ఎలక్టోరల్ బాండ్లు: వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్‌లకు వందల కోట్ల విరాళాలు ఇచ్చింది ఎవరంటే

జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కేసీఆర్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాలుగోస్థానంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు వందల కోట్ల రూపాయల విరాళాలు అందాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల కమిషన్‌ బహిర్గతం చేసిన ఈ డేటాలో 2019 మే తరువాత ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

దేశంలోని పలు సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1806 బాండ్లను కొనుగోలు చేశాయి. మొత్తంగా రూ.1,214,70,99,000 (రూ. 1214.7 కోట్లు) ఆ పార్టీకి విరాళాలుగా వచ్చాయి.

వైఎస్సార్‌సీపీకి సంబంధించి 472 బాండ్ల రూపంలో రూ. 337 కోట్లు విరాళంగా వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి 279 బాండ్ల ద్వారా రూ. 218.88 కోట్లు రాగా జనసేనకు 39 బాండ్ల ద్వారా రూ. 21 కోట్లు వచ్చాయి.

ఈ జాబితాలో మిగిలిన పార్టీలతో పోల్చితే జనసేనకు తక్కువ విరాళాలు వచ్చాయి.

దీనితోపాటు, గుర్తుతెలియని వ్యక్తులు(వీరికి సంబంధించిన వివరాలు లేవు) కూడా పార్టీల బాండ్లను కొన్నారని ఎన్నికల సం‌‍ఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్బీఐ చెప్పింది.

పార్టీల వారీగా ఏ సంస్థ నుంచి ఎంత మొత్తంలో విరాళాలు అందాయో పరిశీలిస్తే..

మేఘా వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి

ఫొటో సోర్స్, PPReddyOfficial/Insta

ఫొటో క్యాప్షన్, మేఘా వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)..

బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాల జాబితా చాలా పెద్దదిగా ఉంది.

రియల్ ఎస్టేట్, ఫార్మా, సోలార్–విండ్ ఎనర్జీ సంస్థలు ఈ పార్టీకి విరాళాలు ఇచ్చాయి. చిన్నచిన్న సంస్థలు కూడా బాండ్లు కొనుగోలు చేశాయి.

వీటిలో లక్ష నుంచి మొదలుకొని కోటి వరకు వివిధ బాండ్లను కొన్న సంస్థలు ఉన్నాయి. చాలావరకు 2023, 2022లోనే బీఆర్ఎస్‌కు ఎక్కువగా విరాళాలు అందాయి..

ఆ వివరాలు..

  • మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ – రూ.195 కోట్లు
  • యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ – రూ.94 కోట్లు
  • చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.50 కోట్లు
  • డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ – రూ.32 కోట్లు
  • హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్ (రెండూ కలిపి) – రూ.50 కోట్లు
  • గుర్తు తెలియని వ్యక్తులు – రూ.23.50 కోట్లు
  • ఐఆర్బీఎంపీ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ – రూ.25 కోట్లు
  • ఎల్ 7 హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.22 కోట్లు
  • కోయ అండ్ కంపెనీ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ – రూ.20 కోట్లు
  • ఎంఎస్ఎన్ ఫార్మా కెమ్ ప్రైవేటు లిమిటెడ్ – రూ.20 కోట్లు
  • హానర్ ల్యాబ్ లిమిటెడ్ – రూ.25 కోట్లు
  • హెచ్ఈఎస్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ – రూ.20 కోట్లు
  • దివిస్ ల్యాబోరేటరీస్ – రూ.20 కోట్లు
  • తెల్లపూర్ టెక్నోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.20 కోట్లు
  • రాజపుష్పా ప్రాపర్టీస్, అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.25 కోట్లు
  • ఎన్ఎస్ఎల్ సెజ్,రెన్యువల్ – రూ.29.5 కోట్లు
  • కె.రహెజా కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.18 కోట్లు
  • కైటెక్స్ గార్మెంట్స్, చిల్డ్రన్ వేర్ – రూ.25 కోట్లు
  • మై హోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.15 కోట్లు
  • ధీరజ్ మెడికల్స్ – రూ.15 కోట్లు
  • అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ – రూ.15 కోట్లు
  • ఆక్వా స్పేస్ డెవలపర్స్ – రూ.15 కోట్లు
  • అరబిందో ఫార్మా – రూ.15 కోట్లు
  • సంధ్య కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ – రూ.13 కోట్లు
  • హాజలో ల్యాబ్ – రూ.12.5 కోట్లు
  • హిండిస్ ల్యాబ్ – రూ.17.5 కోట్లు
  • నాట్కో ఫార్మా లిమిటెడ్ – రూ.20 కోట్లు
  • కెఎన్ఆర్ కన్స్రక్షన్ – రూ.10 కోట్లు
  • ఎంకేజె ఎంటర్ ప్రైజెస్ – రూ.10 కోట్లు
  • సెల్మర్ ల్యాబ్ – రూ.10 కోట్లు
  • శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.10 కోట్లు
  • సూపర్ సైబర్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.10 కోట్లు
  • పీపీఆర్ఎం శాండ్ - రూ.10 కోట్లు
  • ఏక్యూ స్వ్కేర్ రియల్టర్స్ – రూ.8 కోట్లు
  • కామ్న క్రెడిట్స్ అండ్ ప్రమోటర్స్ - రూ.7 కోట్లు
  • ఏవే ట్రాన్స్ – రూ.6 కోట్లు
  • గజా ఇంజనీరింగ్ – రూ.5 కోట్లు
  • యాక్సిస్ క్లినికల్స్ – రూ.5 కోట్లు
  • 14 రీల్స్ - రూ. 1 కోటి
  • 2023 జూలై- ఆలయ కన్‌స్ట్రక్షన్స్ - రూ.1 కోటి
  • 2022 ఏప్రిల్ - ఆస్మాన్ ఎనర్జీ – రూ.2 కోట్లు
  • 2023 జూలై - అభినందన్ స్టాక్ బ్రోకర్స్ – రూ.1 కోటి
  • 2022 అక్టోబరు- అచింత్య సోలార్ – రూ.4 కోట్లు
  • 2023 అక్టోబరు- అక్షత్ గ్రీన్ టెక్ – రూ.5 కోట్లు
  • 2022 ఏప్రిల్- అనంతపుర విండ్ ఎనర్జీలు – రూ.1 కోటి
  • 2021 -అన్బీ కనస్ట్రక్షన్ – రూ.2 కోట్లు
  • 2023 ఏప్రిల్- ఆసియన్ అగ్రి జనటిక్స్ – రూ.4.5 కోట్లు
  • 2023 ఏప్రిల్- బాలాజీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ – రూ.1 కోటి
  • 2023 అక్టోబరు- బెస్సి జెన్ ఇన్ఫోటెక్ – రూ.4 కోట్లు
  • 2023 ఏప్రిల్- భాగ్యనగర్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు – రూ. కోటి
  • 2023 ఏప్రిల్- భాగ్యశ్రీ రియల్టర్ – రూ. 1 కోటి
  • 2021 అక్టోబరు- బిగ్ సీ – రూ.2.5 కోట్లు
  • 2023 జూలై- బస్విని డెవెలపర్స్– రూ.1 కోటి
  • 2023 జూలై -బయోలాజికల్ ఈ – రూ.5 కోట్లు
  • 2022 ఏప్రిల్ -ఎలైట్ డెవలపర్స్ – రూ.2 కోట్లు
  • 2023 జూలై -ముప్పన వెంకట్రావు – రూ.89 లక్షలు
  • బిషప్స్ వీడ్ ఫుడ్ క్రాప్ట్స్ – రూ.1 కోటి
  • బోరవెల్లి భూపాల రెడ్డి, రాములమ్మ – రూ.2 కోట్లు
  • బోస్ కనస్ట్రక్షన్స్ – రూ.50 లక్షలు
  • బ్రిక్స్ ఇన్ఫ్సాటెక్ – రూ.5 కోట్లు
  • బీఎస్సీపీఎల్ ఇన్‌ఫ్రా – రూ.1.5 కోట్లు
  • కమేలియ గృహ నిర్మాణ – రూ.1 కోటి
  • కేప్ ట్రేడింగ్ ఎల్ఎల్పీ– రూ.2 కోట్లు
  • కాసా మారియా ప్రాపర్టీస్ – రూ.2 కోట్లు
  • ఛాయ రియల్ ఎస్టేట్ – రూ. 1 కోటి
  • క్యూరేటెడ్ లివింగ్ సొల్యూషన్స్ – రూ.1 కోటి
  • సైబర్ హోమ్స్ – రూ.1 కోటి
  • దనిక ట్రేడర్స్ - రూ.2.5 కోట్లు
  • దాసామి ల్యాబ్స్ – రూ.2.5 కోట్లు
  • దేశాయి ట్రేడింగ్ కన్సల్టెంట్స్ – రూ.1 కోటి
  • దివ్యశ్రీ హోల్డింగ్, దివ్యశ్రీ సాఫ్ట్‌టెక్ రియల్టర్స్, దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ కలిపి – రూ.3 కోట్లు
  • దోయన్ ఇంజినీరింగ్ – రూ.1 కోటి
  • శ్రీనిధి కనస్ట్రక్షన్స్ – రూ.1 కోటి
  • ఫార్చూన్ ఎస్టేట్ డెవలెపర్స్ – రూ. 1 కోటి
  • గంగధారి హైడ్రో పవర్ – రూ.1 కోటి
  • గంగేస్ జూట్ – రూ.1 కోటి
  • గోరుకంటి దేవంద్రరావు, సురేంద్రరావు, రవీంద్రరావు (ఒక్కొక్కరూ కోటి చొప్పున) – రూ. 3 కోట్లు
  • గ్రీన్ కో గ్రూపు ఎనర్జీ కంపెనీలు – రూ.12 కోట్లు
  • గ్రీనిబ్రిత్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.1 కోటి
  • ఐకానియా ప్రాజెక్ట్స్ – రూ.1 కోటి
  • ఇనార్బిట్ మాల్ – రూ.5 కోట్లు
  • ఐరా బ్లొసమ్ ఫీల్డ్స్ – రూ.3 కోట్లు
  • ఐటీసీ లిమిటెడ్ – రూ.1 కోటీ 60 లక్షల 29 వేలు
  • జేకే పేపర్ లిమిటెడ్ – రూ.50 లక్షలు
  • కార్తికేయ కన్‌స్ట్రక్షన్స్, ఇన్‌ఫ్రా కలిపి – రూ.1 09 కోటి
  • కౌస్తుభ వర్మ – రూ.50 లక్షలు
  • కేఎంకే డెవలపర్స్ – రూ.1 కోటి
  • లక్ష్మీ మెడికల్స్ – రూ.2 కోట్లు
  • లారెల్ సెక్యూరిటీస్ – రూ.2 కోట్లు
  • ఎల్పీఎఫ్ సిస్టమ్స్ – రూ.1 కోటి
  • ఎంబీ పవర్ (మధ్య‌ప్రదేశ్) ప్రైవేట్ లిమిటెడ్ – రూ.5 కోట్లు
  • మిడాస్ ప్రాజెక్ట్స్ – రూ. 1 కోటి
  • మోడర్న్ రోడ్ మేకర్స్ – రూ.5 కోట్లు
  • మిత్రా ఎనర్జీ – రూ.6 కోట్లు
  • ఎన్వీఎన్ఆర్ పవర్ – రూ.2 కోట్లు
  • పాలెం షెల్టర్ ఎస్టేట్ – రూ.2 కోట్లు
  • పీసీబీఎల్ – రూ.5 కోట్లు
  • పెన్నార్ రెన్యువబుల్స్ – రూ.1 కోటి
  • ఆశా ప్రియ ప్రాపర్టీస్ – రూ.3 కోట్లు
  • ప్రభాత్ హోమ్స్ – రూ.2 కోట్లు
  • ప్రత్యేశ్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.2 కోట్లు
  • ప్రీమియర్ ఫోటోవోల్టాయిక్ మెదక్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.1 కోటి
  • ప్రెస్టేజ్ గార్డెన్ ఎస్టేట్స్, ప్రెస్టేజ్ ప్రాజెక్ట్స్ – రూ.10 కోట్లు
  • పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ – రూ.2.5 కోట్లు
  • ఆర్ఆర్ ఇన్‌ఫ్రాటెక్– రూ.2.5 కోట్లు
  • ఆర్ఎన్ కన్‌స్ట్రక్షన్స్ – రూ.2 కోట్లు
  • ఆర్ఎస్ బ్రదర్స్ – రూ.3.5 కోట్లు
కేసీఆర్, జగన్

ఫొటో సోర్స్, TELANGANACMO

  • రఘుకుల ఎస్టేట్స్ – రూ. 2 కోట్లు
  • రాజేశ్ మన్నాలాల్ అగర్వాల్ – రూ. 5 కోట్లు
  • రాయలసీమ విండ్ఎనర్జీ – రూ.1 కోటి
  • రైట్ ఎయిడ్ కన్సల్టెంట్స్ – రూ.1.5 కోట్లు
  • ఆర్టీ రెన్యువబుల్ ఎనర్జీ – రూ.రెండు కోట్లు
  • సాగర్ సిమెంట్ – రూ.50 లక్షలు
  • సాగి వెంకట రామకృష్ణ రాజు – రూ.1 కోటి
  • సోనోలా విండ్ – రూ.2 కోట్లు
  • సరోజ రెన్యుబుల్స్ – రూ.2 కోట్లు
  • ఎస్ఈఐ భాస్కర పవర్ – రూ.2 కోట్లు
  • ఎస్ఈఐ ఎనెర్ స్టార్ రెన్యువబుల్స్ – రూ.2 కోట్లు
  • ఎస్ఈఐ మిహిర్ ఎనర్జీ – రూ.2 కోట్లు
  • ఎస్ఈఐ వీనస్ – రూ.2 కోట్లు
  • శ్రేయస్ రెన్యువబుల్ ఎనర్జీ – రూ.2 కోట్లు
  • సిద్ధార్థ డెవలపర్స్ – రూ.1 కోటి
  • స్మృతి అగర్వాల్ – రూ.1 కోటి
  • సోహిని డెవలపర్స్ – రూ.3 కోట్లు
  • ఎస్ఆర్ డెవలపర్స్ – రూ.1 కోటి
  • శ్రీ డెవలపర్స్ – రూ.1 కోటి
  • శ్రీ కార్తికేయ డెవలపర్స్ – రూ.1 కోటి
  • శ్రీ సాయి బయో ఆర్గానిక్స్ – రూ.3.55 కోట్లు
  • శ్రీ సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ – రూ.1 కోటి
  • శ్రీ వే ఇండస్ట్రీ – రూ.1.49 కోట్లు
  • శ్రీవిలాస్ హైడ్రోటెక్ – రూ.1 కోటి
  • సన్ బోర్న్ ఎనర్జీ – రూ.2 కోట్లు
  • సునీల్ ఇంజినీరింగ్ – రూ.1.5 కోట్లు
  • సువర్చాస్ సోలార్ పవర్ – రూ.1 కోటి
  • స్వర్ణరేథ్ మినరల్ ఇండస్ట్రీస్ – రూ.1 కోటి
  • టనోట్ విండ్ పవర్ – రూ.1 కోటి
  • ది ఆంగస్ కంపెనీ – రూ.2 కోట్లు
  • ది గాంగేస్ మానుఫాక్చరింగ్ – రూ.1 కోటి
  • ట్రిరీమ్ ఇన్‌ఫ్రా – రూ.1 కోటి
  • టీ షార్క్స్ ఇన్ ఫ్రా – రూ.3.5 కోట్లు
  • టీ షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ – రూ.4 కోట్లు
  • వంశీరాం గ్రూపు – రూ.7 కోట్లు
  • వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ – రూ.2 కోట్లు
  • వాసవి అవెన్యూస్ – రూ.5 కోట్లు
  • వసుధ డవలపర్స్ – రూ.1 కోటి
  • వెంకట ప్రణీత్ డవలపర్స్ – రూ.1 కోటి
  • వెర్టెక్స్ వేగ డవలపర్స్ – రూ.4 కోట్లు
  • విశ్వరూప సోలార్ – రూ.2 కోట్లు
  • వెల్‌స్పన్ లివింగ్ – రూ.4 కోట్లు
  • యోగ బిల్డర్స్ – రూ.3 కోట్లు
  • యువన్ ట్రేడింగ్ – రూ.2 కోట్లు
  • జువన్ ఎనర్జీ – రూ.2 కోట్లు

మొత్తంగా రూ. కోటి లోపు వచ్చిన ఎంట్రీలు 362. వీటిలో ఐదు లక్షల నుంచి రూ. కోటి వరకూ బాండ్లు చెల్లించిన వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి.

శాంటియాగో మార్టిన్

ఫొటో సోర్స్, MARTINFOUNDATION.COM

ఫొటో క్యాప్షన్, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఓనర్ శాంటియాగో మార్టిన్

ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నుంచి రూ. 154 కోట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లు భారీగానే అమ్ముడయ్యాయి. వీటిలో ఎక్కువ మొత్తం విండ్ పవర్ కంపెనీల నుంచి వచ్చిన విరాళాలే ఎక్కువగా ఉన్నాయి.

ఓస్ట్రో అనే కంపెనీ నుంచి ‌‍భారీగా విరాళాలు వచ్చాయి. ఈ కంపెనీ వివరాలపై బీబీసీ ఆరా తీయగా, ఒకే వ్యక్తి పలు విభిన్నమైన సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీల్లో చాలావరకు దిల్లీ అడ్రస్‌తో నడుస్తున్నాయి.

అలాగే ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన సంస్ద ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ.

ఈ కంపెనీ సైతం వివి‌ధ సందర్భాల్లో వైఎస్సార్పీపీకి రూ.154 కోట్లు ఇచ్చింది.

అయితే, వైసీపీ అధ్యక్షులు జగన్‌కు సన్నిహితులుగా పేరున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో వంటి కంపెనీలు వైఎస్సార్పీపికి చెందిన ఒక్క బాండును కూడా కొనలేదు.

అలాగే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి 24 బాండ్లు వచ్చాయి.

అవన్నీ ఏప్రిల్ 2019లో కొనగా, గుర్తు తెలియని బాండ్ల విలువ రూ.8.25 కోట్లు.

కోటి కంటే తక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు 124 ఎంట్రీలు ఉన్నాయి.

2023 నవంబరులో ఓస్ట్రో గ్రూపు రూ.34 కోట్లు ఇచ్చింది. ఓస్ట్రో విండ్, ఓస్ట్రో జైసల్మేర్ పేర్లతో విరాళాలు వచ్చాయి.

విరాళాలు.. (రూపాయల్లో)

  • ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ రూ.154 కోట్లు
  • 2024 జనవరిలో నాట్కో ఫార్మా రూ. 3 కోట్లు
  • 2023 జూలైలో మేఘా రూ. 25 కోట్లు
  • 2022 నవంబరులో మేఘా రూ. 12 కోట్లు
  • 2022 డిసెంబరు, 2023 నవంబరులో రాంకో సిమెంట్ రూ. 24 కోట్లు
  • 2022 ఏప్రిల్ లో తానోత్ విండ్ పవర్, తాడాస్ విండ్ ఎనర్జీ రూ. 4 కోట్లు
  • 2023 నవంబరులో స్నేహ కైనెటిక్ పవర్ రూ. 10 కోట్లు
  • 2023 ఏప్రిల్, నవంబరు కలిపి స్కీరాన్ రెన్యువబుల్ ఎనర్జీ రూ. 7 కోట్లు
  • 2023 ఏప్రిల్ శ్రేయస్ రెన్యువబుల్ ఎనర్జీ రూ. కోటి
  • 2021 సేన్ గుప్త అండ్ సేన్ గుప్త కంపెనీ రూ. 1.40 కోట్లు
  • 2022 ఏప్రిల్ ఎస్ఈఐ డైమండ్స్, ఎస్ఈఐ ఆరుషి కలిసి రూ. 3 కోట్లు
  • 2023 నవంబర్ ఖండ్కే విండ్ ఎనర్జీ రూ. 2 కోట్లు
  • 2023 ఏప్రిల్ ఆరిష్ సోలార్ రూ. 2 కోట్లు
  • ఆష్మాన్ ఎనర్జీ రూ.1 కోటి
  • 2022 ఏప్రిల్ అచింత్య సోలార్ రూ.1 కోటి
  • 2023 ఏప్రిల్ అనిమల విండ్ రూ.2 కోట్లు
  • 2023 ఏప్రిల్ యాక్సిస్ విండ్ రూ. 3 కోట్లు
  • 2023 నవంబర్ దేవర విండ్ రూ. 2 కోట్లు
  • 2022, 23 సంవత్సరాల్లో దివ్యేశ్ పవర్ రూ. 3 కోట్లు
  • 2022,23 సంవత్సరాల్లో ఎలెనా రెన్యువబుల్ రూ. 3 కోట్లు
  • 2021 జనవరిలో హిమాలయన్ ఎండీవర్ రూ. 1.4 కోట్లు
  • 2023లో గ్రీన్ కో విండ్ నుంచి రూ. 10 కోట్లు
  • 2023 ఏప్రిల్‌లో ఫ్యూచరిస్టిక్ హ్యాండ్లింగ్ రూ. 5 కోట్లు
  • 2022 డిసెంబరులో ఎవర్ షైన్ ఇంటీరియర్స్ చెన్నై రూ. 5 కోట్లు
నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TELUGUDESAMPARTYOFFICIAL/YT

ఫొటో క్యాప్షన్, బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి రూ.218 కోట్లు వచ్చాయి.

తెలుగుదేశం

తెలుగుదేశానికి 2023, 24 లోనే ఎక్కువగా విరాళాలు అందాయి.

ఇందులోనూ మేఘా కంపెనీదే అగ్రభాగం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఏపీలో ట్రాన్స్‌ఫార్మర్ల కాంట్రాక్టు చేస్తోంది. సీఎం జగన్‌కు సన్నిహితుల కంపెనీగా పేరుంది.

అయితే, ఈ సంస్థ నుంచి టీడీపీకి రూ.40 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు కింద జాబితాలో చూడొచ్చు.

అలాగే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కంపెనీగా పేరున్న రిత్విక్ ప్రాజెక్ట్ నుంచి టీడీపీకి విరాళాలు అందాయి.

  • 2023లో మేఘా రూ. 28 కోట్లు,
  • 2024 జనవరిలో వెస్టర్న్ యూపీ పవర్ రూ.20 కోట్లు
  • 2023 ఏప్రిల్ లో ఎన్ఏఆర్ ఇన్‌ఫ్రా రూ.5 కోట్లు
  • 2024 జనవరిలో నాట్కో ఫార్మా రూ.14 కోట్లు
  • 2022 జులైలో ట్రైడెంట్ కెంఫార్ లిమిటెడ్ రూ.5 కోట్లు
  • 2022 అక్టోబరులో ది రాంకో సిమెంట్స్ రూ.5 కోట్లు
  • 2023 జనవరిలో టెక్రియంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 కోట్లు
  • 2023 నవంబరులో ఏఐసీ వీఎంఆర్ రూ. 2 కోట్లు
  • 2021 ఏప్రిల్ అరవిందో ఫార్మా రూ.2.5 కోట్లు
  • 2024 జనవరిలో భారత్ బయోటెక్ రూ. 10 కోట్లు
  • 2024 ఏప్రిల్ లో బయోవెట్ రూ.5 కోట్లు
  • 2023 ఏప్రిల్ లో సీఆర్ అసోసియేట్స్ రూ. 5 కోట్లు
  • 2024 ఏప్రిల్ లో చిరాన్ బెహ్రింగ్ వ్యాక్సిన్స్ రూ. 5 కోట్లు
  • 2024 జనవరిలో డా. రెడ్డీస్ రూ.13 కోట్లు
  • 2023 జనవరిలో ఎఫిసెన్స్ సాఫ్టువేర్ రూ.2 కోట్లు
  • 2024 జనవరిలో గ్రాన్యుల్స్ ఇండియా రూ. 3 కోట్లు
  • 2023 ఏప్రిల్ లో క్రుతి వెంచర్స్ రూ. 2 కోట్లు
  • 2023 ఏప్రిల్ లో మాత ప్రాజెక్ట్స్ రూ. 5 కోట్లు
  • 2023 జనవరిలో అమరావతి టెక్ సిస్టమ్స్ రూ.2 కోట్లు
  • 2024 జనవరిలో ఆర్సీసీ నూట్రాఫిల్ రూ.5 కోట్లు
  • 2023 జనవరిలో రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.5 కోట్లు
  • 2023 జూలైలో సాగర్ సిమెంట్స్ రూ.50 లక్షలు
  • 2023 నవంబరులో ఎస్ఈపీసీ పవర్ రూ. 5 కోట్లు
  • 2024 జనవరిలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ రూ. 40 కోట్లు
  • 2023 జనవరిలో స్లిక్ సాఫ్ట్‌వేర్ రూ. 1 కోటి
  • 2023 జూలైలో ఎస్ఎల్ఆర్వీ రూ. 2 కోట్లు
  • 2023 నవంబరులో సోమశిల సోలార్ పవర్ రూ.2 కోట్లు
  • 2023 జనవరిలో శ్రీరాయలసీమ హై స్ట్రెంత్ హైపో రూ.కోటి
  • 2024 జనవరిలో శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ 5 కోట్లు
  • 2023 జనవరిలో శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ రూ.1 కోటి
  • 2023 ఏప్రిల్ లో కంచర్ల సుధాకర్ రూ. 5 కోట్లు
  • 2024 జనవరిలో విహాన్ ఆటో వెంచర్స్ రూ.2 కోట్లు
  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 2019 ఏప్రిల్ లో 19 బాండ్లు రాగా వాటి నుంచి అందిన విరాళాలు రూ.7.30 కోట్లు. రూ. కోటి కంటే తక్కువ విరాళాలు వచ్చినవి 32 ఎంట్రీలు
పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena

జనసేన: ఒకే సంస్థ నుంచి రూ.10 కోట్లు

జనసేన పార్టీకి మొత్తం రూ.21 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయి.

అవి..

  • 2022 అక్టోబరులో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ - రూ.4 కోట్లు
  • 2024 జనవరిలో వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్- రూ.10 కోట్లు
  • నాట్కో ఫార్మా రూ.5 కోట్లు,
  • శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్- రూ.1 కోటి,
  • వల్లూరిపల్లి ప్రభు కిశోర్- రూ. 1 కోటి

ఇవి కూడా చదవండి..

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)