మగవాళ్లను నపుంసకులుగా మార్చే వీడియోలు పోస్టు చేసి లక్షల యూరోలు ఆర్జించిన వెబ్‌సైట్ కథ ఏంటి?

లండన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితులు గురువారం ఓల్డ్ బెయిలీ కోర్టుకి హాజరయ్యారు
    • రచయిత, కేథరిన్ ఇవాన్స్ అండ్ పీఏ మీడియా
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలు ఉంటాయి.

పురుషుల మర్మాంగాలతోపాటు, శరీరంలోని వివిధ అవయవాల తొలగిస్తున్నట్లు చూపించే వీడియోలను తన 22 వేల సబ్‌స్క్రైబర్లకు చూపిస్తూ ఓ వెబ్‌సైట్ నిర్వాహకుడు, అతని సహచరులు సుమారు రూ. 2.69 ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడా కేసు కోర్టుకు వచ్చింది.

మగవాళ్లను నపుంసకులుగా మార్చడంతోపాటు శరీరంలో అవయవాల తొలగింపునకు సంబంధించిన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈ వెబ్‌సైట్లో మారియస్ గుస్తావ్సన్, అతని అనుచరులు వీడియోలు పెట్టారు.

హరింజీకి చెందిన గుస్తావ్సన్, మనిషికి ప్రాణహాని కలిగించే అనేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలను అంగీకరించారు.

ఆయన మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి గురువారం ఓల్డ్ బెయిలీ (లండన్‌లోని సెంట్రల్ క్రిమినల్ కోర్టు)కి హాజరయ్యారు.

స్పెషలిస్ట్ డిటెక్టివ్‌ల సంరక్షణలో ఉన్న 13 మంది బాధితులు వారిపై అభియోగాలు మోపారు.

శరీరానికి హాని చేసే పనులు చేసినట్లు గుస్తావ్సన్ అంగీకరించారు. అందులో శారీరక హానికి సంబంధించిన ఐదు సంఘటనలు, ఒక చిన్నారిని అసభ్యంగా ఫోటో తీయడం, ఆ ఫోటోను ఇతరులకు షేర్ చేయడంతో పాటు క్రైమ్ ప్రొసీడ్ యాక్ట్ 2002లోని 329(1)కి విరుద్ధంగా క్రిమినల్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడం వంటి అభియోగాలున్నాయి.

ఆయనతోపాటు మిగిలిన ఆరుగురు కూడా తాము ఈ చర్యలకు పాల్పడినట్లు అంగీకరించారు.

నపుంసకులుగా మార్చే ఆపరేషన్

ఫొటో సోర్స్, Met Police

2017 నుంచి 2021 మధ్యకాలంలో పే పర్ వ్యూ (చూసినందుకు డబ్బులు చెల్లించడం) వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన ఇలాంటి దారుణమైన అనేక ఆపరేషన్లలో గుస్తావ్సన్ కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు కోర్టుకు వెల్లడించారు.

ఈ కుట్రలో శరీర భాగాలను తొలగించడంతో పాటు వాటి విక్రయాలు కూడా జరిగాయని కోర్టుకు నివేదించారు.

ఈ ఆపరేషన్లను చిత్రీకరించి, వాటిని గుస్తావ్సన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలను సబ్‌స్క్రైబర్లు మెంబర్‌షిప్ పద్ధతిలో ఫ్రీ కేటగిరీ నుంచి వీఐపీ కేటగిరీ వరకూ 100 యూరోలు చెల్లించి వీక్షించారు.

ఈ వ్యవహారమంతా పురుషుల జననేంద్రియాలను తొలగించే ''నుల్లోస్'' (నపుంసకులుగా మారే) కల్చర్‌తో ముడిపడి ఉంది.

జంతువుల జననేంద్రియాలను నిర్వీర్యం చేసేందుకు వాడే వస్తువులతో పాటు అనేక రకాల సాధనాలను వారు ఉపయోగించినట్లు ప్రాసిక్యూటర్ కార్బర్రీ కేసీ వెల్లడించారు.

స్వీడన్‌లో ఉంటున్న ఓ వ్యక్తితో ఫేస్‌టైమ్‌లో మాట్లాడుతూ, తన వృషణాలను తానే కత్తితో కోసుకున్నట్లు గుస్తావ్సన్ చెప్పారని కార్బెర్రీ కోర్టుకు తెలిపారు.

గుస్తావ్‌సన్ అతనితో " ఏం చేయాలో తెలుసు కదా, ఇంకెందుకు ఆలస్యం కానివ్వు.’’ అని అన్నారని కార్బర్రీ చెప్పారు.

మూడు రోజుల తర్వాత కూడా పురుషాంగం కోసేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తిని గుస్తావ్సన్ ప్రోత్సహించినట్లు కార్బర్రీ కోర్టుకు తెలిపారు.

గుస్తావ్సన్ తన పురుషాంగాన్ని కోసుకుని తన ఇంట్లోని ఒక సొరుగులో దాచిపెట్టారని, ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు దానిని గుర్తించారని కార్బెర్రీ చెప్పారు.

2019 ఫిబ్రవరిలో నార్వేజియన్ జాతీయుడొకరు తన కాలుని కోసేసుకున్నారని , ఆ తర్వాత దానిని భద్రపరిచేందుకు మరొకరికి ఇచ్చారని కోర్టుకు తెలియజేశారు.

మరో సంఘటన గురించి కోర్టుకు వివరిస్తున్న సమయంలో ప్రదర్శించిన వీడియోలో, బాధితుడొకరి పిక్క కండరం వెనుక ''ఈఎం'' (యూనుఖ్ మేకర్ - నపుంసకులుగా మార్చేపని) అనే అక్షరాలు ముద్రించివున్నాయి.

ఆ బాధితుడు గుస్తావ్సన్, అతని సహచరులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో దర్యాప్తు మొదలైంది.

బాధితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గుస్తావ్సన్‌ను ''తెలివైన, ప్రొఫెషనల్ వెబ్‌సైట్'' కలిగివున్న ఒక పిచ్చివాడిగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)