసి, డోనల్డ్ ట్రంప్‌తో సానుకూల చర్చలు జరపాలని ఆశించిన యుక్రెయిన్ అధ్యక్షుడు శుక్రవారం అర్థంతరంగానే వైట్‌హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
వారు అసలైన సమావేశం ప్రారంభానికి ముందే పది నిమిషాల పాటు ప్రపంచ మీడియా ముందు మాటల యుద్ధానికి దిగారు.
నిర్దేశించిన విలేకరుల సమావేశానికి వేదికపైకి రాకముందే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ వెళ్లిపోవాల్సి వచ్చింది.
దీంతో, ఖనిజాల ఒప్పందం ఎలాంటి సంతకాలు లేకుండానే నిలిచిపోయింది.
''శాంతికి సిద్ధమైనప్పుడు ఇక్కడకు రావొచ్చు'' అంటూ.. జెలియెన్‌స్కీ కారు వెళ్లిపోవడానికి కొద్దిసేపటి ముందు సోషల్ మీడియాలో డోనల్డ్ ట్రంప్ పోస్టు చేశారు.
ట్రంప్‌తో, వైట్‌హౌస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో జరిగిన వాడీవేడి చర్చ, ప్రపంచ మీడియాలో ప్రధానాంశంగా నిలిచింది.
వారి మధ్యలో ఇంత చర్చకు దారితీసిన అంశాలేంటో మనం ఒకసారి చూద్దాం..


ఫొటో సోర్స్, Truth Social
1. జెలియెన్‌స్కీ, వాన్స్ - ఆగ్రహావేశాలు
సమావేశం ప్రారంభానికి ముందు జరిగిన సుహృద్భావ చర్చలు, లాంఛనాల సమయంలో, ''శాంతికి, శ్రేయస్సుకు మార్గం బహుశా దౌత్యంలో ఉండి ఉండొచ్చు'' అని వాన్స్ చెప్పడంతో టెన్షన్ వాతావరణం మొదలైంది.
అదే ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నారని వాన్స్ అన్నారు.
2019లో కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పాటు, మూడేళ్ల క్రితం పూర్తి స్థాయిలో రష్యా యుద్ధంతో విరుచుకుపడటానికి ముందు వరకు, ''ఎవరూ ఆయన్ను అడ్డుకోలేదు,'' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ జెలియెన్‌స్కీ అన్నారు.
''ఏ రకమైన దౌత్యం జేడీ? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీ ఉద్దేశం ఏంటి?'' అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ మాటలు మరింత వేడెక్కాయి.
జెలియెన్‌స్కీ అగౌరవకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నారని, అమెరికా మీడియా ఎదుట ఈ పరిస్థితిపై న్యాయపోరాటం చేస్తున్నారని ఆరోపించారు.
పుతిన్‌తో ప్రారంభ చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలతో యుద్ధం ముగించేందుకు ట్రంప్ అనుసరించిన వైఖరిని వాన్స్ ప్రస్తావించడంతో, యుక్రెయిన్ నేతతో ఈ ఘర్షణ మరింత పెరిగింది.

ఫొటో సోర్స్, Reuters
2. 'మేమేం అనుభవిస్తామో మీరు చెప్పనవసరం లేదు'
మిలటరీ, నిర్భందంలో ఉన్న సైనికుల విషయంలో మీకు సమస్యలు ఉన్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడిని వాన్స్ ఎత్తిచూపిన తర్వాత.. '' యుద్ధంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. మీకు కూడా'' అని జెలియెన్‌స్కీ సమాధానమిచ్చారు.
దీంతో, అప్పటి వరకు జెలియెన్‌స్కీ, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మధ్యలోనే సాగిన ఈ మాటల యుద్ధంలో డోనల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు.
యుద్ధంలో దూకుడుగా ఉన్న రష్యాతో డీల్ చేయకపోవడం ట్రంప్ చేసిన తప్పిదమని జెలియెన్‌స్కీ సందేశం ఇస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
మాస్కో ఐసోలేషన్‌కు ముగింపు పలకడం, తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కోరడం వంటివి పుతిన్‌కు ధైర్యాన్ని తెచ్చి యూరప్‌ను బలహీనపరిచి, యుక్రెయిన్‌ను ధ్వంసం చేసేందుకు మార్గాన్ని వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యుద్ధమనేది రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సంఘర్షణగా పేర్కొన్నారు. పోరాటానికి, దాని పరిణామాలకు భారాన్ని లేదా నిందను వారే తీసుకోవాలని అన్నారు.
అయితే, ఇలాంటి ఆలోచనల వల్ల విపత్కర పర్యవసానాలు ఎదురవుతాయని జెలియెన్‌స్కీ హెచ్చరించేందుకు ప్రయత్నించారు.
''ఓవల్ ఆఫీసులో ట్రంప్‌కు యుక్రెనియన్ నేత నేరుగా చెబుతున్నది ఏంటంటే: రష్యాను ప్రసన్నం చేసుకోండి, లేకుంటే యుద్ధం మీ దాకా వస్తుంది'' అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ను మరింత రెచ్చగొట్టాయి. ''మీమేం అనుభవిస్తామో మీరు చెప్పనవసరం లేదు. మీరు మమ్మల్ని నిర్దేశించే స్థితిలో లేరు'' అంటూ ట్రంప్ కాస్త గట్టిగానే మాట్లాడారు.
''లక్షల మంది జీవితాలతో మీరు జూదం ఆడుతున్నారు'' అని ట్రంప్ అన్నారు.
ఈ చర్చతో ట్రంప్‌కు ఎదురుగా నిలబడాలని కోరుకునే వారి నుంచి జెలియెన్‌స్కీ ప్రశంసలు పొందవచ్చు. కానీ, ఈ క్షణం యూరప్‌లో యుద్ధం, శాంతి యుగాన్ని కూడా నిర్ణయించనుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. 'మీరు ఒక్కరే కాదు': ట్రంప్
ఈ మాటల యుద్ధంలోనే, ''యుద్ధం ప్రారంభం నుంచి మేం ఒంటరిగా పోరాడుతున్నాం. దానికి మేం కృతజ్ఞులమై ఉంటాం'' అని జెలియెన్‌స్కీ అన్నారు.
ఇది ట్రంప్‌కు మరింత కోపాన్ని తెప్పించింది. ''మీరు ఒక్కరే కాదు. స్టుపిడ్ ప్రెసిడెంట్ ద్వారా మేం మీకు 350 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30,61,469 కోట్లు) ఇచ్చాం'' అని అమెరికా మునపటి అధ్యక్షుడు బైడెన్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు.
సమావేశంలో జెలియెన్‌స్కీ అమెరికాకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని వాన్స్ అడిగారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల తరఫున ప్రచారం నిర్వహించినట్లు ఆరోపించారు.
నవంబర్‌లో అమెరికాలో పోలింగ్ జరగడానికి కొన్ని వారాల ముందు జో బైడెన్ స్వస్థలం పెన్సిల్వేనియా స్క్రాంటన్‌లోని ఒక ఆయుధ కర్మాగారాన్ని జెలియెన్‌స్కీ సందర్శించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ పర్యటనపై రిపబ్లికన్లు అప్పుడు మండిపడ్డారు. జెలియెన్‌స్కీ ఈ పర్యటనను కమల హారిస్ తరఫున క్యాంపెయిన్ నిర్వహించేలా మార్చేశారని విమర్శించారు.
''ప్లీజ్, యుద్ధం గురించి గట్టిగా మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నారా'' అంటూ జెలియెన్‌స్కీ తన మాటలను ప్రారంభించారు. ఆ మాటలను అడ్డుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారు.
''ఆయన గట్టిగా మాట్లాడటం లేదు'' అని చిరాకుగా అన్నారు. ''మీ దేశం పెద్ద సమస్యలో ఉంది'' అని హెచ్చరించారు.
''మీరు గెలవడం లేదు. మీరు గెలవరు కూడా.'' అని ట్రంప్ చెప్పారు. ‘‘మా వల్ల మీరు బయటపడేందుకు మంచి అవకాశం ఉంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
4. ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన జెలియెన్‌స్కీ
''ఇలా మీరు వ్యాపారం చేయాలనుకుంటే అది చాలా కఠినమైన విషయం.'' అని ట్రంప్ అన్నారు. ఇది చాలా క్లిష్టమైన ఒప్పందం, ఎందుకంటే మీ ప్రవర్తనలు మారాలని సూచించారు.
జెలియెన్‌స్కీ తీరు బాగులేదని అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ అన్నారు.
''కేవలం ధన్యవాదాలు చెప్పండి'' అని వాన్స్ ఒకానొక సమయంలో డిమాండ్ చేశారు.
ఆ తరువాత కూడా ముగ్గురు నేతల మధ్య వాగ్వాదం కొనసాగింది. జెలియెన్‌స్కీ స్పందనలు కూడా ఆ క్షణాన అక్కడున్న పరిస్థితుల బట్టి ఉన్నాయి.
రష్యా ఆక్రమణ నుంచి తన దేశాన్ని కాపాడేందుకు జెలియెన్‌స్కీ మూడేళ్లుగా పోరాడుతున్నారు. పుతిన్ విడగొట్టాలనుకున్న తన సమాజాన్ని, రాజకీయ నాయకత్వాన్ని ఒకే దాటిపై ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఇదే గదిలో మరో వ్యక్తి ఆసక్తికరంగా కనిపించారు. వాషింగ్టన్‌లో యుక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా మార్కరోవా.. ఈ మాటల యుద్ధం జరిగేటప్పుడు తన చేతులను తలపై పెట్టుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














